PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-union-budget-4c7d8505-ee3c-4823-b1e5-c21e6be680ba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-union-budget-4c7d8505-ee3c-4823-b1e5-c21e6be680ba-415x250-IndiaHerald.jpgఆర్థిక మంత్రి సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్‌ను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. జులై 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ట్యాక్స్ ప్లేయర్లు, పెన్షనర్లు, సామాన్యులు, కన్జ్యూమర్స్‌ అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో భాగంగా చేసే ప్రకటనల వల్ల స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరలు తగ్గుతాయేమో అని ఆశిస్తున్నారు అలా తగ్గితే ఫోన్ రేట్లు దిగి వస్తాయి. దానివల్ల సామాన్య ప్రజలు ఎంతో కొంత డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు. Union Budget {#}Allu Ayaan;Smart phone;central government;Minister;Government;Indiaకేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో గంపెడాశలు.. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతాయా?కేంద్ర బడ్జెట్‌పై అన్ని వర్గాల్లో గంపెడాశలు.. మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతాయా?Union Budget {#}Allu Ayaan;Smart phone;central government;Minister;Government;IndiaFri, 19 Jul 2024 16:10:00 GMTఆర్థిక మంత్రి సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం బడ్జెట్‌ను ఆవిష్కరించే సమయం ఆసన్నమైంది. జులై 23న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దీనిపై ట్యాక్స్ ప్లేయర్లు, పెన్షనర్లు, సామాన్యులు, కన్జ్యూమర్స్‌ అందరూ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ బడ్జెట్‌లో భాగంగా చేసే ప్రకటనల వల్ల స్మార్ట్‌ఫోన్ విడిభాగాల ధరలు తగ్గుతాయేమో అని ఆశిస్తున్నారు అలా తగ్గితే ఫోన్ రేట్లు దిగి వస్తాయి. దానివల్ల సామాన్య ప్రజలు ఎంతో కొంత డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు.

ఇండియాలో మొబైల్ ఫోన్ల ఎక్కువగా తయారు కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గత సంవత్సరం కెమెరా లెన్స్‌ల వంటి కీలక పార్ట్స్‌పై ఇంపోర్ట్ డ్యూటీని భారీగా తగ్గించింది. అంతేకాదు, లిథియం-అయాన్ బ్యాటరీలపై తగ్గించిన పన్ను రేట్లు అలాగే కొనసాగుతాయని చెప్పి శుభవార్త అందించింది. లిథియం అయాన్ బ్యాటరీలు స్మార్ట్ ఫోన్, ఈవీ వెహికల్స్ లో వాడతారు. దానివల్ల ధరలు అనేవి స్థిరంగానే కొనసాగాయి. అయితే ఈసారి కూడా ఫోన్ల ధరలు తగ్గేలాగా ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.  

వారి ప్రకారం, కేంద్ర ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో ప్రొడక్షన్ లింక్డ్‌ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని సమీక్షించే అవకాశం ఉంది. ఈ పథకం దేశీయంగా ఫోన్లను ఉత్పత్తి చేయడానికి కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రత్యేక సబ్సిడీలను అందిస్తుంది. దీని లక్ష్యం ఏమిటంటే, భారీ స్థాయిలో తయారీని ప్రోత్సహించడం, కీలక రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడం, భారతీయ వస్తువులను ప్రపంచవ్యాప్తంగా మరింత పోటీతత్వానికి తీసుకురావడం.

ఈ కార్యక్రమం భారతదేశం వరల్డ్ లీడర్‌గా మారే అవకాశం ఉన్న పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటుంది, ఇది ఎగుమతులను పెంచడానికి, ఉపాధి అవకాశాలను సృష్టించడానికి సహాయపడుతుంది. ఎలక్ట్రానిక్స్, టెక్స్ట్‌టైల్స్‌ వంటి 14 కీలక రంగాలకు PLI పథకాలను ఇప్పటికే ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇతర రంగాలకు విస్తరించాలని పరిశీలిస్తోంది. ఈ ప్రయోజనాలు అనేక కంపెనీలకు విస్తరించబడతాయి, తయారీదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరిస్తాయి, కొత్త అవకాశాలను అందిస్తాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>