MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suman9b5d7011-8db3-4297-a729-c155f7388a3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/suman9b5d7011-8db3-4297-a729-c155f7388a3e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరోలలో సుమన్ ఒకరు. ఈయన తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాలలో కూడా నటించాడు. చాలా సంవత్సరాల పాటు ఇటు తెలుగు , అటు తమిళ ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగించాడు. ఇకపోతే ఈయన కెరియర్ లో అనేక సినిమాలలో హీరోగా నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా సుమన్ అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సుమన్ సినిమాలలో హీరో పాత్రాలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలోనూ , ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తున్నాడుsuman{#}Vijayashanti;suman;Heroine;Hero;Interview;India;Tamil;Teluguఅందుకే నాతో హీరోయిన్స్ అలా ఉండేవారు... సుమన్..!అందుకే నాతో హీరోయిన్స్ అలా ఉండేవారు... సుమన్..!suman{#}Vijayashanti;suman;Heroine;Hero;Interview;India;Tamil;TeluguFri, 19 Jul 2024 10:00:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరోలలో సుమన్ ఒకరు. ఈయన తెలుగు తో పాటు అనేక తమిళ సినిమాలలో కూడా నటించాడు. చాలా సంవత్సరాల పాటు ఇటు తెలుగు , అటు తమిళ ఇండస్ట్రీ లలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగించాడు. ఇకపోతే ఈయన కెరియర్ లో అనేక సినిమాలలో హీరోగా నటించి ఎన్నో అద్భుతమైన విజయాలను కూడా సుమన్ అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో సుమన్ సినిమాలలో హీరో పాత్రాలలో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలోనూ , ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు.

దానితో ఆయన ఎప్పుడు బిజీగానే కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే తాజాగా సుమన్ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. అలాగే తాను సినిమాలలో హీరోగా నటించిన సమయంలో తనతో హీరోయిన్ లు నటించే విషయంలో ఏ విధంగా కంఫర్ట్ అయ్యేవారు. అలా ఎందుకు వారు కంఫర్ట్ గా ఉండేవారు అనే విషయం గురించి క్లియర్ గా చెప్పుకొచ్చాడు. తాజాగా సుమన్ తన సినిమాలలో నటించిన హీరోయిన్ ల గురించి చెబుతూ ... తెలుగులో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లు అయినటువంటి విజయశాంతి .. భానుప్రియ నాతో ఎక్కువ సినిమాలు చేశారు.

నేను ఎప్పుడు కూడా స్క్రీన్ పైనే తప్ప ఏ హీరోయిన్ తోను ప్రేమలో పడలేదు. ట్రాక్ మారిపోతే కెరియర్ భారీ స్థాయిలో దెబ్బతింటుందని నాకు తెలుసు. అందువలన ఎప్పుడూ కూడా నా లిమిట్ లో నేను ఉండేవాడిని. అందు వల్లనే నాతో చేయడానికి ఏ హీరోయిన్ అయినా చాలా కంఫర్ట్ గా ఉండేది. ఈ కారణంవ్గానే నాతో చేయనని ఏ హీరోయిన్ కూడా ఎప్పుడూ చెప్పలేదు అని సుమన్ అన్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం సుమన్ "శివాజీ" సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీలోని పాత్ర ద్వారా ఈయనకు అద్భుతమైన గుర్తింపు ఇండియా వ్యాప్తంగా లభించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>