PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-irrigation-uttar-andhra-sujala-sravanthi-polavaram-left-canal-vamsadhara-nagavali-chandrababu-ysr9f47727c-6bf5-481b-80b0-6c4f8736c4fe-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-irrigation-uttar-andhra-sujala-sravanthi-polavaram-left-canal-vamsadhara-nagavali-chandrababu-ysr9f47727c-6bf5-481b-80b0-6c4f8736c4fe-415x250-IndiaHerald.jpg- 46 మండ‌లాల్లో 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు - వైఎస్ హ‌యాంలో 7 వేల కోట్ల‌తో పాల‌నా ఆమోదం - రు. 645 కోట్ల కేటాయింపులు... రు. 19 కోట్ల ఖ‌ర్చు.. ఎప్ప‌ట‌కి పూర్త‌య్యేనో ? ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) ఉత్తరాంధ్ర సుజ‌ల స్ర‌వంతి. ఇది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వంలో ప్లాన్ చేసుకున్న కీల‌క ప్రాజెక్టు. దీని ద్వారా విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌యన‌గ‌రం ఉమ్మడి జిల్లాల్లో 46 మండలాల్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యికి పైగా గ్రామాల ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించే కీల‌క ప్రాజెక్టు. తొలుత ఈ ప్రాజెక్టును 7 వేల AP irrigation; Uttar Andhra sujala sravanthi; polavaram left canal; vamsadhara; nagavali; Chandrababu; ysr{#}Survey;Y. S. Rajasekhara Reddy;polavaram;Uttarandhra;Polavaram Project;India;CMనీటి తిప్ప‌లు : ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి లెక్క‌లేంటి... క‌ల‌కే ప‌రిమిత‌మా..!నీటి తిప్ప‌లు : ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి లెక్క‌లేంటి... క‌ల‌కే ప‌రిమిత‌మా..!AP irrigation; Uttar Andhra sujala sravanthi; polavaram left canal; vamsadhara; nagavali; Chandrababu; ysr{#}Survey;Y. S. Rajasekhara Reddy;polavaram;Uttarandhra;Polavaram Project;India;CMFri, 19 Jul 2024 08:26:17 GMT- 46 మండ‌లాల్లో 8 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీరు
- వైఎస్ హ‌యాంలో 7 వేల కోట్ల‌తో పాల‌నా ఆమోదం
- రు. 645 కోట్ల కేటాయింపులు... రు. 19 కోట్ల ఖ‌ర్చు.. ఎప్ప‌ట‌కి పూర్త‌య్యేనో ?

( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ )

ఉత్తరాంధ్ర సుజ‌ల స్ర‌వంతి. ఇది వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌భుత్వంలో ప్లాన్ చేసుకున్న కీల‌క ప్రాజెక్టు. దీని ద్వారా విశాఖ‌, శ్రీకాకుళం, విజ‌యన‌గ‌రం ఉమ్మడి జిల్లాల్లో 46 మండలాల్లో 8లక్షల ఎకరాలకు సాగునీరు, వెయ్యికి పైగా గ్రామాల ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించే కీల‌క ప్రాజెక్టు. తొలుత ఈ ప్రాజెక్టును 7 వేల 214 కోట్ల రూపాయ‌ల‌తో చేపట్టేందుకు పాలనామోదం ఇచ్చినా పనులు ముందుకు సాగలేదు. ఇంత‌లోనే రాజ‌శేఖ‌రెడ్డి చ‌నిపోవ‌డం.. త‌ర్వ‌త‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తోనే స‌మ‌యం స‌రిపోయింది.


ఇక‌, విభ‌జ‌న త‌ర్వాత‌.. చంద్ర‌బాబు హ‌యాంలోనూ.. ఇది పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. 2018లో ఈ ప్రాజెక్టును రెండుదశల్లో చేపట్టాలని అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 2వేల 22 కోట్ల రూపాయ‌ల‌తో తొలి దశలో లక్షా 30వేల ఎకరాలకు నీరిచ్చేలా 2 ప్యాకేజీలుగా పనులు చేప‌ట్టారు. ఇంత‌లోనే ఎన్నిక‌లు రావ‌డంతో చంద్ర‌బాబు స‌ర్కారు కూలిపోయి.. జగన్‌ అధికారంలోకి వచ్చారు. ఆయ‌న ప్రాజెక్టుల కంటే.. మేనిఫెస్టోకే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో  ఈ ప్రాజెక్టు పనులేమీ జరగలేదు. రెండు దశలూ కలిపితే ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం 17వేల 50 కోట్ల రూపాయలకు పెరిగింది.


నిజానికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో పోలవరం ఎడమ కాల్వ ప‌నులు అత్యంత కీల‌కం. ఇటీవ‌ల చంద్ర‌బాబు కూడా ఇక్క‌డ ప‌ర్య‌టించి.. ఇదే విష‌యం చెప్పారు. పోలవరం ఎడమ కాలువ పూర్తైన తర్వాత ఆ కాలువ చివర‌ 162వ కిలోమీటరు వద్ద నుంచి నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ నాలుగేళ్లలో పోలవరంఎడమ కాలువ పనులు చేప‌ట్ట‌లేదు. 2020-21 నుంచి ఇప్పటిదాకా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు బడ్జెట్‌లో 645 కోట్ల కేటాయింపులు చూపారే త‌ప్ప‌.. ఖ‌ర్చు మాత్రం 19 కోట్ల రూపాయ‌లు దాట‌లేదు.


పైగా.. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ చేయకపోవడంతో తొలిదశలో పనులు చేయడానికి లేకుండా పోయింది. రెండో దశలో 3వేల800 కోట్ల విలువైన పనులు చేయాల్సి ఉంది.  అయితే.. ఈ ప‌నుల‌కు కూడా భూసేకరణ సమస్యే కీల‌కంగా మారింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం 16 వేల 46 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ఇప్పటిదాకా,.. 7వేల406 ఎకరాలకు సర్వే పూర్తిచేసి ల్యాండ్‌ పొజిషన్‌ షెడ్యూల్‌... విడుదల చేశారు. మిగతా 9వేల ఎకరాల సర్వే తుది దశలో ఉంది. మ‌రి ఎప్ప‌టికి పూర్త‌వుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>