PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/uttarandhra-sujala-sravanthi13dfae38-8c77-4764-ba3b-26b2adb9aeac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/uttarandhra-sujala-sravanthi13dfae38-8c77-4764-ba3b-26b2adb9aeac-415x250-IndiaHerald.jpgగత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేదనే సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారని ప్రజలు భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఉత్తరాంధను సస్యశ్యామలం చేసే సుజల స్రవంతికి వైసీపీ పాలనలో ఒరిగిందేమీ లేదని చాలామంది ఫీలవుతారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. uttarandhra sujala sravanthi{#}pragathi;Godavari River;polavaram;Vishakapatnam;Uttarandhra;Polavaram Project;Jagan;YCP;Nijam;Government;CBN;Andhra Pradesh;CM;News8 లక్షల ఎకరాల రైతుల కల సుజల స్రవంతి.. బాబు పాలనలో రైతుల కష్టాలు తీరతాయా?8 లక్షల ఎకరాల రైతుల కల సుజల స్రవంతి.. బాబు పాలనలో రైతుల కష్టాలు తీరతాయా?uttarandhra sujala sravanthi{#}pragathi;Godavari River;polavaram;Vishakapatnam;Uttarandhra;Polavaram Project;Jagan;YCP;Nijam;Government;CBN;Andhra Pradesh;CM;NewsFri, 19 Jul 2024 07:38:00 GMTగత ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో ప్రగతి సాధించలేదనే సంగతి తెలిసిందే. మాజీ సీఎం జగన్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తారని ప్రజలు భావించినా ఆ దిశగా అడుగులు పడలేదు. ఉత్తరాంధను సస్యశ్యామలం చేసే సుజల స్రవంతికి వైసీపీ పాలనలో ఒరిగిందేమీ లేదని చాలామంది ఫీలవుతారు. అధికారిక గణాంకాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు.
 
భూసేకరణ ప్రక్రియలోనూ ఆలస్యం జరుగుతుండటంతో పాటు ఈ ప్రాజెక్ట్ కు గోదావరి నీటిని తీసుకొనిరావాల్సి ఉండగా పోలవరం ఎడమ కాలువ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడం గమనార్హం. ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాలకు గోదావరి వరద జలాలను తీసుకెళ్లే విధంగా ఈ ప్రాజెక్ట్ రూపకల్పన జరిగింది. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే 30 లక్షల మందికి తాగునీరు, 8 ఎకరాలకు సాగునీరు అందనుంది.
 
జగన్ పాలనలో ఈ ప్రాజెక్ట్ పనులు ఆశించిన స్థాయిలో జరగని నేపథ్యంలో బాబు పాలనలో రైతుల కష్టాలు తీరతాయా? అనే చర్చ జరుగుతుండటం గమనార్హం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కోసం 645 కోట్ల కేటాయింపులు చూపినా ఖర్చు చేసింది మాత్రం కేవలం 18 కోట్ల 64 లక్ష రూపాయలు మాత్రమే కావడం కొసమెరుపు. భూ సమీకరణ జరగకపోతే పనులు ఎలా చేస్తామని గుత్తేదారులు చెబుతున్నారని భోగట్టా.
 
అయితే చంద్రబాబు సర్కార్ మాత్రం ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్ ను శరవేగంగా పూర్తి చేసి అనకాపల్లి, విశాఖ జిల్లాలకు సాగు, తాగునీరు అందించాలని కసరత్తు చేస్తుండటం గమనార్హం. గత ఐదేళ్లుగా పోలవరం ఎడమ కాలువ పనులు నిలిచిపోగా ఆ పనులను వేగంగా పూర్తి చేయాలని కూటమి నేతలు భావిస్తున్న నేపథ్యంలో సుజల స్రవంతి పనులు ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి. 8 లక్షల ఎకరాల రైతుల కల ఈ ప్రాజెక్ట్ ను నిజం చేయనుంది.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>