LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/heamoglobin78989534-b82e-43a5-b358-1c916e465da5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/heamoglobin78989534-b82e-43a5-b358-1c916e465da5-415x250-IndiaHerald.jpgరక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువైతే ఇలా పెంచుకోండి? ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది రక్తహీనత, రక్త ప్రసారణ సమస్యతో బాధపడుతున్నారు.రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తహీనత సమస్యలు ఏర్పడతాయి. హిమోగ్లోబిన్ అనేది శరీరంలో అన్ని బాగాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి, జీవక్రియ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది ఎర్ర రక్త కణాల్లో ఎక్కువగా ఉంటుంది.రక్తం ఎర్రగా ఉండటానికి హిమోగ్లోబినే కారణం. హీమోగ్లోబిన్ కార్బన్ డయాక్సైడ్ ను రక్Heamoglobin{#}Hemoglobin;Copper;Millets;oxygen;Carbon dioxide;Manamరక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువైతే ఇలా పెంచుకోండి?రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువైతే ఇలా పెంచుకోండి?Heamoglobin{#}Hemoglobin;Copper;Millets;oxygen;Carbon dioxide;ManamFri, 19 Jul 2024 13:00:00 GMTరక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువైతే ఇలా పెంచుకోండి ?        

ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా చాలా మంది రక్తహీనత, రక్త ప్రసారణ సమస్యతో బాధపడుతున్నారు.రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు రక్తహీనత సమస్యలు ఏర్పడతాయి. హిమోగ్లోబిన్ అనేది శరీరంలో అన్ని బాగాలకు ఆక్సిజన్ తీసుకువెళ్లడానికి, జీవక్రియ కార్యకలాపాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. ఇది ఎర్ర రక్త కణాల్లో ఎక్కువగా ఉంటుంది.రక్తం ఎర్రగా ఉండటానికి హిమోగ్లోబినే  కారణం. హీమోగ్లోబిన్  కార్బన్ డయాక్సైడ్ ను రక్త కణాల నుండి ఊపిరితిత్తుల్లోకి తీసుకువెళ్తుంది. మనం ఊపిరి వదిలినప్పుడు కార్బన్ డయాక్సైడ్ బయటకు విడుదలవుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం తగ్గినప్పుడు  ఈ కొన్ని ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే సరిపోతుంది.నువ్వులను మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం. నువ్వులలో ఐరన్, ఫోలేట్, ఫ్లేవనాయిడ్లు, కాపర్‌ వంటి పోషకాలు సమృద్దిగా ఉండటం వలన రక్తహీనత సమస్యను తగ్గించటానికి ఉపయోగపడుతుంది.


 రక్తహీనత సమస్య ఉన్నవారిలో ఎక్కువగా నీరసం,అలసట కనిపిస్తుంది. నువ్వులు,బెల్లం కలిపి ఉండలుగా చేసుకొని రోజుకి ఒకటి  లేదా రెండు తింటే సరిపోతుంది.ఈ మధ్య కాలంలో మిల్లెట్స్‌  చాలా ఎక్కువగా వాడుతున్నారు. మిల్లెట్స్ లో ఒకటైన ఊదలను ఆహారంలో బాగంగా చేసుకుంటే హిమోగ్లోబిన్‌ స్థాయులు పెరుగుతాయి. ఊదలలో కెలొరీలు తక్కువ, ఫైబర్‌, ప్రొటీన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. రోజులో ఒకసారి తీసుకుంటే రోజులో శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని చాలా తొందరగా పెంచుతుంది.ఎండుద్రాక్షలో ఐరన్, కాపర్ చాలా సమృద్దిగా ఉండుట వలన ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు, హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి సహాయపడుతుంది . రోజుకి 5నుంచి 8ఎండుద్రాక్షను తింటే సరిపోతుంది. ఇలా రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచే ఆహారాలను రెగ్యులర్ గా మన ఆహారంలో తీసుకుంటే ఎలాంటి రక్తహీనత సమస్యలు తగ్గటమే కాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>