BusinessDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/mukesh-ambani-family-prapertybdd88b70-697b-4812-b17c-127ada59c073-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/mukesh-ambani-family-prapertybdd88b70-697b-4812-b17c-127ada59c073-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల స్థానాలలో 11వ స్థానంలో ఉన్నారు రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ.. ఇక ఈయన లగ్జరీ లైఫ్ గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈయన నికర ఆస్తి విలువ సుమారుగా రూ.10.21 లక్షల కోట్ల రూపాయలు ఉందని అంచనా మేరకే.. ఇన్ని లక్షల కోట్ల ఉన్న అంబానీ ఆస్తులు కరిగిపోవాలి అంటే ఎన్ని రోజులు సమయం పడుతుందనే విషయం ఎవరైనా ఆలోచించారా అందుకు సంబంధించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. వాటి గురించి చూద్దాం. ముఖేష్ అంబానీ కుటుంబం ప్రతిరోజు రూ .3కోట్ల రూపాయల వరకు ఖర్చు చMUKESH AMBANI FAMILY;PRAPERTY{#}Mukesh;sampada;Reliance;Petrol;Gift;Manam;Newsఅంబానీ సంపద మొత్తం కరిగిపోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా..?అంబానీ సంపద మొత్తం కరిగిపోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా..?MUKESH AMBANI FAMILY;PRAPERTY{#}Mukesh;sampada;Reliance;Petrol;Gift;Manam;NewsFri, 19 Jul 2024 07:28:51 GMTప్రపంచంలోనే అత్యధిక సంపన్నుల స్థానాలలో 11వ స్థానంలో ఉన్నారు రిలయన్స్ దిగ్గజ అధినేత ముఖేష్ అంబానీ.. ఇక ఈయన లగ్జరీ లైఫ్ గురించి మనం చెప్పాల్సిన పనిలేదు.. అయితే ఈయన నికర ఆస్తి విలువ సుమారుగా రూ.10.21 లక్షల కోట్ల రూపాయలు ఉందని అంచనా మేరకే.. ఇన్ని లక్షల కోట్ల ఉన్న అంబానీ ఆస్తులు కరిగిపోవాలి అంటే ఎన్ని రోజులు సమయం పడుతుందనే విషయం ఎవరైనా ఆలోచించారా అందుకు సంబంధించి ఒక న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. వాటి గురించి చూద్దాం.


ముఖేష్ అంబానీ కుటుంబం ప్రతిరోజు రూ .3కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తుందట. లేకపోతే విరాళంగా ఇచ్చిన కూడా వారి సంపద కరిగిపోవడానికి సుమారుగా 3,40,379 రోజులు పడుతుందట.. ఏడాదికి 365 రోజులు వేసుకుంటే.. సుమారుగా 932 సంవత్సరాల ఆరు నెలలకు అంబానీ సంపాదించిన 10.21 లక్షల కోట్ల రూపాయల సంపద జీరోకి అవుతుందట.. అయితే కొన్ని నివేదికలు తెలిపిన ప్రకారం 2024 ప్రారంభం నుంచి ఇప్పటివరకు అంబానీ ఆస్తి విలువ సుమారుగా 1.98 లక్షల కోట్ల రూపాయలు పెరిగినట్లు తెలియజేశారు.


ఇటీవల తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి 5000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే విధంగా వార్తలు వినిపించాయి.. అంతేకాకుండా ఈ పెళ్లికి వచ్చిన అతిథులకు కూడా అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి మరి పంపించారు ముఖేష్ అంబానీ.. ఇవే కాకుండా పలు రకాల వస్త్ర వ్యాపారాలలో, టెలికాం దిగ్గజ సంస్థలలో, పెట్రోల్ వ్యవస్థలో, రిలయన్స్ మార్కెటింగ్ ఇతరత్రా సంస్థలలో కూడా భారీగానే లాభాలు అందుకుంటున్నారు ముఖేష్ అంబానీ. అయితే అంబానీ ఎంత గొప్పగా బతికినా కూడా కేవలం తన దగ్గర ఎలాంటి క్రెడిట్ కార్డులు కూడా లేకుండా క్యాష్ రూపంలోనే నగదును చెల్లిస్తూ ఉంటారట. ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>