PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrababu-chandrababu-tdp-chandrababu-mla-sriram-thathay-jag-gai-beta-mla-sriram-datiya-tg-bharat7d015e34-e8f1-44ba-87d7-8c4e6679e5d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrababu-chandrababu-tdp-chandrababu-mla-sriram-thathay-jag-gai-beta-mla-sriram-datiya-tg-bharat7d015e34-e8f1-44ba-87d7-8c4e6679e5d9-415x250-IndiaHerald.jpg- జ‌గ్గ‌య్య‌పేట నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత‌ - వైశ్య సామాజిక వ‌ర్గంలో సీనియ‌ర్ నేత‌ - పార్టీ కోసం క‌మిట్‌మెంట్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి - మంచి నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తార‌ని క‌మ్యూనిటీ ఆశ‌లు ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతుంది. ఇప్పటికే చంద్రబాబు తన క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక నామినేటెడ్ పదవుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్లపాటు కష్టపడిన వారందరూ పదవుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే కచAP CM Chandrababu; Chandrababu; TDP Chandrababu; MLA Sriram thathay; Jag gai beta MLA Sriram datiya; TG Bharat{#}Jaggayyapeta;Cabinet;bharath;Sri Bharath;Minister;Government;MLA;Party;CBN;India;NTR;TDPటీడీపీలో తాత‌య్య‌కు బాబు న్యాయం చేస్తారా.. ప‌ద‌వి ఇవ్వాల్సిందే..!టీడీపీలో తాత‌య్య‌కు బాబు న్యాయం చేస్తారా.. ప‌ద‌వి ఇవ్వాల్సిందే..!AP CM Chandrababu; Chandrababu; TDP Chandrababu; MLA Sriram thathay; Jag gai beta MLA Sriram datiya; TG Bharat{#}Jaggayyapeta;Cabinet;bharath;Sri Bharath;Minister;Government;MLA;Party;CBN;India;NTR;TDPFri, 19 Jul 2024 16:30:54 GMT- జ‌గ్గ‌య్య‌పేట నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేత‌
- వైశ్య సామాజిక వ‌ర్గంలో సీనియ‌ర్ నేత‌
- పార్టీ కోసం క‌మిట్‌మెంట్‌గా ప‌నిచేసిన వ్య‌క్తి
- మంచి నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తార‌ని క‌మ్యూనిటీ ఆశ‌లు

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటుతుంది. ఇప్పటికే చంద్రబాబు తన క్యాబినెట్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక నామినేటెడ్ పదవుల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఐదేళ్లపాటు కష్టపడిన వారందరూ పదవుల కోసం దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అనుకున్న కొందరు నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదు. ఆ నేతలకు ఇప్పుడు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాలోని.. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీరామ్‌ తాతయ్య మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు.


2009లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2014, 2024 తో కలుపుకుని మొత్తం మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. జగ్గయ్యపేట లాంటి సంక్లిష్టమైన నియోజకవర్గంలో 20 సంవత్సరాలకు పైగా పార్టీని నడుపుతూ.. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే మామూలు విషయం కాదు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన ఆయనకు వాస్తవంగా 2014లో టీడీపీ ప్రభుత్వంలోనే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. అయితే తాతయ్యకు ఎలాంటి పదవి దక్కలేదు. అప్పుడు సిద్ధా రాఘ‌వ‌రావుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.


ఈసారి అయినా వైశ్య సామజిక‌వర్గం నుంచి తాతయ్యకు మంత్రి పదవి వస్తుందని అనుకుంటే.. చంద్రబాబు కర్నూలు ఎమ్మెల్యే టీజీ భర‌త్ కు అవకాశం ఇచ్చారు. వాస్తవంగా భరత్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి సామాజికవర్గ పరంగా ఎప్పటినుంచో పార్టీని అంటిపెట్టుకొని ఉండడంతో పాటు.. మూడుసార్లు గెలిచిన తాతయ్యకు పార్టీ పరంగా ప్రభుత్వంలోని కీలకమైన పదవులు కట్టబెట్టాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన సామాజికవర్గంలో బలమైన డిమాండ్ వినిపిస్తోంది. మరి చంద్రబాబు తాతయ్యకు ఎలా న్యాయం ? చేస్తారో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>