LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health18c79a5a-b715-4843-b729-a97281642b29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health18c79a5a-b715-4843-b729-a97281642b29-415x250-IndiaHerald.jpgసడెన్గా బరువు తగ్గుతున్నారా? అయితే ఈ భయంకర సమస్యలు ఖాయం? ఈ కాలంలో మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా బరువు పెరుగుట లేదా ఊబకాయం అనేది చాలా మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ సమస్యగా ఇప్పుడు మారింది.ఎన్నో అనారోగ్య సమస్యలకు ఊబకాయమే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆహారంలో మార్పుల నుండి తీవ్రమైన వ్యాయామం దాకా చాలా రకాలుగా శ్రమిస్తున్నారు. అయినా కానీ ఆశించిన స్థాయిలో బరువు తగ్గడం లేదని బాధపడి పోతునHealth{#}Insulin;Manamసడెన్గా బరువు తగ్గుతున్నారా? అయితే ఈ భయంకర సమస్యలు ఖాయం?సడెన్గా బరువు తగ్గుతున్నారా? అయితే ఈ భయంకర సమస్యలు ఖాయం?Health{#}Insulin;ManamFri, 19 Jul 2024 22:00:00 GMTసడెన్గా బరువు తగ్గుతున్నారా ? అయితే ఈ భయంకర సమస్యలు ఖాయం ?  

ఈ కాలంలో మనల్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా బరువు పెరుగుట లేదా ఊబకాయం అనేది చాలా మందిని ప్రభావితం చేసే అత్యంత సాధారణ సమస్యగా ఇప్పుడు మారింది.ఎన్నో అనారోగ్య సమస్యలకు ఊబకాయమే కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ప్రజలు బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆహారంలో మార్పుల నుండి తీవ్రమైన వ్యాయామం దాకా చాలా రకాలుగా శ్రమిస్తున్నారు. అయినా కానీ ఆశించిన స్థాయిలో బరువు తగ్గడం లేదని బాధపడి పోతున్నారు. ఈ క్రమంలోనే.. దీనికి విరుద్ధంగా, కొంతమంది ఏమీ చేయనప్పటికీ సడెన్ గా గణనీయమైన బరువు తగ్గడం జరుగుతుంది. ఆకస్మికంగా బరువు తగ్గడం అనేది.. కొన్ని వ్యాధుల లక్షణాల హెచ్చరిక అని డాక్టర్లు చెబుతున్నారు.అయితే బరువు తగ్గడానికి ఎలాంటి ప్రయత్నం లేకుండా అధికంగా బరువు తగ్గడం అనేది చాలా అనారోగ్యకరమైనదిగా పరిగణిస్తారు.


 అలాంటప్పుడు ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం అవసరం..సడన్ గా బరువు తగ్గడం ఖచ్చితంగా ఈ వ్యాధులకు సంకేతం కావొచ్చు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.సడెన్ గా బరువు తగ్గడం మధుమేహం యొక్క సాధారణ లక్షణం. మన శరీరం తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు, అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ఉత్పత్తి చేయలేకపోతుంది. ఈ సందర్భంలో సడెన్ గా బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.అలాగే పొట్టలో పుండ్లు లేదా అల్సర్లతో బాధపడేవారిలో కూడా బరువు తగ్గడం సర్వసాధారణం.ఇంకా కొందరిలో విపరీతమైన దుఃఖం, నిస్పృహ, డిప్రెషన్ వంటివి అనుకోకుండా బరువు తగ్గడానికి దారితీస్తాయి.అలాగే రొమ్ము, ఊపిరితిత్తులు, ప్యాంక్రియాటిక్, అండాశయం ఇంకా పెద్దప్రేగు క్యాన్సర్‌తో సహా వివిధ రకాల క్యాన్సర్‌లతో బరువు తగ్గడం కూడా సంభవించవచ్చు.ఇంకా కొందరిలో అయితే థైరాయిడ్ ప్రారంభ దశలో కూడా అధిక బరువు తగ్గడం జరుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>