PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ysrcp-pulvendala-mla-jagan-perina-nani-kodali-nani-vijay-sai-reddy9db8911c-9386-4c72-8862-ffb45a48e198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ys-jagan-ysrcp-pulvendala-mla-jagan-perina-nani-kodali-nani-vijay-sai-reddy9db8911c-9386-4c72-8862-ffb45a48e198-415x250-IndiaHerald.jpg- జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ‌తార‌ని ముందే చెప్పేసిన పేర్ని నాని - శ్వేత‌ప‌త్రం గేమ్ ను అసెంబ్లీకి షిఫ్ట్ చేసిన టీడీపీ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు అవుతారని.. ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన తొందరపాటు నిర్ణయంగా వైసీపీ భావిస్తుందా..? ఇదే సభలో వైసీపీని మరింతగా ఇరుకున పెట్టడానికి కారణం అవుతుందని ఓ అంచనాకు వచ్చారా..? అంటే అవుననే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జగన్ అసెంబ్లీకి హాజరవుతారనే ప్రకటన చాలా సీక్రెట్ గా ఉంచాల్సిందని Ys Jagan; ysrcp; pulvendala MLA Jagan; perina Nani; kodali Nani; Vijay Sai Reddy{#}swetha;Perni Nani;Amaravathi;YCP;Telangana Chief Minister;Assembly;Government;Andhra Pradesh;GEUM;Party;Jagan;Reddy;CBN;India;thursdayజ‌గ‌న్‌ను ముంచడానికి పేర్ని నాని ఒక్క‌డు చాలు...!జ‌గ‌న్‌ను ముంచడానికి పేర్ని నాని ఒక్క‌డు చాలు...!Ys Jagan; ysrcp; pulvendala MLA Jagan; perina Nani; kodali Nani; Vijay Sai Reddy{#}swetha;Perni Nani;Amaravathi;YCP;Telangana Chief Minister;Assembly;Government;Andhra Pradesh;GEUM;Party;Jagan;Reddy;CBN;India;thursdayFri, 19 Jul 2024 16:26:38 GMT- జ‌గ‌న్ అసెంబ్లీకి వెళ‌తార‌ని ముందే చెప్పేసిన పేర్ని నాని
- శ్వేత‌ప‌త్రం గేమ్ ను అసెంబ్లీకి షిఫ్ట్ చేసిన టీడీపీ

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరు అవుతారని.. ఆ పార్టీ నేతలు చేసిన ప్రకటన తొందరపాటు నిర్ణయంగా వైసీపీ భావిస్తుందా..? ఇదే సభలో వైసీపీని మరింతగా ఇరుకున పెట్టడానికి కారణం అవుతుందని ఓ అంచనాకు వచ్చారా..? అంటే అవుననే ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జగన్ అసెంబ్లీకి హాజరవుతారనే ప్రకటన చాలా సీక్రెట్ గా ఉంచాల్సిందని వైసీపీలోనే చర్చ జరుగుతుంది. జగన్ అసెంబ్లీకి వస్తున్నారని పేర్ని నాని ముందే చెప్పటం వల్ల కూటమి ప్రభుత్వానికి పెద్ద ప్లస్ పాయింట్ అని వైసీపీ ఇప్పుడు ఆందోళన చెందుతుంది.


జగన్ కు ఉచ్చు బిగించేలా అధికారపక్షం, అస్త్ర శ‌స్త్రాలను రూపొందించి సభలో జగన్‌ను డిఫెన్స్‌లో పడేసేలా చేస్తుందని వైసీపీ ఇప్పుడు భయపడుతోంది. గురువారం సాయంత్రం శాంతిభద్రతలపై సచివాలయంలో చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేయాలని అనుకున్నారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తున్నారని ప్రకటనతో వైసీపీ హయంలో శాంతి భద్రత వైఫల్యాన్ని జగన్‌కే త్రీడీలో చూపించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.


అందుకే ఈ శ్వేత పత్రం వేదికను అసెంబ్లీకి మార్చి.. అక్కడ జగన్ ముందే చంద్రబాబు స్వయంగా చదివి వినిపించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో శాంతి భ‌ద్ర‌త‌లు రోజురోజుకు దిగజారుతున్నాయ‌ని జగన్ చేస్తున్న ఆరోపణలకు.. అసెంబ్లీ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చి జగన్ తో పాటు వైసీపీ నేతల నోరు మూయించాలని చంద్రబాబు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఇవన్నీ జగన్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేవే. ఏది ఏమైనా పేర్ని నాని జగన్‌ను కాపాడటం సంగతేమో గాని.. జగన్‌ను మరింతగా ఇరికిస్తున్నట్టుగా ఆయన ప్రెస్‌మీట్‌లు.. ఆయన చర్యలు కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>