HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health42cdb6ff-3547-47dc-bb05-fadc50a5bccb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health42cdb6ff-3547-47dc-bb05-fadc50a5bccb-415x250-IndiaHerald.jpgకీర దోస అనేది రుచి మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. విటమిన్లు, మినరల్స్, ఖనిజాలు ఇంకా ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. కీర దోస తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు: హైడ్రేషన్: కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి డిహైడ్రేట్ నుంచి శరీరాన్ని హైడ్రేట్ గా మార్చడనికి కీరదోస సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుదల: కీరదోసలోని ఫైబర్, విటమిన్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మలబద్ధకం నివారించడానికి సహాయపడుతుంది. గుండె ఆరోగ్యం: కీరదోసలోని పొటాషియం, కాల్షియం రక్తపోటును నియంతHealth{#}Vitamin C;Potassium;Vitamin;Calcium;Aqua;Heartకీర దోస వల్ల కలిగే లాభాలు, నష్టాలు?కీర దోస వల్ల కలిగే లాభాలు, నష్టాలు?Health{#}Vitamin C;Potassium;Vitamin;Calcium;Aqua;HeartThu, 18 Jul 2024 13:35:45 GMTనీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని డి హైడ్రేట్ నుంచి శరీరాన్ని హైడ్రేట్ గామార్చడనికి సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుదల ఉంటుంది. ఈ కీరదోసలోని ఫైబర్, విటమిన్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి  ఇంకా అలాగే మలబద్ధకం నివారించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కీర దోస వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. కీర దోసలోని పొటాషియం, కాల్షియం రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. పైగా ఇది గుండెజబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించేందుకు ఉపయోగపడుతుంది.ఇది చర్మ ఆరోగ్యంని మెరుగుపరుస్తుంది. కీరదోసలోని విటమిన్ సి చర్మానికి చాలా మంచిది. ఇది స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. పైగా ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది.


బరువు తగ్గడం కోసం కీర దోస చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కీరదోసలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది. అయితే ఈ కీరదోస ఎక్కువగా తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా సంభవించవచ్చు. అవేంటంటే దీన్ని ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది. కీర దోసలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నొప్పి , బ్లోటింగ్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా ఇష్టంగా  తినే వారు జాగ్రత్త గా ఉండాలి.ఈ కీరదోసలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల మూత్రపిండ సమస్యలు ఉన్నవారికి ప్రమాదం. ఇంకా అలాగే ఎలక్ట్రోలైట్ బ్యాలన్స్ అసమతుల్యతకు దారితీస్తుంది. పోషకాల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. కీర దోస ఎక్కువగా తినడం వల్ల శరీరంలోని ఇతర పోషకాల శోషణను ప్రభావితం చేస్తుంది. దీన్ని ఎక్కువగా తింటే డయేరియా వస్తుంది.కీరదోసలోని ఫైబర్ ఖచ్చితంగా డయేరియాకు దారితీస్తుంది. మరీ ముఖ్యంగా జీర్ణ సమస్యలు ఉన్నవారికి ఇది అస్సలు మంచిది కాదు. దీన్ని ఎక్కువగా తింటే అలెర్జీలు కూడా వస్తాయి. కొంతమందికి కీరదోస ఎక్కువగా తినడం వల్ల అలెర్జీ రావొచ్చు. దీనివల్ల చర్మం డ్రై అయిపోతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>