BusinessSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/google-maps476dbb72-27ca-4d84-9e04-1194b3d34a92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/google-maps476dbb72-27ca-4d84-9e04-1194b3d34a92-415x250-IndiaHerald.jpgమీరు ఐఫోన్ యూజర్ అయితే మీకు శుభవార్త. గూగుల్ తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ప్రస్తుతం గూగుల్ సరికొత్తగా ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది మిలియన్ల మంది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐ ఫోన్ యూజర్ల కార్‌ప్లే కోసం లైవ్ స్పీడోమీటర్, స్పీడ్ లిమిట్ డిస్‌ప్లేను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఐదేళ్ల క్రితం అంటే 2019లోనే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ఐఓఎస్ యూజర్లకు తాజాగా అంGoogle Maps{#}iPhone;Google;Smart phoneగూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా.. ఐ ఫోన్లలో అందుబాటులోకి రెండు సరికొత్త అప్‌డేట్స్!గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారా.. ఐ ఫోన్లలో అందుబాటులోకి రెండు సరికొత్త అప్‌డేట్స్!Google Maps{#}iPhone;Google;Smart phoneThu, 18 Jul 2024 18:00:00 GMTమీరు ఐఫోన్ యూజర్ అయితే మీకు శుభవార్త. గూగుల్ తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల సౌలభ్యం కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తూనే ఉంది. ప్రస్తుతం గూగుల్ సరికొత్తగా ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది మిలియన్ల మంది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐ ఫోన్ యూజర్ల కార్‌ప్లే కోసం లైవ్ స్పీడోమీటర్, స్పీడ్ లిమిట్ డిస్‌ప్లేను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. ఐదేళ్ల క్రితం అంటే 2019లోనే ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఈ ఫీచర్‌ను ప్రారంభించింది. ఇది ఐఓఎస్ యూజర్లకు తాజాగా అందుబాటులోకి వచ్చింది. ఇంతకుముందు 2019లో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ ఫీచర్‌ను గూగుల్ ప్రవేశపెట్టింది. అయితే తర్వాత ఇది 40 కంటే ఎక్కువ దేశాలలో విడుదల చేయబడింది. 5 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గూగుల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారుల కోసం దీనిని విడుదల చేసింది.

గూగుల్ మ్యాప్‌లతో లైవ్ స్పీడోమీటర్, వేగ పరిమితిని ఈ ఫీచర్‌లో కనిపిస్తాయి. లక్షలాది మంది డ్రైవింగ్ వినియోగదారులకు ఇది చాలా సౌకర్యాన్ని అందించబోతోంది. గూగుల్ ఈ కొత్త ఫీచర్ ఐఓఎస్ వెర్షన్ 6.123.0 అప్‌డేట్ ఉన్న యూజర్లకు అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి, ఐఫోన్ కార్ ప్లే యూజర్లు వారి ఐ ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలి. ముందుగా యూజర్లు వారి ఐఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాక, స్క్రీన్ పై భాగంలో కనిపించే ప్రొఫైల్ ఫోటోపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మెను నుంచి సెట్టింగ్‌లకు వెళ్లాలి. సెట్టింగ్స్ మెనూలో నావిగేషన్ & డ్రైవింగ్ ఆప్షన్ ఎంచుకుని దానిపై క్లిక్ చేయాలి. అనంతరం స్పీడోమీటర్/స్పీడ్ లిమిట్ టోగుల్‌ని చూసి ఎనేబుల్ చేయాలి. టోగుల్‌ని ఎనేబుల్ చేసిన తర్వాత, స్పీడ్ లిమిట్ ఫీచర్ నావిగేషన్ స్క్రీన్‌కి కింది భాగంలో ఎడమ వైపున మూలన రౌండ్ ఫ్లోటింగ్ ఐకాన్‌గా కనిపిస్తుంది. ఇది యూజ్ చేసుకుంటే మీరు కార్‌లో ఎంత స్పీడ్‌లో ప్రయాణిస్తున్నారో ఎప్పటికప్పుడు మీకు వాయిస్ రూపంలో వినిపిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>