PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi-pawan-amithshah-tdp-bjp-janasena-ap-c8f21e30-899c-4770-bb66-e5f4aacc49a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/modi-pawan-amithshah-tdp-bjp-janasena-ap-c8f21e30-899c-4770-bb66-e5f4aacc49a6-415x250-IndiaHerald.jpgరాష్ట్రంలో నాలుగోసారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటినుంచి ప్రజలంతా ఆయనపై ప్రత్యేకమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే అభివృద్ధి అనే బ్రాండ్ ఆయనకు ఎప్పటి నుంచే ఉంది. ఆయనకు ఏ మాత్రం కేంద్రం సహకారం అందించిన అభివృద్ధిపై దృష్టి పెట్టి భవిష్యత్తు తరాలకు లైఫ్ అందించే విధానాలను రూపుదిద్దుతారు. అలాంటి చంద్రబాబు ఈసారి పవన్ తో జతకట్టడం వల్ల ఏపీలో కీలకం కావడమే కాకుండా, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నాడు. బిజెపిmodi;pawan;amithshah;tdp;bjp;janasena;ap;{#}kalyan;Manam;Telangana;swetha;Delhi;Telangana Chief Minister;Capital;Chakram;YCP;TDP;Bharatiya Janata Party;Parliment;central government;CBN;Vishakapatnam;polavaram;Polavaram Project;Andhra Pradesh;Parliamentపార్లమెంటు ఫైట్:ఏపీకి ప్రత్యేక సాయం.. కొట్లాడాల్సిన సమయం ఆసన్నం.!పార్లమెంటు ఫైట్:ఏపీకి ప్రత్యేక సాయం.. కొట్లాడాల్సిన సమయం ఆసన్నం.!modi;pawan;amithshah;tdp;bjp;janasena;ap;{#}kalyan;Manam;Telangana;swetha;Delhi;Telangana Chief Minister;Capital;Chakram;YCP;TDP;Bharatiya Janata Party;Parliment;central government;CBN;Vishakapatnam;polavaram;Polavaram Project;Andhra Pradesh;ParliamentThu, 18 Jul 2024 08:16:00 GMT- చంద్రబాబు అంటేనే అభివృద్ధి
- పవన్ తో జతకట్టి జాతీయస్థాయిలో కీలకం.
- కేంద్రం మెడలు వంచి నిధులు తేవడమే లక్ష్యం.


రాష్ట్రంలో నాలుగోసారి సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటినుంచి ప్రజలంతా ఆయనపై ప్రత్యేకమైన నమ్మకాన్ని ఏర్పరచుకున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు,  చంద్రబాబు అంటే అభివృద్ధి అనే  బ్రాండ్ ఆయనకు ఎప్పటి నుంచే ఉంది. ఆయనకు ఏ మాత్రం కేంద్రం సహకారం అందించిన అభివృద్ధిపై దృష్టి పెట్టి భవిష్యత్తు తరాలకు లైఫ్ అందించే విధానాలను రూపుదిద్దుతారు.  అలాంటి చంద్రబాబు ఈసారి పవన్ తో జతకట్టడం వల్ల ఏపీలో కీలకం కావడమే కాకుండా, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే స్థాయికి చేరుకున్నాడు. బిజెపి ప్రభుత్వానికి గుండెకాయల మారడు అని చెప్పవచ్చు.  అలాంటి ఈయన ఇదే అదునుగా భావించి ఏపీని అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు  అడుగులు వేస్తున్నారు.


 ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ దారుణంగా నష్టపోయిందని, రాజధాని కూడా లేదని,  అంతేకాకుండా వైసిపి ప్రభుత్వం హయాంలో విపరీతంగా అప్పుల పాలయిందని, అభివృద్ధి ఏమి జరగలేదని దానిపై శ్వేతా పత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు.  అంతేకాకుండా రాబోవు ఐదు సంవత్సరాలలో ఏపీని ఏ విధంగా అభివృద్ధి చేస్తే, భవిష్యత్తు తరాలకు ఉద్యోగ కల్పన వస్తుందో ఆ దిశగా అడుగులు వేస్తూ ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక కంపెనీ పెట్టించే విధంగా  కసరత్తులు మొదలుపెట్టారు. ఏపీలో ఉన్నటువంటి నిధులతో పాటు కేంద్రం నుంచి మనం ఎన్ని నిధులు తెచ్చుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలనే దానిపై ఇప్పటికే లిస్టు తయారు చేసుకుని పెట్టుకున్నారు.  రాబోవు పార్లమెంటు సమావేశాల్లో ఈ లిస్టు మొత్తం కేంద్ర పెద్దల ముందరపెట్టి  ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కొట్లాడడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 బడ్జెట్ పై కొట్లాట:
 ఈనెల 23వ తేదీన  కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని కోరుతూ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర నాయకులను కలిశారు. అంతేకాకుండా విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని అన్నారు. అంతేకాకుండా అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక సాయాన్ని ప్రకటించాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ ధ్వంసం అయ్యాయని, అలాగే రైలు మార్గాలు మంజూరు చేయాలని, విశాఖ రైల్వే జోన్ ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని , పారిశ్రామిక కారిడార్లు వేగవంతంగా ఏర్పాటు కావాలని అన్నారు.


అంతేకాకుండా రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అనువైన పరిశ్రమల ఏర్పాటు కూడా సహకారం అందించాలని తెలియజేశారు. ఇదే విషయమై పార్లమెంటు సమావేశాల్లో  టిడిపి కూటమి ఎంపీలంతా తప్పనిసరిగా కొట్లాడాలని వారికి దిశా నిర్దేశం చేశారు. దేశ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తిగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా వీరు అడిగిన  అభివృద్ధి పనులపై కేంద్రం కూడా  సహకారం అందించే  అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పార్లమెంట్ లో తప్పనిసరిగా ఎంపీలంతా ఈ విషయాలపై కులంకషంగా మాట్లాడి సమస్యలపై ఢిల్లీ పెద్దలకు క్లియర్ గా అర్థం అయ్యేలా చెబితే  రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని  చంద్రబాబు ఇప్పటికే వారికి దిశా నిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>