MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babuec6c968c-387c-4a3c-b06c-fce11259fa4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mahesh-babuec6c968c-387c-4a3c-b06c-fce11259fa4f-415x250-IndiaHerald.jpg సూపర్ స్టార్ మహేష్ బాబుకి లక్షల్లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అభిమానులంటే అలాంటి ఇలాంటి అభిమానులు కాదు. మహేష్ బాబు కోసం ఎలాంటి ట్రెండ్ అయిన సెట్ చేస్తారు. ఎలాంటి రికార్డ్ నైనా బద్దలు కొడతారు. ఇక చిత్రపరిశ్రమలో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్రెండ్ కూడా మహేష్ బాబు అభిమానులే ముందుగా సెట్ చేశారు.ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమా లు ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.తమ అభిమాన హీరో సినిమాలను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఇంట్రెస్Mahesh Babu{#}annapurna;mani sharma;naina;sonali bendre;Music;Joseph Vijay;marriage;Murari;mahesh babu;bollywood;Blockbuster hit;Hero;Fidaa;ram pothineni;Director;Cinemaమురారీ వెడ్డింగ్ కార్డ్స్ వైరల్! సరికొత్త ట్రెండులు సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్?మురారీ వెడ్డింగ్ కార్డ్స్ వైరల్! సరికొత్త ట్రెండులు సెట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్?Mahesh Babu{#}annapurna;mani sharma;naina;sonali bendre;Music;Joseph Vijay;marriage;Murari;mahesh babu;bollywood;Blockbuster hit;Hero;Fidaa;ram pothineni;Director;CinemaThu, 18 Jul 2024 18:22:21 GMTసూపర్ స్టార్ మహేష్ బాబుకి లక్షల్లో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అభిమానులంటే అలాంటి ఇలాంటి అభిమానులు కాదు. మహేష్ బాబు కోసం ఎలాంటి ట్రెండ్ అయిన సెట్ చేస్తారు. ఎలాంటి రికార్డ్ నైనా బద్దలు కొడతారు. ఇక చిత్రపరిశ్రమలో కొంతకాలంగా రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆ ట్రెండ్ కూడా మహేష్ బాబు అభిమానులే ముందుగా సెట్ చేశారు.ఒకప్పుడు తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమా లు ఇప్పుడు మళ్లీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.తమ అభిమాన హీరో సినిమాలను మరోసారి థియేటర్లలో చూసేందుకు ఫ్యాన్స్  తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో తెలుగు, తమిళంలో రీరిలీజ్ ట్రెండ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. హీరోల పుట్టినరోజు.. ప్రత్యేకమైన రోజులను పురస్కరించుకుని అభిమానులకు ఇష్టమైన మూవీలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, చిరంజీవి, విజయ్ ఇలా స్టార్ హీరోస్ అందరి సినిమాలు విడుదల కాగా.. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు సూపర్ హిట్ మూవీని ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని ఓ హిట్ మూవీని మరోసారి రిలీజ్ చేస్తున్నారు. అదే మురారి.


సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మురారి అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాలి బింద్రే కథానాయికగా నటించగా.. లక్ష్మీ, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, అన్నపూర్ణ కీలకపాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మా మణిశర్మ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ మూవీ సూపర్ స్టార్ మహేష్ కెరీర్‏లోనే అద్భుతమైన గా నిలిచిపోయింది. ఈ మూవీలో మహేష్, సోనాలి కెమిస్ట్రీకి అడియన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ మూవీని మరోసారి అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఆగస్ట్ 9 వ తేదీన మహేష్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.ఇక అఫీషియల్ అనౌన్మెంట్ కూడా వచ్చింది.అయితే మురారి సినిమా రీరిలీజ్ అవుతుండగా..మహేష్ అభిమానులు వినూత్నంగా ప్లాన్ చేశారు. ఘట్టమనేని వారి వివాహ ఆహ్వాన పత్రీక అంటూ పెళ్లి కార్డుల రూపంలో డిజైన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఈ మురారి వెడ్డింగ్ ఇన్విటేషన్స్ కార్డ్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>