MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-bea24ceb-966b-42c3-a998-393cbbea31b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-bea24ceb-966b-42c3-a998-393cbbea31b4-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898ఏడీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. సాలార్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, కల్కి 2898ఏడీ మూవీ వెయ్యి కోట్లను దాటి పరుగులు పెడుతోంది. థియేటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే జోష్ లో మన డార్లింగ్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో రాజాసాబ్ రిలీజ్ ఉండొచ్చని కూడPrabhas {#}maruti;silver screen;Darling;war;Hanu Raghavapudi;sandeep;Josh;Traffic police;Love;vijay kumar naidu;Prabhas;krishnam raju;Audience;Cinemaప్రభాస్ కి గండం తప్పినట్టేనా?ప్రభాస్ కి గండం తప్పినట్టేనా?Prabhas {#}maruti;silver screen;Darling;war;Hanu Raghavapudi;sandeep;Josh;Traffic police;Love;vijay kumar naidu;Prabhas;krishnam raju;Audience;CinemaThu, 18 Jul 2024 15:30:00 GMTటాలీవుడ్ డార్లింగ్, రెబల్ స్టార్ ప్రభాస్ సలార్, కల్కి 2898ఏడీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. సాలార్ 600 కోట్లకు పైగా కలెక్ట్ చేయగా, కల్కి 2898ఏడీ మూవీ వెయ్యి కోట్లను దాటి పరుగులు పెడుతోంది. థియేటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ వసూళ్లతో కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే జోష్ లో మన డార్లింగ్ ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల కోసం సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో రాజాసాబ్ రిలీజ్ ఉండొచ్చని కూడా టాక్ వినబడుతోంది. ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ సలార్ పార్ట్ 2, కల్కి పార్ట్ 2 సినిమాలు కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది. వాటిని ఎప్పుడు సెట్స్ పైకి తీసుకొని వెళ్తాడనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మరో వైపు సందీప్ రెడ్డి వంగా సినిమా స్పిరిట్ ఉండనే ఉంది. అదే విధంగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే మూవీ చేస్తున్నాడు.

ఇక అసలు విషయంలోకి వెళితే... ప్రభాస్ బాహుబలి తరువాత వచ్చిన రెండు మూడు సినిమాలు సరిగా ఆడకపోవడంతో ఇక ప్రభాస్ పని అయిపోయింది అని అంతా అనుకున్నారు. కానీ సాలార్, కల్కి సినిమాలు సూపర్ డూపర్ హిట్లగా నిలవడంతో ఆ గండం తప్పిందని రెబల్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రభాస్ కి తిరిగే లేదని కూడా చెబుతున్నారు సినిమా ప్రముఖులు. ఇకపోతే ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియాలో సైనికుడి పాత్రలో కనిపించబోతున్నట్లు వినికిడి. అంటే వార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే లవ్ స్టోరీగా మూవీ కథాంశం ఉంటుంది. అదేవిధంగా సందీప్ రెడ్డి స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడనే విషయాన్ని సందీప్ ఎప్పుడో చెప్పుకొచ్చాడు.

పోలీస్, సోల్జర్ క్యారెక్టర్స్ ని ప్రేక్షకులు ఎప్పుడు పవర్ ఫుల్ గా చూస్తారు కాబట్టి ప్రభాస్ ఆ పవర్ ని సిల్వర్ స్క్రీన్ పైన చూపించాలంటే ఫిట్ నెస్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అని అంటున్నారు సినిమా విశ్లేషకులు. ఈ రెండు సినిమాల షూటింగ్ కూడా ఒకేసారి చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఏది ఏమైనా వరుస ప్రాజెక్ట్స్ పెట్టుకొని కూడా డార్లింగ్ ప్రభాస్ ఏ మాత్రం అలసట లేకుండా పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ ముందుకు పోతుండడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. కల్కి మూవీ రిలీజ్ ఆలస్యం అవడం వలన ఈ ఏడాదిలో ఒక్క సినిమాని మాత్రమే డార్లింగ్ అందించగలిగాడు. వచ్చే ఏడాది మాత్రం రెండు సినిమాలు రిలీజ్ గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>