MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rakulee436605-19d1-4844-b114-b20e879605a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/rakulee436605-19d1-4844-b114-b20e879605a0-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె టాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. సందీప్ కిషన్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో రకుల్ తెలుగులో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో వరుసగా క్రేజీ మూవీలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమెకు దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి. అలాగే భాగంగా ఈమె నటింrakul{#}Shiva;Siddharth;rakul preet singh;shankar;sundeep kishan;Mohandas Karamchand Gandhi;lord siva;Box office;venkatadri express;Lover;Bharateeyudu;Hindi;Beautiful;Kollywood;Tamil;Heroine;Tollywood;Cinemaరకుల్ కి కలిసి రాని కోలీవుడ్.. వరుసగా అలాంటి ఫలితాలు..?రకుల్ కి కలిసి రాని కోలీవుడ్.. వరుసగా అలాంటి ఫలితాలు..?rakul{#}Shiva;Siddharth;rakul preet singh;shankar;sundeep kishan;Mohandas Karamchand Gandhi;lord siva;Box office;venkatadri express;Lover;Bharateeyudu;Hindi;Beautiful;Kollywood;Tamil;Heroine;Tollywood;CinemaThu, 18 Jul 2024 06:00:00 GMTమోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె టాలీవుడ్ సినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. సందీప్ కిషన్ హీరోగా మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ తో రకుల్ తెలుగులో మొదటి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత నుండి ఈమెకు వరుసగా తెలుగులో వరుసగా క్రేజీ మూవీలలో అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమెకు దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న అందరూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కాయి.

అలాగే భాగంగా ఈమె నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా తక్కువ కాలంలోనే రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీపై కాకుండా తమిళ్ , హిందీ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం వరుసగా కోలీవుడ్ , హిందీ సినిమాలలో నటిస్తోంది. ఇకపోతే ఈమెకు కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం అస్సలు కలిసి రావడం లేదు. ఈమె కొంత కాలం క్రితం తమిళ నటుడు శివ కార్తీకేయన్ హీరోగా రూపొందిన ఆయలన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయింది. కాకపోతే ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోలేదు. తాజాగా ఈనటి కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారతీయుడు 2 అనే సినిమాలో సిద్ధార్థ్ కి లవర్ పాత్రలో నటించింది. ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన విజయం దక్కుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజే మొదటి షో కే ఘోరమైన నెగటివ్ వచ్చింది. దానితో ఈ సినిమా కూడా భారీ అపజయాన్ని అందుకునే పరిస్థితులే కనబడుతున్నాయి. ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే రకుల్ కి కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా కలిసి రానట్లే కనిపిస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>