Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deaghe307b04c-5360-49df-831a-53c426955e50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/deaghe307b04c-5360-49df-831a-53c426955e50-415x250-IndiaHerald.jpgసాధారణంగా విహారయాత్ర వెళ్లాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. తమకు ఇష్టమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులందరితో కూడా తెగ ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కర. ఈ క్రమంలోనే కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు విహారయాత్రకు చెక్కేయటం చేస్తూ ఉంటారు. అయితే ఇలా తమకి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఖర్చు గురించి అస్సలు ఆలోచించరు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే యూత్ ఇలాంటి టూర్లను బాగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్నేహితులందరితో కలిసి వివిధ ప్రాDeagh{#}prakruti;kusuma jagadish;Yatra;Postmortem;mandalam;News;Manam;police;Vishakapatnamఫ్రెండ్స్ తో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాడు.. కానీ?ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లాడు.. కానీ?Deagh{#}prakruti;kusuma jagadish;Yatra;Postmortem;mandalam;News;Manam;police;VishakapatnamThu, 18 Jul 2024 15:30:00 GMTసాధారణంగా విహారయాత్ర వెళ్లాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. తమకు ఇష్టమైన ప్రదేశాలకు విహారయాత్రకు వెళ్లి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులందరితో కూడా తెగ ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కర. ఈ క్రమంలోనే కాస్త ఖాళీ సమయం దొరికింది అంటే చాలు విహారయాత్రకు చెక్కేయటం చేస్తూ ఉంటారు. అయితే ఇలా తమకి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఖర్చు గురించి అస్సలు ఆలోచించరు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే యూత్ ఇలాంటి టూర్లను బాగా ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్నేహితులందరితో కలిసి వివిధ ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లడం చూస్తూ ఉన్నాం.


 ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఎన్నో ప్రాంతాలలో జలపాతాలు దర్శనమిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ జలపాతాలను చూసి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు చాలా మంది విహారయాత్రలను ప్లాన్ చేసుకుంటూ ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఇలా విహారయాత్రకు వెళ్లి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తే ఆ యాత్ర ఎంతో మధురానుభూతిగా మిగిలిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ ఇలా సరదాగా విహారయాత్రకు వెళ్లినప్పుడు ఊహించని ఘటనలు జరిగితే.. చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు వస్తే అందరికీ చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి.

 స్నేహితులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళ్లిన ఒక వ్యక్తికి చివరికి ఆ యాత్ర చివరి రోజుగా మారిపోయింది. ఎందుకంటే అతను ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్లోని ఘట్కేసర్ మండలం చౌదరిగుడా వాసి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మక్తాకు చెందిన జగదీష్ అనే 42 ఏళ్ళ వ్యక్తి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఇటీవలే నాగార్జునసాగర్ బ్యాక్ వాటర్ లోని వైజాగ్ కాలనీ విహారయాత్రకు వెళ్ళాడు. అయితే ఇటీవలే జగదీష్ నీటిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. జాలర్లు సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే తమ కొడుకు మృతి పై అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>