PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bandaru-sravani-sri32df6399-9d52-4b06-a314-365ede34cc7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bandaru-sravani-sri32df6399-9d52-4b06-a314-365ede34cc7c-415x250-IndiaHerald.jpgఅనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మొదటినుంచి ఫైర్ బ్రాండ్ నాయకురాలు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన.... శింగనమల టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఓటమి తర్వాత శ్రావణిశ్రీ వ్యవహార శైలిపై నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ కు అధినేతకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో శింగనమల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి శ్రావణిశ్రీని తప్పించి... నరసనాయుడు, కేశవరెడ్డితో టుమెన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. శింగనమలలో ఏ కార్యక్రమం అయినా కమిటీలోనే జరగాలని పార్టీ కేడర్ కు సంకేతం ఇచ్చారు. BANDARU SRAVANI SRI{#}sravani;Hanu Raghavapudi;Scheduled caste;Cheque;Bandaru Sravani;MLA;TDP;District;Partyవివాదంలో లేడీ ఎమ్మెల్యే... టీడీపీ నేతలను తొక్కేస్తున్న యంగ్ లీడర్ ?వివాదంలో లేడీ ఎమ్మెల్యే... టీడీపీ నేతలను తొక్కేస్తున్న యంగ్ లీడర్ ?BANDARU SRAVANI SRI{#}sravani;Hanu Raghavapudi;Scheduled caste;Cheque;Bandaru Sravani;MLA;TDP;District;PartyThu, 18 Jul 2024 08:29:52 GMT
అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ మొదటినుంచి ఫైర్ బ్రాండ్ నాయకురాలు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన.... శింగనమల టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు ఆమె. ఓటమి తర్వాత శ్రావణిశ్రీ వ్యవహార శైలిపై నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ సీనియర్ కు అధినేతకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో శింగనమల ఇన్చార్జ్ బాధ్యతల నుంచి శ్రావణిశ్రీని తప్పించి... నరసనాయుడు, కేశవరెడ్డితో టుమెన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. శింగనమలలో ఏ కార్యక్రమం అయినా కమిటీలోనే జరగాలని పార్టీ కేడర్ కు సంకేతం ఇచ్చారు.


శ్రావణి శ్రీని తప్పించడంతో శింగనమలలో ఆమె రాజకీయంగా తెర మరగవుతుంది అనుకున్నారు నేతలు. టూమెన్ కమిటీని శింగనమలలో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చింది. బాధ్యతలు మరొకరికి ఇచ్చిన శ్రావణిశ్రీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మీకు మీరే నాకు నేనే అన్నట్లు నియోజకవర్గంలో నేరుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో శింగనమల టీడీపీ అభ్యర్థి కోసం అధిష్టానం ఎంత కసరత్తు చేసినా బండారు శ్రావణిశ్రీ తప్ప మరొక ఆప్షన్ కనిపించలేదు. దీంతో ఆమె అభ్యర్థిత్వానికి మొగ్గు చూపింది పార్టీ అధిష్టానం. ఎందుకంటే శింగనమల ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అక్కడ పార్టీని నడిపిస్తున్న నరసనాయుడు, కేశవరెడ్డి ఇద్దరికీ పోటీచేసే అవకాశం లేదు.


దీంతో చివరికి శ్రావణిశ్రీకే టికెట్ ఇచ్చింది టీడీపీ నాయకత్వం. శ్రావణిశ్రీకి చెక్ పెట్టాలని అనుకున్న టూమెన్ కమిటీ నేతలు శింగనమల అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. దీంతో టికెట్ చేజిక్కించుకున్న శ్రావణిశ్రీ ఆ ఇద్దరు నేతలను కలిసి మద్దతు కోరారు. ఓ దశలో కేశవరెడ్డి తన ఇంటికి వచ్చిన శ్రావణిశ్రీకి సహకరించేది లేదని మొహం మీదే చెప్పేశారు. అయితే శ్రావణిశ్రీ నేతల సహకారం కోరడం... అధినేత కూడా విభేదాలు పక్కన పెట్టి పనిచేయాలని సూచించడంతో కేశవరెడ్డి, నరసరాయుడు ముందుండి ప్రచారం జరిపించారు.


ఎన్నికల సమయంలో ఆ ఇద్దరి ఆదేశాలు లక్ష్మణ రేఖల పాటించారు శ్రావణిశ్రీ కూడా. తీరా చూస్తే బండారు శ్రావణిశ్రీ ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో శింగనమలలో ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది . ఎన్నికల సమయంలో అన్న అన్న అంటూ చుట్టూ తిరిగిన బండారు శ్రావణి ఎమ్మెల్యేగా గెలవగానే సీనియర్లను పక్కన పెట్టేసిందట. శ్రావణిశ్రీ గెలిచాక వారిని పట్టించుకోవడంలేదని.... ఇది ఊహించిందేనని అంటున్నారట శింగనమల టీడీపీ సీనియర్లు. శింగనమల సీనియర్లను పక్కన పెట్టడంతో శ్రావణి శ్రీ స్ట్రాటజీ ఉందట. నియోజకవర్గంలో బలమైన నాయకులు కాబట్టే వారిపై ఆధారపడాల్సి వచ్చిందనేది ఆమె అభిప్రాయమట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>