Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e80cc1c1-4110-4c21-b8e1-8ebbfe093829-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e80cc1c1-4110-4c21-b8e1-8ebbfe093829-415x250-IndiaHerald.jpgసాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదికి వచ్చినా కూడా అది హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆ విషయం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు కదా! క్రికెటర్లకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకునేందుకు నెటిజెన్స్ ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే.. ఇక ఇప్పుడు శ్రీలంక మాజీ క్రికెటర్ కు సంబంధించిన ఒక వార్త అందరిని షాక్‌కి గుCricket {#}jeevan;Sri Lanka;Athadu;Gang War;Murder;Murder.;Heart;Cricketభార్యాపిల్లల ముందే శ్రీలంక క్రికెటర్ దారుణ హత్య.. కారణమదేనా..?భార్యాపిల్లల ముందే శ్రీలంక క్రికెటర్ దారుణ హత్య.. కారణమదేనా..?Cricket {#}jeevan;Sri Lanka;Athadu;Gang War;Murder;Murder.;Heart;CricketThu, 18 Jul 2024 08:45:00 GMTసాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం తెరమీదికి వచ్చినా కూడా అది హార్ట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆ విషయం గురించి తెలుసుకునేందుకు ఆసక్తిని కనబరిస్తూ ఉంటారు కదా! క్రికెటర్లకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా తెలుసుకునేందుకు నెటిజెన్స్ ఇష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే.. ఇక ఇప్పుడు శ్రీలంక మాజీ క్రికెటర్ కు సంబంధించిన ఒక వార్త అందరిని షాక్‌కి గురిచేస్తుంది.

ఎందుకంటే శ్రీలంక మాజీ క్రికెటర్ ఏకంగా దారుణ హత్యకు గురయ్యాడు. ఇక ఈ విషయం తెలిసి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ లో మునిగిపోతున్నారు. శ్రీలంక మాజీ అండర్-19 క్రికెట్ కెప్టెన్‌గా వ్యవహరించిన ధమ్మిక నిరోషన్ అనే క్రికెటర్ ను కాల్చి చంపేశారు. ఈ దారుణం ఇంటి ముందే జరిగింది. భార్యాపిల్లలు చూస్తుండగానే కొందరు దుండగులు ధమ్మిక నిరోషన్ (41)ను అత్యంత కిరాతకంగా మర్డర్ చేశారు.

బుధవారం ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ధమ్మిక   గాలే సిటీలోని అంబలంగోడా పట్టణంలో భార్యాపిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. ఈ మర్డర్ ఒక గ్యాంగ్ వార్ కారణంగా జరిగి ఉంటుందని శ్రీలంక పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఆటగాడి మరణానికి కారణమైన వారిని త్వరగా అరెస్టు చేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. నిరోషన్ గతంలో అదే ప్రాంతంలో నివసించే తన ఫ్రెండ్ దాసున్ మనవాడును హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ అలివేషన్స్ కారణంగా అతడు కొంతకాలం ఎవరికీ కనిపించకుండా పోయాడు. తరువాత శ్రీలంకకు తిరిగి వచ్చాడు.

ధమ్మిక నిరోషన్ ఒకప్పుడు శ్రీలంక క్రికెట్‌లో బాగా రాణించాడు. 2000లో అరంగేట్రం చేసాడు. న్యూజిలాండ్‌లో జరిగిన 2002 U-19 ప్రపంచ కప్‌తో సహా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, బ్యాటర్‌గా వికెట్లు పడగొట్టాడు బాగా స్కోర్ కూడా చేశాడు. అతను చాలా ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. 21 ఏళ్ల వయస్సులోనే ఆట నుంచి తప్పుకున్నాడు.

ఫర్వీజ్ మహరూఫ్, జీవన్ మెండిస్, ధమ్మిక ప్రసాద్, ఉపుల్ తరంగతో సహా అనేక మంది ఇంటర్నేషనల్ స్టార్లకు నిరోషన్ కెప్టెన్‌గా ఉన్నాడు. U-19 ప్రపంచ కప్‌లో, అతను ఐదు ఇన్నింగ్స్‌లలో 19.28 సగటుతో ఏడు వికెట్లు పడగొట్టాడు, అతని బెస్ట్ పెర్ఫార్మన్స్ 3/38.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>