Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle448f7d49-2561-4537-bce0-6a483127bb89-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle448f7d49-2561-4537-bce0-6a483127bb89-415x250-IndiaHerald.jpgమా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా పొలిమేర 2 సినిమాను మాత్రం థియేటర్లలో గ్రాండ్ గా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసారు.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పొలిమేర సినిమాను ఫ్రాంచైజీలుగా ముందుకు తీసుకెళ్దామని మేకర్స్ భావిస్తున్నారట.నిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను లాంటి నటులు చేsocialstars lifestyle{#}anil music;mouli;sathyam;vamsi;Police Station;Traffic police;November;producer;Producer;Chitram;krishna;Cinema;December;Hyderabadపొలిమేర 3 నిర్మాతపై పోలీస్ కేసు.. అస్సలు ఏం జరిగిందంటే..?పొలిమేర 3 నిర్మాతపై పోలీస్ కేసు.. అస్సలు ఏం జరిగిందంటే..?socialstars lifestyle{#}anil music;mouli;sathyam;vamsi;Police Station;Traffic police;November;producer;Producer;Chitram;krishna;Cinema;December;HyderabadThu, 18 Jul 2024 11:40:00 GMTమా ఊరి పొలిమేర.. ఈ మూవీ 2021లో నేరుగా ఓటీటీలో విడుదల అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌గా  పొలిమేర 2 సినిమాను మాత్రం థియేటర్లలో గ్రాండ్ గా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసారు.ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్, సినిమాటిక్ యూనివర్స్ ల ట్రెండ్ కొనసాగుతున్నాయి. ఇప్పుడు పొలిమేర సినిమాను ఫ్రాంచైజీలుగా ముందుకు తీసుకెళ్దామని మేకర్స్ భావిస్తున్నారట.నిల్ విశ్వనాధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శీను లాంటి నటులు చేసారు.అయితే ఈ చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ, వంశీ నందిపాటి మీద పోలీస్ స్టేషన్ లో కేసుపెట్టారు. పొలిమేర-3 సినిమా హక్కులు నావి అని తెలిసి కూడా వంశీ నందిపాటి ఈ సినిమాను తను నిర్మిస్తున్నట్లు ప్రకటన చేశాడు అని గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇదిలా ఉంటే  సినిమా ఫెయిల్యూర్ అయితే ఆ నిర్మాతకు, డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి అందరికీ ఆర్దిక కష్టాలు చుట్టు ముడుతూంటాయి.రెగ్యులర్ నిర్మాతలకు తప్పించి కొత్తవారికి అది బాగా కష్టం. సినిమా హిట్ అయ్యినా రూపాయి తమకు వెనక్కి రాలేదని వాపోతూంటారు. డిస్ట్రిబ్యూటర్స్ పై మండిపడుతూంటారు.

చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన ‘పొలిమేర 2’కు ఇదే సమస్యగా మారింది. వివాదం పోలిస్ స్టేషన్ కు ఎక్కింది.అయితే ఇప్పుడే ట్విస్ట్ పడింది. పొలిమేర 2’  నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత చంపేస్తానని బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా అది సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఆ సినిమాకి సంబంధించి తనకు రావాల్సిన షేర్ ఇవ్వకుండా అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారు అంటూ డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాత గా మారుతున్న వంశీ నందిపాటి  మీద గౌరీ కృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో  ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది.అయితే వీరిద్దరి మధ్య గత కొంత కాలంగా నిర్మాణ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు ఫిలించాంబర్ తో పాటు పలు సినీ పెద్దల వరకు కూడా తీసుకువెళ్లినట్లు సమాచారం. 

అనిల్ విశ్వనాధ్ దర్శకత్వంలో 'పొలిమేర 3' త్వరలోనే ప్రారంభం కానుంది అని అధికారికంగా సామాజిక మాధ్యమం 'ఎక్స్' లో ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ వంశి నందిపాటి ఈ 'పొలిమేర 3' తో నిర్మాతగా మారుతున్నారు. స్క్రిప్ట్ పని అంతా అయిపోయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ జరుపు కుటుందని చెప్పారు. ఇక 'పొలిమేర', 'పొలిమేర 2' లో నటించిన సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల లు ఈ 'పొలిమేర 3' లో కూడా కంటిన్యూ అవుతారు. వీళ్ళతో పాటుగా బాలాదిత్య, గెటప్ శీను, రాకేందు మౌళి కూడా ఇందులో నటిస్తున్నారని తెలిసింది. వీళ్ళే కాకుండా ఇంకా కొంతమంది నటీనటులు ఉంటారని తెలుస్తోంది. 'పొలిమేర' సినిమాకి నిర్మాతగా వున్న భోగేంద్ర గుప్త ఈ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా ఉంటారని తెలిసింది.త ఏడాది డిసెంబర్ 8 వ తేదీన ఆహా ఓటిటిలో విడుదల అయి అక్కడ కూడా అద్భుత విజయం సాధించింది.  ప్రతిష్టాత్మకమైన 14 వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024 లో ఈ చిత్రం అధికారికంగా ఎంపిక చేయబడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>