Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-news-about-team-india-3035f752-8b9b-49b1-94be-a8c6dc262530-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/interesting-news-about-team-india-3035f752-8b9b-49b1-94be-a8c6dc262530-415x250-IndiaHerald.jpg టీ20 వరల్డ్ కప్‌లో గెలిచిన తరువాత టీ20ఐల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ కెప్టెన్సీని ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా. టీమ్ ఇండియా సెలక్టర్లు కెప్టెన్‌గా ఎవరిని ఎంచుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్నారు. పాండ్య కంటే సూర్యకుమార్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే పాండ్య ఫిట్India{#}gautham new;gautham;Gujarat - Gandhinagar;Winner;Ajit Pawar;Suryakumar Yadav;Rohit Sharma;ICC T20;Hardik Pandya;ajith kumar;Yuva;Yevaru;India;Mumbaiటీ20 కెప్టెన్ గా అతన్నే సెలెక్ట్ చేస్తారా.. ఇప్పటికీ కొనసాగుతున్న సస్పెన్స్..??టీ20 కెప్టెన్ గా అతన్నే సెలెక్ట్ చేస్తారా.. ఇప్పటికీ కొనసాగుతున్న సస్పెన్స్..??India{#}gautham new;gautham;Gujarat - Gandhinagar;Winner;Ajit Pawar;Suryakumar Yadav;Rohit Sharma;ICC T20;Hardik Pandya;ajith kumar;Yuva;Yevaru;India;MumbaiThu, 18 Jul 2024 21:45:00 GMT
టీ20 వరల్డ్ కప్‌లో గెలిచిన తరువాత టీ20ఐల నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆ కెప్టెన్సీని ఎవరు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా. టీమ్ ఇండియా సెలక్టర్లు కెప్టెన్‌గా ఎవరిని ఎంచుకోవాలనే విషయంపై చర్చలు జరుపుతున్నారు. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ పేర్లను పరిశీలిస్తున్నారు. పాండ్య కంటే సూర్యకుమార్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వవచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఎందుకంటే పాండ్య ఫిట్‌నెస్ రికార్డు చాలా పూర్ గా ఉంది. కెప్టెన్‌ అనేవాడు ఎక్కువ కాలం పాటు యాక్టివ్ గా ఉండాల్సి ఉంటుంది. పాండ్య అలా ఉండే ఛాన్స్ లేదు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు.

కొత్త హెడ్ కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్, t20 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ ఇద్దరూ సూర్యకుమార్‌ను కెప్టెన్సీ పాత్ర కోసం తీసుకోవాలని సలహా ఇస్తున్నట్లు సోర్సెస్ వెల్లడిస్తున్నాయి. గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇప్పటికే ఈ నిర్ణయాన్ని పాండ్యకు తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది.

సూర్యకుమార్ యాదవ్ శ్రీలంకతో జరిగే అప్‌కమింగ్ T20I సిరీస్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. 2026 t20 ప్రపంచకప్ వరకు కూడా ఆయనే భారత జట్టుకు నాయకత్వం వహించవచ్చు. హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా జట్టు నుంచి బయటపడ్డారు. సుర్యకుమార్ యాదవ్ గతంలో భారత జట్టుకు T20I కెప్టెన్‌గా వ్యవహరించి, అద్భుతమైన ఫలితాలు సాధించారు. ఆయన నాయకత్వంలో భారత జట్టు ఆస్ట్రేలియాపై 4-1, దక్షిణాఫ్రికాపై 2-1 సిరీస్‌లు గెలుచుకుంది. ఐపీఎల్‌లో కూడా సుర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్లకు కెప్టెన్‌గా విజయాలు తెచ్చిపెట్టారు.

సుర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడితే భారత జట్టు మరింత బలంగా మారే అవకాశం ఉంది. యువ ఆటగాళ్లకు ఆయన మార్గదర్శకత్వం లభిస్తుంది. 2026 t20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించే అవకాశాలు మెరుగుపడతాయి.

బౌలర్ గా, కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా బాగానే రాణించాడు. 137 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు తీశారు. ఇక
కెప్టెన్సీ విషయానికి వస్తే ఈ ప్లేయర్  45 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. 26 విజయాలు సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ టైటిల్‌ను అందించారు. ఐపీఎల్‌లో ఒక టైటిల్ గెలిచినప్పటికీ, ఆయన కెప్టెన్సీ సామర్థ్యంపై ఇంకా చర్చ జరుగుతోంది. మరి ఈ సస్పెన్స్ ఎప్పుడు వీడుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>