PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parliament-meeting-ap-cm-chandrababu-cm-chandrababu-naidu-janasena-pawan-kalyan-pawan-kalyan9e333e6e-1502-470f-a772-f86da24c47dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/parliament-meeting-ap-cm-chandrababu-cm-chandrababu-naidu-janasena-pawan-kalyan-pawan-kalyan9e333e6e-1502-470f-a772-f86da24c47dd-415x250-IndiaHerald.jpg- రాష్ట్ర ప్ర‌యోజ‌నాలపైనే చ‌ర్చ‌లు... ప‌వ‌న్‌, బాబు డైరెక్ష‌న్ ఇదే - అమ‌రావ‌తి, పోల‌వ‌రం, రైల్వేజోన్‌, ఐటీ కీల‌కం ( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ ) త్వరలోనే పార్లమెంటు బ‌డ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలు ఏమాత్రం ఏపీకి సంబంధించిన సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తాయి? ఏపీ సమస్యలను పరిష్కరిం చేందుకు ఏమేరకు కృషి చేస్తారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలు మద్Parliament meeting; AP CM Chandrababu; CM Chandrababu Naidu; janasena Pawan Kalyan; Pawan Kalyan{#}kalyan;Success;MP;Party;CBN;India;Amaravati;Vishakapatnam;polavaram;Polavaram Project;Andhra Pradesh;Parliamentపార్లమెంట్ ఫైట్: చంద్ర‌బాబు - ప‌వ‌న్‌కు అతి పెద్ద ప‌రీక్ష...!పార్లమెంట్ ఫైట్: చంద్ర‌బాబు - ప‌వ‌న్‌కు అతి పెద్ద ప‌రీక్ష...!Parliament meeting; AP CM Chandrababu; CM Chandrababu Naidu; janasena Pawan Kalyan; Pawan Kalyan{#}kalyan;Success;MP;Party;CBN;India;Amaravati;Vishakapatnam;polavaram;Polavaram Project;Andhra Pradesh;ParliamentThu, 18 Jul 2024 08:12:00 GMT- రాష్ట్ర ప్ర‌యోజ‌నాలపైనే చ‌ర్చ‌లు... ప‌వ‌న్‌, బాబు డైరెక్ష‌న్ ఇదే
- అమ‌రావ‌తి, పోల‌వ‌రం, రైల్వేజోన్‌, ఐటీ కీల‌కం

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

త్వరలోనే పార్లమెంటు బ‌డ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీలు ఏమాత్రం ఏపీకి సంబంధించిన సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తాయి? ఏపీ సమస్యలను పరిష్కరిం చేందుకు ఏమేరకు కృషి చేస్తారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పార్టీలు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించిన కీలకమైన అంశాలపై వీరు ఏరకంగా ముందుకు వెళ్తారు? ఎన్నెన్ని ప‌రిష్క‌రిస్తారు ? అనేది చర్చనీయాంశంగా మారిన విషయం.


ప్రధానంగా ప్రత్యేక హోదా అంశం పక్కన పెడితే.. పోలవరం నిధులు, అమరావతి రాజధాని నిర్మాణం, వెనుక‌బ‌డిన ప్రాంతాల అభివృద్ధి, విశాఖ రైల్వే జోన్, ఐటి అనుబంధ పరిశ్రమల వంటివి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి కీలకంగా మారాయి. అడగందే అమ్మ‌యినా పెట్టదు అన్న విధంగా... కేంద్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మద్దతుతో ఉన్న  ప్రభుత్వమే ఏర్పడినా అడక్కుండా అక్కడ ఏ సమస్యా పరిష్కారం అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపద్యంలో పార్లమెంట్లో మిత్రపక్షం అయిన టిడిపికి జనసేనకు చాలా కీలకమైన బాధ్యత ఏర్పడింది.


ఇదే విషయాన్ని తాజాగా చంద్రబాబు తన పార్టీ ఎంపీలకు, పవన్ కళ్యాణ్ తన ఇద్దరు ఎంపీలకు చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సమస్యలు ప్రాతిపదిక‌గా పార్లమెంట్లో చర్చలు జరగాలని ఇద్దరు కోరుకున్నారు. మరి ఎంతవరకు ఈ విషయంలో వారు సక్సెస్ అవుతారు అనేది చూడాలి. ఏదేమైనా మొహమాట పోతే .. ఏపీ ప్రయోజనాలు ఇప్పట్లో పరిష్కారం అయితే అయ్యేలా కనిపించడం లేదు. దీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు  తన వ్యవహారాలకు పదును పెట్టి వ్యవహరించాలని పలువురు సూచిస్తున్నారు.


మ‌రోవైపు.. త‌మ‌కు ఒక్క ఎంపీ ఉన్నా... ఏపీ త‌ల‌రాత మారుస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌క ల్యాణ్‌కు కూడా.. ఇది పెద్ద అగ్ని ప‌రీక్షే. ఎందుకంటే.. ఏ నాయ‌కుడినైనా తొలినాళ్ల‌లో వేసిన అడుగుల‌ను బట్టే నిర్ణ‌యిస్తారు. ఇలా చూసుకుంటే.. ప‌వ‌న్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది అంద‌రూ గ‌మ‌నిస్తారు. పార్ల‌మెంటులో ప్ర‌శ్నించందే ఏదీ వ‌చ్చే అవ‌కాశం లేదు. సో.. ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. మోడీ ప్రాధాన్యాలు మోడీకి ఉన్నాయి. అలాగ‌ని.. ఏపీని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. సో.. ఎలా చూసుకున్నా.. వ‌చ్చే పార్ల‌మెంటు స‌మావేశాల్లో చంద్ర‌బాబు, ప‌వ‌న్ కూట‌మికి పెద్ద ప‌రీక్షేన‌ని చెప్ప‌వ‌చ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>