Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2cb440c5-8dbe-43a3-bc16-93baa1c63021-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan2cb440c5-8dbe-43a3-bc16-93baa1c63021-415x250-IndiaHerald.jpgమరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయ్. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలలో అటు చంద్రబాబు ఏం చేయబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారూ అన్న విషయం తెలిసిందే. ఒకవేళ చంద్రబాబు ఎన్డీఏ కూటమితో విభేదిస్తే ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీకి రావాల్సినవన్నీ చంద్రబాబు చంద్రబాబు రప్పించుకోవడంలో Jagan{#}Narendra Modi;Y. S. Rajasekhara Reddy;Success;Jagan;MP;YCP;TDP;Congress;Party;Parliment;central government;CBN;polavaram;Polavaram Project;Governmentపార్లమెంట్ ఫైట్ : ప్రజలను నమ్మించడానికి.. జగన్ కు ఇదే మంచి ఛాన్స్?పార్లమెంట్ ఫైట్ : ప్రజలను నమ్మించడానికి.. జగన్ కు ఇదే మంచి ఛాన్స్?Jagan{#}Narendra Modi;Y. S. Rajasekhara Reddy;Success;Jagan;MP;YCP;TDP;Congress;Party;Parliment;central government;CBN;polavaram;Polavaram Project;GovernmentThu, 18 Jul 2024 08:29:00 GMTమరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయ్. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టబోతోంది. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలలో అటు చంద్రబాబు ఏం చేయబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చంద్రబాబు ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నారూ అన్న విషయం తెలిసిందే. ఒకవేళ చంద్రబాబు ఎన్డీఏ కూటమితో విభేదిస్తే ఏకంగా ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ఏపీకి రావాల్సినవన్నీ చంద్రబాబు చంద్రబాబు రప్పించుకోవడంలో సక్సెస్ అవుతారా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.


 అయితే ఒకవైపు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వలేక ఇంకోవైపు అటు కాంగ్రెస్ వైపు నిలబడలేక తటస్థ ధోరణితో వ్యవహరిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన నలుగురు ఎంపీల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల్లో భంగపడిన జగన్కు మళ్లీ పుంజుకునేందుకు ఈ పార్లమెంట్ సమావేశాలు ఒక మంచి అవకాశం గా మారబోతున్నాయి అని  కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఎలాగో చంద్రబాబు అటు ఎన్డీఏ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో  ఇక వాళ్లకి అనుకూలంగానే మోదీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది.


 అయితే గతంలో వైసిపి ఏకంగా ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి చేయలేకపోయింది.. ఇక పోలవరం లాంటి ప్రాజెక్టులకు నిధులను రాబట్టుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఏకంగా వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీలు ప్రత్యేక హోదాపై పవర్ఫుల్ ప్రసంగాలు ఇచ్చి.. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టడానికి అటు టిడిపి ఎంపీలతో గొంతు కలిపితే.. మరోసారి తమది ప్రజల కోసం ఏర్పాటు అయిన పార్టీ అని జగన్ మరోసారి నిరూపించుకునేందుకు ఛాన్స్ ఉంది. ప్రజలు గెలిపించిన గెలిపించకున్న రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం అనే మెసేజ్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఛాన్స్ ఉంది. అందుకే తటస్థ ధోరణితో వ్యవహరించకుండా  అటు టిడిపి జనసేన ఎంపీలతో కలిసి ప్రత్యేక హోదా కోసం గొంతు ఎత్తితే ప్రజలు మరోసారి వైసీపీని నమ్మే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ పార్లమెంట్ సమావేశాలు జగన్ పార్టీకి ప్రజల్లో మరోసారి నమ్మకాన్ని కూడగట్టుకోవడానికి మంచి అవకాశం గా మారిపోబోతున్నాయి  అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరగబోతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>