PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-selfi-nagari-ap-tamilnadu-labours2e7da765-5f34-4461-a3a6-4bcb5e05f323-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/roja-selfi-nagari-ap-tamilnadu-labours2e7da765-5f34-4461-a3a6-4bcb5e05f323-415x250-IndiaHerald.jpgసినీనటి, రాజకీయ నాయకురాలు రోజా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినిమా రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లింది. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అదే నియోజకవర్గంలో నుంచి ఆమె రెండవసారి గెలిసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇక మంత్రి పదవి రాకముందుకు అందరితో కలిసి ఉండే రోజా, మంత్రి పదవి ఎప్పుడైతే చేపట్టిందో అప్పటినుంచి అహంకార భావంతో ఉండడం మొదలుపెట్టింది.roja;selfi;nagari;ap;tamilnadu;labours{#}Thiruchendur;Roja;monday;Nagari;workers;Husband;Jagan;Telugu;Cinema;Minister;Reddy;YCPపేదలంటే రోజాకు అంత చులకనా.?పేదలంటే రోజాకు అంత చులకనా.?roja;selfi;nagari;ap;tamilnadu;labours{#}Thiruchendur;Roja;monday;Nagari;workers;Husband;Jagan;Telugu;Cinema;Minister;Reddy;YCPThu, 18 Jul 2024 09:51:32 GMTసినీనటి, రాజకీయ నాయకురాలు రోజా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. సినిమా రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న ఈమె రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకెళ్లింది. నగరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.  అదే నియోజకవర్గంలో నుంచి ఆమె రెండవసారి గెలిసిన సమయంలో  జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రి పదవి కూడా ఇచ్చారు.  ఇక మంత్రి పదవి రాకముందుకు అందరితో కలిసి ఉండే రోజా, మంత్రి పదవి ఎప్పుడైతే చేపట్టిందో అప్పటినుంచి అహంకార భావంతో ఉండడం మొదలుపెట్టింది. 

 అంతేకాకుండా తన సొంత నియోజకవర్గమైనటువంటి నగరిలో కూడా తన భర్త, ఇద్దరూ అన్నదమ్ములు అరాచకాలు చేయడం, భూ దందాలు, అక్రమాలు ఇలా ఎన్నో చేసి చివరికి చెడ్డ పేరు తెచ్చుకుంది. చివరికి వైసీపీ నాయకులే ఆమెను నగరిలో పోటీకి దించొద్దని జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అయినా జగన్ నగరిలో ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. చివరికి  ఓటమిపాలైంది. అంత దారుణంగా ఓడిపోయిన రోజాకు మాత్రం అహంకారం తగ్గినట్లయితే కనిపించడం లేదు. దీనికి నిదర్శనం తాజాగా జరిగినటువంటి ఒక ఘటనే. అయితే రోజా తమిళనాడులోని తిరుచెందూర్  సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో సోమవారం వరుషాభిషేకం జరిగింది. ఈ వేడుకల్లో  రోజా మరియు ఆమె భర్త సెలవమని స్వామి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం బయటకు వస్తున్న తరుణంలో చాలామంది  రోజా సెల్ఫి కోసం అక్కడ బారులు తీరారు. అదే సమయంలో అక్కడే పని చేసే పారిశుద్ధ కార్మికులు రోజా దగ్గరికి వెళ్లి సెల్ఫీ దిగుదామని ప్రయత్నం చేశారు. దీంతో రోజా వారిని దూరంగా నిల్చొవాలంటూ చేతులు చూపినట్లు ఒక వీడియో వైరల్ అవుతుంది. మీరంతా దూరంగా ఉండి సెల్ఫీ తీసుకోండి, నన్ను ముట్టుకోవద్దు అనే విధంగా ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో  రోజాకు పేద ప్రజలు, కార్మికులు అంటే చులకన భావం అంటూ కామెంట్లు పెడుతున్నారు. పదవి పోయినా కానీ అహంకార భావం తగ్గలేదని తిట్టిపోస్తున్నారు. దీనిపై రోజా ఎలా స్పందిస్తుందో ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>