Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamato717dcf9a-8406-4463-81e5-ddc4c2c35584-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tamato717dcf9a-8406-4463-81e5-ddc4c2c35584-415x250-IndiaHerald.jpg చాలామంది వంటల్లో వాడే కూరగాయల్లో టమాటాలు ముందు ఉంటాయి. కాలమేదైనా టమాటాలు తినకుండా ప్రజలు ఉండలేరు. డిమాండ్‌కి తగినట్టు ఇవి అందుబాటులోకి లేకపోతే వీటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. తాజాగా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టమాటా ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇంతకుముందే ఈ కూరగాయ రేటు రూ.100 దాటేసింది. మళ్లీ దీని ధర తగ్గింది. కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మార్కెట్లలో మామూలుగా ఉన్న కేజీ టమాటా ధరే రూ.40Tamato{#}Hyderabad;Mirchi;Chilli;Brinjal;Santosham;Telangana;Juneఅయ్య బాబోయ్.. మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు?అయ్య బాబోయ్.. మళ్లీ పెరుగుతున్న టమాటా ధరలు?Tamato{#}Hyderabad;Mirchi;Chilli;Brinjal;Santosham;Telangana;JuneThu, 18 Jul 2024 09:00:00 GMT

చాలామంది వంటల్లో వాడే కూరగాయల్లో టమాటాలు ముందు ఉంటాయి. కాలమేదైనా టమాటాలు తినకుండా ప్రజలు ఉండలేరు. డిమాండ్‌కి తగినట్టు ఇవి అందుబాటులోకి లేకపోతే వీటి ధరలు ఆకాశాన్ని అంటుతాయి. తాజాగా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా టమాటా ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఇంతకుముందే ఈ కూరగాయ రేటు రూ.100 దాటేసింది. మళ్లీ దీని ధర తగ్గింది.

కొద్ది రోజుల క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ మార్కెట్లలో మామూలుగా ఉన్న కేజీ టమాటా ధరే రూ.40, 50లకు చేరుకుంది. పెద్దగా, మంచి క్వాలిటీలో ఉన్న (గ్రేడ్-ఏ) టమాటాలు రూ.60కి అమ్ముడుపోయాయి. అయితే అదే ఎక్కువ ధరలని సామాన్యుడు గగ్గోలు పెడుతుంటే ఇప్పుడు మరోసారి టమాటా ప్రైసెస్ అమాంతం పెరిగేసాయి. ఈరోజు మార్కెట్లో కేజీ గ్రేడ్-ఏ టమాటాల ధర రూ.100కు ఎగబాకింది. ఇటీవల కాలంలో వర్షాలు కురిసాయి దానివల్ల పంట దెబ్బతిన్నది. డిమాండ్ కు తగినంత సరఫరా లేకపోవడంతోనే టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ కూరగాయల్లో కొరత ఉండటం వల్ల రేట్లు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

 నిన్న, మొన్నటి వరకు ధరలు లేక టమాటా సాగు చేసిన వారు బాధపడ్డారు. ఇప్పుడు మంచి ధరలు వస్తుండడంతో టమోటా పండించిన రైతుల ముఖంలో సంతోషం కనిపిస్తోంది. సరిగ్గా వన్ వీక్ వెనక్కి వెళ్తే హైదరాబాద్ నగరంలో టమాటా ధరలు మాత్రమే కాకుండా మిగతా కూరగాయల ధరలు అన్నీ కూడా పెరిగాయి. పంట దిగుబడి తగ్గింది కాబట్టి అవి అమాంతం పైకి చేరాయి.

ఉల్లిపాయల ధరలు కూడా రెట్టింపు అయ్యాయి. జూన్ నెలలో రూ.100 పెడితే నాలుగు కిలోల ఉల్లిగడ్డలు వచ్చేవి. కానీ ప్రస్తుతం 100% పెరిగింది కాబట్టి ఒక్క కిలోనే 50 రూపాయలకు చేరుకుంది. దీనివల్ల పేద మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా చితికి పోతున్నారు. ఎప్పుడూ చౌక ధరల్లో దొరికే ఆలుగడ్డ సైతం ఈసారి చుక్కలు చూపిస్తోంది. ఈ మధ్యకాలంలో కిలో బంగాళదుంపల ధర రూ.50 కి చేరుకుంది. ఇక వంకాయలు కొనేటట్టు లేవు. కేజీ వంకాయ రూ.80 చేరడంతో ప్రజలు వాటిని కొనడానికి జంకుతున్నారు. పచ్చి మిర్చి కూడా కన్నీళ్లు పెట్టిస్తోంది ఇప్పుడు పచ్చిమిర్చి కేజీ కొనాలంటే  రూ.100 చెల్లించాల్సిందే. కూరగాయలే కాకుండా ప్రజలు రోజూ తినే ఇతర ఆహార పదార్థాల ధరలు కూడా బాగా పెరిగాయి. దీనివల్ల బడ్జెట్ అడ్జస్ట్ చేసుకోలేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>