MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgలేటెస్ట్ గా విడుదలైన ‘కల్కి 2898’ మూవీతో దేశవ్యాప్తంగా అమితాబ్ బచ్చన్ పేరు మారుమ్రోగి పోతోంది. 78 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో అమితాబ్ అతి క్లిష్టతరమైన పాత్రలను చేస్తూ నెటితరం నటీనటులకు తన సత్తా చూపెడుతున్నాడు. ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల వారాసుల హవా ఎప్పటి నుండో కొనసాగుతున్నప్పటికీ అమితాబ్ కొడుకు అబిషేక్ బచ్చన్ కెరియర్ ఇంకా ఇండస్ట్రీలో స్థిరపడలేదు. కొన్ని మల్టీ స్టార్ మూవీలలో అభిషేక్ నటించినప్పటికీ అతడితో కలిసి నటించిన జాన్ అబ్రహం హృతిక్ రోషన్ లాంటి హీరోలకు పేరు వచ్చMITAABBACHHAN{#}John Abraham;Mani Ratnam;Shahrukh Khan;Vidya Balan;abhishek;roshan;Anandam;Amitabh Bachchan;anand malayalam actor;Anand Deverakonda;king;King;Darsakudu;bollywood;Father;Director;Newsఅశ్వద్ధామ కొడుకు కు కలిసివస్తున్న కాలం !అశ్వద్ధామ కొడుకు కు కలిసివస్తున్న కాలం !MITAABBACHHAN{#}John Abraham;Mani Ratnam;Shahrukh Khan;Vidya Balan;abhishek;roshan;Anandam;Amitabh Bachchan;anand malayalam actor;Anand Deverakonda;king;King;Darsakudu;bollywood;Father;Director;NewsWed, 17 Jul 2024 08:09:00 GMTలేటెస్ట్ గా విడుదలైన ‘కల్కి 2898’ మూవీతో దేశవ్యాప్తంగా అమితాబ్ బచ్చన్ పేరు మారుమ్రోగి పోతోంది. 78 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో అమితాబ్ అతి క్లిష్టతరమైన పాత్రలను చేస్తూ నెటితరం నటీనటులకు తన సత్తా చూపెడుతున్నాడు. ఫిలిమ్ ఇండస్ట్రీలో టాప్ హీరోల వారాసుల హవా ఎప్పటి నుండో కొనసాగుతున్నప్పటికీ అమితాబ్ కొడుకు అబిషేక్ బచ్చన్ కెరియర్ ఇంకా ఇండస్ట్రీలో స్థిరపడలేదు.



కొన్ని మల్టీ స్టార్ మూవీలలో అభిషేక్ నటించినప్పటికీ అతడితో కలిసి నటించిన జాన్ అబ్రహం హృతిక్ రోషన్ లాంటి హీరోలకు పేరు వచ్చింది కానీ అభిషేక్ కు ఆసినిమాలు ఏమీ కలిసిరాలేదు. మణిరత్నం లాంటి టాప్ డైరెక్టర్స్ అభిషేక్ ను నిలబెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆప్రయత్నాలు ఏమాత్రం కలిసిరాలేదు. లేటెస్ట్ గా షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘కింగ్’ మూవీలో అభిషేక్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.



దీనితో ఇక రానున్న కాలంలో అభిషేక్ తండ్రి అన్న పెద్దనాన్న పాత్రలకు పరిమితమైపోతాడా అంటూ కొందరు సందేహించారు. ఇది ఇలా ఉంటే అభిషేక్ ను విలన్ గా చూపించడానికి ఒక ప్రముఖ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విద్యా బాలన్ తో ‘కహాని’ లాంటి సినిమాను తీసి విమర్శకుల ప్రశంసలు విజయం అందుకున్న సుజయ్ ఘోష్ కింగ్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.



పఠాన్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీలో అభిషేక్ నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీ అంచనాలకు అనుగుణంగా సక్సస్ సాధిస్తే విలన్ గా అమితాబ్ కొడుకు కొత్త కెరియర్ ప్రారంభం అవుతుంది. నెగిటివ్ పాత్రలను ఒకనాటి హీరోలు చేసి కోట్లు గణిస్తున్న ఈరోజులలో అభిషేక్ వ్యూహాలు విజయవంతం అయితే అతడి తండ్రి అమితాబ్ కు ఆనందం కలుగుతుంది మరి ప్రేక్షకుల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి..










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>