LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips46c131aa-77c2-4fb3-ac66-008f5072a21f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-tips46c131aa-77c2-4fb3-ac66-008f5072a21f-415x250-IndiaHerald.jpgవామ్మో ఈ కాయగూర తింటే అంతే సంగతులు? బంగాల దుంపలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి ఎంత రుచిగా ఉంటాయో వీటిని తింటే ఆనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన బంగాళదుంపలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు, వాటిలోని స్టార్చ్ కంటెంట్ చక్కెరగా మారుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పెంచుతుంది. తాజా బంగాళదుంపల కంటే మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్ గా పెరుగుతాయి. కాబట్టి మధుHealth Tips{#}Professor;Manamవామ్మో ఈ కాయగూర తింటే అంతే సంగతులు?వామ్మో ఈ కాయగూర తింటే అంతే సంగతులు?Health Tips{#}Professor;ManamWed, 17 Jul 2024 20:36:00 GMTవామ్మో ఈ కాయగూర తింటే అంతే సంగతులు ? 

బంగాల దుంపలు ఎంత రుచిగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి ఎంత రుచిగా ఉంటాయో వీటిని తింటే ఆనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు మొలకెత్తిన బంగాళదుంపలను తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ బంగాళాదుంపలు మొలకెత్తినప్పుడు, వాటిలోని స్టార్చ్ కంటెంట్ చక్కెరగా మారుతుంది. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్‌ను పెంచుతుంది. తాజా బంగాళదుంపల కంటే మొలకెత్తిన బంగాళాదుంపలను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్పీడ్ గా పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు.బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల వికారం, విరేచనాలు ఇంకా కడుపు నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా దీనిపై పలు పరిశోధనలు కూడా జరిగాయి.


2002లో ‘ఫుడ్ అండ్ కెమికల్ టాక్సికాలజీ’ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. తెలిసిన విషయం ఏమిటంటే మొలకెత్తిన బంగాళాదుంపలను తిన్న వారిలో సోలనిన్ స్థాయిలు గణనీయంగా పెరిగాయని.. వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలు ఎక్కువగా కనిపించాయని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఐర్లాండ్‌లో డబ్లిన్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజ్‌లో ఫార్మకాలజీ, థెరప్యూటిక్స్ ప్రొఫెసర్ ‘డాక్టర్ డెన్నిస్ జె.ఆర్. మెక్‌ఆలిఫ్’ పాల్గొని ఈ విషయం గురించి నిర్ధారించడం జరిగింది. అసలు ఎక్కువగా బంగాళదుంపలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు. ఇలా మొలకెత్తిన లేదా ఆకుపచ్చ బంగాళాదుంపలను అస్సలు తినకూడదని అంటున్నారు. ఎందుకంటే మొలకెత్తిన బంగాళదుంపలో పోషకాలు తక్కువగా ఉంటాయి. బంగాళదుంపలు మొలకెత్తినప్పుడు గ్లైకోఅల్కలాయిడ్స్ అనే విషపూరిత సమ్మేళనాలను ఉత్పత్తి చేస్తాయి. అవి మనం తినే ఆహారాన్ని విషంగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే.. మొలకెత్తిన బంగాళాదుంపలలో సోలనిన్ స్థాయులు పెరుగుతాయని, ఇవి పలు అనారోగ్య సమస్యలకు కారణమవుతాయని చెబుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>