Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rinku3c64b622-319a-498c-a792-6005be1140c1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rinku3c64b622-319a-498c-a792-6005be1140c1-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో టీమిండియాలో యువ ఆటగాళ్ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది కుర్రాళ్ళు ఇక తమలో ఉన్న ప్రతిభను ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందో ఎప్పుడు అందరికీ తెలియజేసేలా ఆడుతామో అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఇక చాన్సులు వస్తే చాలు ఇరగదీసేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు అదరగొడుతూ అతి తక్కువ సమయంలోనే టీమిండియాలో ఛాన్సులు దక్కించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోRinku{#}Audi;World Cup;Cricket;king;King;Indian;vikram;Yuva;India;Newsత్వరలో రింకు సింగ్ కు.. లక్కీ చాన్స్ దక్కబోతుందా?త్వరలో రింకు సింగ్ కు.. లక్కీ చాన్స్ దక్కబోతుందా?Rinku{#}Audi;World Cup;Cricket;king;King;Indian;vikram;Yuva;India;NewsWed, 17 Jul 2024 16:00:00 GMTఈ మధ్యకాలంలో టీమిండియాలో యువ ఆటగాళ్ల హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది కుర్రాళ్ళు ఇక తమలో ఉన్న ప్రతిభను ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందో ఎప్పుడు అందరికీ తెలియజేసేలా ఆడుతామో అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవాలి క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఇక చాన్సులు వస్తే చాలు ఇరగదీసేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాళ్లు అదరగొడుతూ అతి తక్కువ సమయంలోనే టీమిండియాలో ఛాన్సులు దక్కించుకుంటున్నారు అని చెప్పాలి.


 ఇలా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడి కేవలం ఒకే ఒక ఇన్నింగ్స్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితుడుగా మారిపోయాడు రింకు సింగ్. భారత క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా అటు సిక్సర్ల కింగ్ గా మారిపోయాడు అని చెప్పాలి. అతను బ్యాట్ పట్టుకొని మైదానంలోకి దిగాడు అంటే చాలు బౌలర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఆ రేంజ్ లో బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉంటాడు ఈ యంగ్ ప్లేయర్. ఇక ఇప్పటికే టీమ్ ఇండియా తరపున వన్డేలతో పాటు టి20 ఫార్మాట్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. అయితే రింకు సింగ్ ని సుదీర్ఘమైన ఫార్మాట్ గా పేరు ఉన్న టెస్ట్ లలోకి కూడా తీసుకోవాలని.. అలా తీసుకుంటే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదు అంటూ ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా అభిప్రాయపడుతున్నారు.


 అయితే టీమిండియా యంగ్ ప్లేయర్ రింకు సింగ్ త్వరలోనే టెస్ట్ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనేది తెలుస్తుంది. తాజాగా రింకు సింగ్ ఆటపై భారత మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టి20 వరల్డ్ కప్ సమయంలో నెట్స్ లో రింకు సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు.. అతని బ్యాటింగ్లో ఎక్కడ టెక్నికల్ సమస్యలు కనిపించలేదని చెప్పుకొచ్చాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో రింకు సింగ్ లో ఒక టెస్ట్ క్రికెట్ ఉన్నాడు అన్న విషయాన్ని గమనించానని.. అతను త్వరలోనే టెస్టుల్లోకి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక అతనికి సాంప్రదాయమైన క్రికెట్ ఆడే సత్తా ఉంది అంటూ అభిప్రాయపడ్డాడు విక్రమ్ రాథోడ్. దీంతో అతను త్వరలోనే టెస్ట్ క్రికెట్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>