Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bab7997-aac3-4e9b-a230-f8416a598940-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle8bab7997-aac3-4e9b-a230-f8416a598940-415x250-IndiaHerald.jpgమ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ విపరీతంగా ఉంది. ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క మల్టీ స్టారర్లు కూడా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం వెనకాడడం లేదు. అలా ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే దేవర సినిమా ఒప్పుకోకముందే ఆయన మరో మల్టీస్టారర్ కూడా ఒప్పుకునsocialstars lifestyle{#}Thriller;RRR Movie;Blockbuster hit;war;roshan;Hero;Jr NTR;bollywood;NTR;Heroine;Cinemaఎన్టీఆర్ వార్ 2 నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?ఎన్టీఆర్ వార్ 2 నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా..?socialstars lifestyle{#}Thriller;RRR Movie;Blockbuster hit;war;roshan;Hero;Jr NTR;bollywood;NTR;Heroine;CinemaWed, 17 Jul 2024 12:10:54 GMTమ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ దేవర సినిమా కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో హైప్ విపరీతంగా ఉంది. ఒకపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క మల్టీ స్టారర్లు కూడా చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం వెనకాడడం లేదు. అలా ఆయన చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా మీద తన ఫోకస్ అంతా పెట్టాడు. అయితే దేవర సినిమా ఒప్పుకోకముందే ఆయన మరో మల్టీస్టారర్ కూడా ఒప్పుకున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్ వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఇటీవల తారక్‌ వార్ 2 సెట్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఈ మూవీపై మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యింది.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న 'వార్‌ 2' టీం ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుందట. ఈ మూవీ నెక్ట్స్‌ షెడ్యూల్‌ రామోజీ ఫిలిం సిటీలో జరగనుందట. అక్కడ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్లాన్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రామోజీ ఫలిం సిటీలో భారీ సెట్‌ వేయబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో ఆగష్టులో ప్రారంభం కానుంది.  ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌తో పాటు హీరోయిన్ ఆలియా భట్ , ఇతర తారగణం కూడా పాల్గొననుందట.ఈ షెడ్యూల్‌లో హృతిక్‌రోషన్‌, ఎన్టీయార్‌లపై యాక్షన్‌ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారట. ఇది సినిమా ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ అని తెలుస్తున్నది. ఈ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా, వచ్చే ఏడాది ఆగస్ట్‌ 14న విడుదల కానుంది.ఇక వార్ 2 రిలీజ్‌ తర్వాత థియేటర్లో తుఫానే అంటూ ఫ్యాన్స్‌ అంతా అంచనాల్లో మునిగితేలుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>