MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/janhvi-kapoor--keerthi-suresh--nania328574d-2b09-491a-bed6-3a3aa18a1b21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/janhvi-kapoor--keerthi-suresh--nania328574d-2b09-491a-bed6-3a3aa18a1b21-415x250-IndiaHerald.jpgజాన్వి వద్దు, కీర్తినే ముద్దు అంటున్న ఆ హీరో ఫ్యాన్స్? కొత్త దర్శకుడనే భయం లేకుండా న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెలకు దసరా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా నానికి ఉన్న క్లాస్ ఇమేజ్ తీసి నానిలో కూడా ఊర మాస్ హీరో ఉన్నాడని గట్టిగా ప్రూవ్ చేశాడు.దసరాలో నాని, కీర్తి సురేష్ పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ డైరెక్టర్, హీరో కాంబో రిపీట్ కాబోతుంది. నాని ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ తో ఒక సినిమా ప్లానింగ్ లోJanhvi Kapoor - keerthi suresh - Nani{#}CBN;Nani;Janhvi Kapoor;jahnavi;Jr NTR;keerthi suresh;kirti;srikanth;sujeeth;vennela;Dussehra;bollywood;Cinema;Telugu;Saturday;Vijayadashami;Hero;Heroine;News;Massజాన్వి వద్దు, కీర్తినే ముద్దు అంటున్న ఆ హీరో ఫ్యాన్స్?జాన్వి వద్దు, కీర్తినే ముద్దు అంటున్న ఆ హీరో ఫ్యాన్స్?Janhvi Kapoor - keerthi suresh - Nani{#}CBN;Nani;Janhvi Kapoor;jahnavi;Jr NTR;keerthi suresh;kirti;srikanth;sujeeth;vennela;Dussehra;bollywood;Cinema;Telugu;Saturday;Vijayadashami;Hero;Heroine;News;MassWed, 17 Jul 2024 19:00:00 GMTకొత్త దర్శకుడనే భయం లేకుండా న్యాచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెలకు దసరా ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా నానికి ఉన్న క్లాస్ ఇమేజ్ తీసి నానిలో కూడా ఊర మాస్ హీరో ఉన్నాడని గట్టిగా ప్రూవ్ చేశాడు.దసరాలో నాని, కీర్తి సురేష్ పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ డైరెక్టర్, హీరో కాంబో రిపీట్ కాబోతుంది. నాని ప్రస్తుతం చేస్తున్న సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుజిత్ తో ఒక సినిమా ప్లానింగ్ లో ఉంది. ఐతే ఆ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమానే ఉంటుందని సమాచారం . ఇక ఈ సినిమాను కూడా నాని ఇదివరకు సినిమాలకు భిన్నంగా చేయాలని అనుకుంటున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ని తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తాయి. ఈమె తెలుగు ఎంట్రీ ఇవ్వడమే తారక్ దేవర సినిమా చేస్తున్న జాన్వి కపూర్ చరణ్ బుచ్చి బాబు కాంబో మూవీలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. 


ఇక ఇప్పుడు నాని తో శ్రీకాంత్ ఓదెల చేయబోతున్న సినిమాలో కూడా ఆమె నటిస్తుందని సమాచారం తెలుస్తుంది. ఐతే జాన్వి ఈ సినిమాలో కన్ఫర్మా కాదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఐతే ఈ విషయం తెలిసిన నాని ఫ్యాన్స్ మాత్రం జాన్వి వద్దు కీర్తి సురేష్ నే ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని అంటున్నారు.ఎందుకంటే దసరాలో వెన్నెల పాత్రలో కీర్తి సురేష్ అదరగొట్టేసింది. మళ్లీ అదే కాంబో సినిమా కాబట్టి హీరోయిన్ గా కీర్తి నే తీసుకుంటే మంచిది అని అంటున్నారు. ఐతే సినిమా కథను బట్టి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ని బట్టి ఎవరిని తీసుకోవాలన్నది మేకర్స్ నిర్ణయిస్తారట. నాని శ్రీకాంత్ ఓదెల సినిమాలో కీర్తి సురేష్ అయితే బాగానే ఉంటుంది ఒకవేళ జాన్వి కపూర్ చేస్తే ప్లాప్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమా గురించి మిగతా డీటైల్స్ అతి త్వరలో బయటకు రానున్నాయి. దసరా సినిమా తర్వాత తెలుగులో ఒక్క సినిమా చాన్స్ అందుకోని కీర్తి సురేష్ మళ్లీ దసరా కాంబో సినిమానే చేస్తుందా లేదా ఆ అవకాశాన్ని పోగొట్టుకుంటుందా అన్నది చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>