PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddyebae0571-d4b5-47c4-bbb9-eb1d1277045f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanthreddyebae0571-d4b5-47c4-bbb9-eb1d1277045f-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. అలాగే 200 యూనిట్లకు ఉచిత కరెంట్, 500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో అంగన్ వాడీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి హామీ ఇచ్చారు. తాజాగా అంగన్ వాడీ ఉద్యోగస్తులకు తెలంగాణ సర్కర్ మరో శుభవార్revanthreddy{#}rajeev;revanth;Revanth Reddy;Telangana Chief Minister;Congress;Government;Telangana;Ministerఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..!ఆ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన రేవంత్ సర్కార్..!revanthreddy{#}rajeev;revanth;Revanth Reddy;Telangana Chief Minister;Congress;Government;Telangana;MinisterWed, 17 Jul 2024 07:30:34 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేశారు. అలాగే 200 యూనిట్లకు ఉచిత కరెంట్, 500 లకే గ్యాస్ సిలిండర్ లాంటి పథకాలకు శ్రీకారం చుట్టారు. గతంలో అంగన్ వాడీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కి సంబంధించి హామీ ఇచ్చారు. తాజాగా అంగన్ వాడీ ఉద్యోగస్తులకు తెలంగాణ సర్కర్ మరో శుభవార్త చెప్పింది.అంగన్వాడీలు ఎప్పటి నుంచో చేస్తున్న ఆందోళనలకు ప్రభుత్వం వారికి మంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ని ప్రకటించింది.బీ ఆర్ ఎస్ అధికారం లో ఉన్నప్పుడు అంగన్వాడీలకు సరిగా జీతాలు కూడా పడలేదని.. కాంగ్రెస్ పాలనలో వారికి 1వ తేదీనే జీతాలు పడుతున్నాయని మంత్రి సీతక్క చెప్పారు. ఐతే ఇంకా అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు నాయపరమైన డిమాండ్లు నెరవేరుస్తామని అన్నారు. సీతక్క ప్రకటనతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీవో నెంబర్ 10 రద్ధు తో పాటుగా అంగన్వాడీల సమస్యల పట్ల మంత్రి సీతక్క సామరస్యపూర్త్వకంగా స్పందించారని చెబుతున్నారు. మిగతా సమస్యల కూడా త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని వారు నమ్ముతున్నారు.ఇటీవల జరిగిన 'అమ్మ పాట- అంగన్‌వాడి బాట' కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పిల్లకు తొలి ఒడి అమ్మ అయితే.. మలి ఒడి అంగన్ వాడీ కేంద్రాలే అని అన్నారు. పిల్లలకు చిన్నప్పటి నుంచి విద్యాబుద్దితో పాటు క్రమ శిక్షణ నేర్పిస్తూ భావి భారత పౌరులకు గా తీర్చి దిద్దిదేందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఇకపై రిటైర్‌మెంట్ తర్వాత టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.1 లక్ష రూపాయలు బెనిఫిట్స్ కల్పిస్తామని అన్నాను. కాంగ్రెస్ మాట ఇస్తే అది నెరవేర్చుతుందని అన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>