MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs3f898fb6-e670-4582-baf6-b7114dbe2412-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vs3f898fb6-e670-4582-baf6-b7114dbe2412-415x250-IndiaHerald.jpgప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరీర్ నీ ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి ఈయన వరుసగా మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. దానితో విశ్వక్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ శాతం విజయాలే ఉన్నాయి. ఆఖరుగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి vs{#}Ravi;anjali;neha shetty;ravi teja;Godavari River;Viswak sen;Suresh;Josh;cinema theater;Posters;Tollywood;Box office;Mass;Telugu;Hero;Cinemaవిశ్వక్ "మెకానిక్ రాఖీ" కి సూపర్ బిజినెస్.. ఆ సంస్థ చేతికి ఆల్ ఇండియా థియేటర్ హక్కులు..!విశ్వక్ "మెకానిక్ రాఖీ" కి సూపర్ బిజినెస్.. ఆ సంస్థ చేతికి ఆల్ ఇండియా థియేటర్ హక్కులు..!vs{#}Ravi;anjali;neha shetty;ravi teja;Godavari River;Viswak sen;Suresh;Josh;cinema theater;Posters;Tollywood;Box office;Mass;Telugu;Hero;CinemaWed, 17 Jul 2024 09:50:00 GMTప్రస్తుతం అద్భుతమైన జోష్ లో కెరీర్ నీ ముందుకు సాగిస్తున్న టాలీవుడ్ యువ నటులలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా ద్వారా ఈయనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి ఈయన వరుసగా మంచి కథలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. దానితో విశ్వక్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ శాతం విజయాలే ఉన్నాయి. ఆఖరుగా ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. 

మూవీ లో నేహా శెట్టి హీరోయిన్ గా నటించగా ... అంజలి ఓ కీలకమైన పాత్రలో నటించింది. ఈ మూవీ తో కూడా ఈ నటుడికి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం దక్కింది. ఇకపోతే ప్రస్తుతం విశ్వక్ "మెకానిక్ రాఖీ" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి రవితేజ మల్లపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే అద్భుతమైన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క దేశ వ్యాప్త థియేటర్ రైట్స్ ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ ఎల్ పి సంస్థ దక్కించుకుంది.

ఈ విషయాన్ని ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు కూడా ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యి మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలు విడుదల అయ్యి వాటిపై మంచి అంచనాలు ఉంటే తప్ప బిజినెస్ క్లోజ్ అవ్వడం లేదు. అలాంటిది విశ్వక్ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాఖీ మూవీ నుండి పెద్దగా ఎలాంటి ప్రచార చిత్రాలు ఏమి విడుదల కాలేదు. అయినా ఈ సినిమా యొక్క దేశవ్యాప్త థియేటర్ హక్కులు అమ్ముడుపోయాయి అంటే విశ్వక్ క్రేజ్ విపరీతంగా పెరిగినట్లు అని చెప్పవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>