MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఒక యంగ్ హీరోకు వరసగా మూడు ఫ్లాప్ లు వస్తే అతడితో సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రారు. అయితే ఈవిషయంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ పరిస్థితి మాత్రం విభిన్నం. గత కొంతకాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ఇతడికి వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మంచి హైట్ తో పాటు మంచి లుక్ అన్నింటా మించి దర్శకుడు శోభన్ కొడుకు ఇతడు కావడంతో అతడి తండ్రి పై ఉన్న అభిమానంతో ఈ యంగ్ హీరోకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ‘వర్షం’ మూవీతో ప్రభాస్ ను క్రేజీ హీరోగా మార్చిన శోభన్ అంటే ప్రభాస్ కు చాల అభిమానం అని అంటారు. ఆ అభిమానంతోనే శోsantosh shobhan{#}Prabhas;adhithya;Music;Thota Chandrasekhar;Father;Darsakudu;Santhossh Jagarlapudi;Yevaru;Athadu;Hero;Cinema;Directorసంతోష్ శోభన్ కెరియర్ కు కీలకంగా మారిన కపుల్ ఫ్రెండ్లీ !సంతోష్ శోభన్ కెరియర్ కు కీలకంగా మారిన కపుల్ ఫ్రెండ్లీ !santosh shobhan{#}Prabhas;adhithya;Music;Thota Chandrasekhar;Father;Darsakudu;Santhossh Jagarlapudi;Yevaru;Athadu;Hero;Cinema;DirectorTue, 16 Jul 2024 14:07:26 GMTఒక యంగ్ హీరోకు వరసగా మూడు ఫ్లాప్ లు వస్తే అతడితో సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రారు. అయితే ఈవిషయంలో యంగ్ హీరో సంతోష్ శోభన్ పరిస్థితి మాత్రం విభిన్నం. గత కొంతకాలంగా వరస ఫ్లాప్ లతో సతమతమైపోతున్న ఇతడికి వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. మంచి హైట్ తో పాటు మంచి లుక్ అన్నింటా మించి దర్శకుడు శోభన్ కొడుకు ఇతడు కావడంతో అతడి తండ్రి పై ఉన్న అభిమానంతో ఈ యంగ్ హీరోకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.



‘వర్షం’ మూవీతో ప్రభాస్ ను క్రేజీ హీరోగా మార్చిన శోభన్ అంటే ప్రభాస్ కు చాల అభిమానం అని అంటారు. ఆ అభిమానంతోనే శోభన్ లేకపోయినప్పటికీ అతడి కొడుకుకి వరసపెట్టి అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థగా పేరు గాంచిన యువీ క్రియేషన్స్ సంతోష్ తో వరసపెట్టి సినిమాలు తీస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఈ యంగ్ హీరో పుట్టినరోజు సందర్భంగా ప్రకటించిన మూవీ టైటిల్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.



డిఫరెంట్ కథలను డిఫరెంట్ టైటిల్స్ తో వెరైటీగా తీయగలిగితే ఆసినిమాలు సూపర్ హిట్ అవుతున్న పరిస్థితులలో ఈమూవీ ఈ యంగ్ హీరోకు కోరుకున్న హిట్ ఇస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఈమధ్య కాలంలో అతడు నటించిన ‘మంచిరోజులు వచ్చాయి’ ‘అన్నీ మంచి శకునములే’ లాంటి సినిమాలకు మంచి టాక్ వచ్చినప్పటికీ ఆసినిమాలు కలక్షన్స్ విషయంలో ఆమూవీ నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టలేకపోయాయి.



దీనితో ఎలర్ట్ అయిన ఈ యంగ్ హీరో తన తదుపరి సినిమాల కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అశ్విన్ చంద్రశేఖర్ అనే యంగ్ డైరెక్టర్ దర్శకత్వం నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీకి  ఆదిత్య రవీంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. వీరితో పాటు ఈసినిమాకు పనిచేస్తున్న వారంతా కొత్త టీమ్ కావడం మరింత విశేషం..












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>