Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleac105202-6b15-44e4-9132-33db0de822d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleac105202-6b15-44e4-9132-33db0de822d0-415x250-IndiaHerald.jpgనాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా పదుకొణే కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. కల్కి 2898 ఏడీ సినిమాలో ఆయన సృష్టించిన సరికొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్ కొత్తగా ఫీలవుతున్నారు. ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ సత్తా చాటుతుంది. ఇప్పటికే సినిమా నార్త్ అమెsocialstars lifestyle{#}surya sivakumar;Darsakudu;Amitabh Bachchan;Maha;Blockbuster hit;Director;Chitram;Success;krishnam raju;nag ashwin;Prabhas;Yevaru;vijay kumar naidu;Cinemaప్రభాస్ 'కల్కి' సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన బ్లండర్ మిస్టేక్ అదేనా..?ప్రభాస్ 'కల్కి' సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన బ్లండర్ మిస్టేక్ అదేనా..?socialstars lifestyle{#}surya sivakumar;Darsakudu;Amitabh Bachchan;Maha;Blockbuster hit;Director;Chitram;Success;krishnam raju;nag ashwin;Prabhas;Yevaru;vijay kumar naidu;CinemaTue, 16 Jul 2024 10:20:00 GMTనాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘కల్కి 2898 AD’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. దీపికా పదుకొణే కథానాయికగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది.దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. కల్కి 2898 ఏడీ సినిమాలో ఆయన సృష్టించిన సరికొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్ కొత్తగా ఫీలవుతున్నారు.  ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ సత్తా చాటుతుంది. ఇప్పటికే  సినిమా నార్త్ అమెరికాలో 130కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఓవర్సీస్‌లో రెండు వందల కోట్లకుపైగా కలెక్షన్లని వసూలు చేసినట్టు తెలుస్తుంది. ఇంకా సినిమా హవా నడుస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. కొన్ని లోపాలు జరిగాయి. ఆడియెన్స్ అసంతృప్తికి సంబంధించిన విషయాలున్నాయి. వాటి ప్రస్తావన వచ్చింది. దీనిపై నాగ్‌ అశ్విన్‌ స్పందించారు.నాగ్ అశ్విన్ .. కల్కి సినిమాను మన పురాణ ఇతిహాసాలకు సైన్స్ ఫిక్షన్ జోడించి ‘కల్కి 2898 AD’ సినిమాను తెరకెక్కించారు. భవిష్యత్తులో మన ప్రపంచం ఎలా ఉండబోతుందో ఊహించుకొని కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు. ముఖ్యంగా ప్రపంచంలో చివరి పట్టణమైన కాశీని చూపించడంతో పాటు .. కర్ణుడు అంటేనే సహజ కవచ కుండలాలతో సూర్య వర ప్రసాదంగా కుంతీకి పుట్టిన మొదటి సంతానం.

అయితే.. యుద్దానికి ముందు అర్జునుడి విజయం కోసం ఇంద్రుడు .. ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి కర్ణుడి నుంచి ఆయనుకున్న సహజ కవచ కుండలాలను దానం గా అడుగుతాడు. అయితే.. కర్ణుడు ఎలాంటి సంకోచం లేకుండా.. తన ఒంటిపై ఉన్న కవచ కుండలాను దానం చేసేస్తాడు. అయితే.. కల్కి సినిమాలో ప్రభాస్ ను కర్ణుడి చూపించినపుడు.. అది యుద్ధ రంగంలో కర్ణుడిని కవచ కుండలాలతో చూపించడాన్ని తప్పు పడుతున్నారు పండితులు.యుద్ధ సమయంలో .. మహా భారతంలోని కర్ణ పర్వంలో కర్ణుడు యుద్ధ రంగంలో ప్రవేశిస్తాడు. ఆ సమయంలో కర్ణుడికి ఎలాంటి కవచ కుండలాలు ఉండవు. ఈ విషయాన్ని నాగ్ అశ్విన్ గుర్తు పెట్టుకొని ఉంటే బాగుండేది పండితులు చెబుతున్నారు. మొత్తంగా ‘కల్కి’ సినిమాతో పండితుల నుంచి పామరుల వరకు అందరి దృష్టిని నాగ్ అశ్విన్ ఆకర్షించడం విశేషం. మొత్తంగా ‘కల్కి’ సినిమా పూర్తిగా కాల్పనికంగా తెరకెక్కించిన నాగ్ అశ్విన్.. మహా భారతంలోని మహారథుడైన కర్ణుడి పాత్రను అలా చూపించడాన్ని తప్పు పడుతున్నారు.అయితే ఈ సినిమాలో సక్సెస్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను ఎవరు గుర్తించలేకపోయారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>