Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil12bd8dcd-7904-4720-8cbd-ce27f4279f5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil12bd8dcd-7904-4720-8cbd-ce27f4279f5e-415x250-IndiaHerald.jpgఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీల నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఒక్క ఫ్యామిలీ నుంచి మాత్రం హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన గుర్తింపును సంపాదించుకోలేకపోతున్నారు హీరోలు. అదే అక్కినేని ఫ్యామిలీ. గతంలో నాగేశ్వరరావు ఆ తర్వాత వారసుడిగా వచ్చిన నాగార్జున స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో హవా నడిపించారు. అయితే నాగార్జున వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇప్పటివరకAkhil{#}AK Entertainments;akhil akkineni;surender reddy;Akkineni Nageswara Rao;Sony;Akkineni Nagarjuna;Audience;Cinema;Teluguఅఖిల్ 'ఏజెంట్' కి మోక్షం లభించిందిగా.. కానీ ఓటీటీలో కాదు?అఖిల్ 'ఏజెంట్' కి మోక్షం లభించిందిగా.. కానీ ఓటీటీలో కాదు?Akhil{#}AK Entertainments;akhil akkineni;surender reddy;Akkineni Nageswara Rao;Sony;Akkineni Nagarjuna;Audience;Cinema;TeluguTue, 16 Jul 2024 09:15:00 GMTఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో బడా ఫ్యామిలీల నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అయితే ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. కానీ ఒక్క ఫ్యామిలీ నుంచి మాత్రం హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన గుర్తింపును సంపాదించుకోలేకపోతున్నారు హీరోలు. అదే అక్కినేని ఫ్యామిలీ. గతంలో నాగేశ్వరరావు ఆ తర్వాత వారసుడిగా వచ్చిన నాగార్జున స్టార్ హీరోలుగా ఇండస్ట్రీలో హవా నడిపించారు.


 అయితే నాగార్జున వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన నాగచైతన్య, అఖిల్ మాత్రం ఇప్పటివరకు స్టార్ హీరోలుగా ఎదగలేకపోయారు. ఇంకా తమ కెరియర్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మరీ ముఖ్యంగా అఖిల్ ఇప్పటివరకు అరడజనుకు పైగా సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన.. ఒక సాలిడ్ హీట్ మాత్రం కొట్టలేకపోయాడు. అయితే గత ఏడాది అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించారు.



 సరిగ్గా ఎడిట్ చేయకుండానే ఎలా పడితే అలా రిలీజ్ చేయడంతో పాటు కథ కూడా ప్రేక్షకులకు నచ్చకపోవడంతో.. ఇక ఈ సినిమా పెద్దగా థియేటర్లలో ఆడలేదు. అయితే ఇక థియేటర్లో ఎలాగో ఫెయిల్ అయింది. కనీసం ఓటీటీలో అయినా ఈ సినిమాను చూద్దాం. అనుకొని ఎంతో మంది అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లీవ్ సొంతం చేసుకుంది. మరో వారం రోజుల్లో స్రీమింగ్ అనుకునే లోపు.. ఈ సినిమా వివాదాల బారిన పడింది. నిర్మాతల వివాదాలు వలన ఏజెంట్ ఓటీటీకి రాకుండా పోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ గురించి కూడా అందరూ మర్చిపోయారు.  కానీ ఎట్టకేలకు ఈ మూవీకి మోక్షం లభించింది. అయితే ఓటిటిలో కాదు ఏకంగా టీవీలోనే నేరుగా ప్రసారం కాబోతుంది. జూలై 28వ తేదీన ఈ సినిమా గోల్డ్ మైన్స్ టెలిఫిలిమ్స్ చానల్లో ప్రసారం కాబోతుంది. కేవలం హిందీలోనే ఇది స్ట్రీమింగ్ కానుండడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>