PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jc-prabkar-reddy-tdp-rayalasima5b6ca784-cd1f-4424-8f78-e32b1bc5050b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jc-prabkar-reddy-tdp-rayalasima5b6ca784-cd1f-4424-8f78-e32b1bc5050b-415x250-IndiaHerald.jpg•టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో మాస్ కా బాప్ * కటౌట్ తోనే భారీ గుర్తింపు. •చూడడానికి శాంతియుతం.. ఆయనతో పెట్టుకుంటే ప్రభంజనే (ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ) ఫ్యాక్షనిస్టుకి కేరాఫ్ అడ్రస్ గా మారిన తాడిపత్రి నియోజకవర్గంలో జెసి ప్రభాకర్ రెడ్డి, జెసి దివాకర్ రెడ్డి అన్నదమ్ములకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా గెలుపొంది, పదవి బాధ్యతలు చేపట్టడమే కాదు గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి తాడిపత్రికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చారు.. ఇకపోతే జెసి ప్రభాకర్ రెడ్డిJC PRABKAR REDDY;TDP;RAYALASIMA{#}prabhakar reddy;Varasudu;Mass;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;India;TDP;Reddyజేసీ ప్రభాకర్ రెడ్డి: మాస్ కా బాప్.. కటౌట్ తోనే గుర్తింపు..!జేసీ ప్రభాకర్ రెడ్డి: మాస్ కా బాప్.. కటౌట్ తోనే గుర్తింపు..!JC PRABKAR REDDY;TDP;RAYALASIMA{#}prabhakar reddy;Varasudu;Mass;prabhakar;Chintamaneni Prabhakar;Parakala Prabhakar;India;TDP;ReddyTue, 16 Jul 2024 07:51:00 GMT•టాప్ టు బాటమ్ వైట్ అండ్ వైట్ లో మాస్ కా బాప్

* కటౌట్ తోనే భారీ గుర్తింపు.

•చూడడానికి శాంతియుతం.. ఆయనతో పెట్టుకుంటే ప్రభంజనే


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఫ్యాక్షనిస్టుకి కేరాఫ్ అడ్రస్ గా మారిన తాడిపత్రి నియోజకవర్గంలో జెసి ప్రభాకర్ రెడ్డి,  జెసి దివాకర్ రెడ్డి అన్నదమ్ములకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా,  ఎమ్మెల్యేగా గెలుపొంది,  పదవి బాధ్యతలు చేపట్టడమే కాదు గతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి తాడిపత్రికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చారు.. ఇకపోతే జెసి ప్రభాకర్ రెడ్డి గురించి అక్కడి ప్రాంత ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కానీ చాలామందికి ఆయన పేరు తెలియదు కానీ ఆయన కటౌట్ చూస్తే మాత్రం ఆయనే అని గుర్తుపట్టేస్తారు.. దీనికి కారణం ఆయన సపరేటు స్టైల్ మెయింటైన్ చేయడమే అని చెప్పాలి.

వైట్ అండ్ వైట్ ధరించి.. గుబురు గడ్డం.. తలకు కూడా తెలుపు రంగు పాగా ధరించి.. శాంతికి , స్వచ్ఛతకు ప్రత్యేకగా తెలుపు వస్త్రాలను ధరిస్తూ అందరిలో ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు . కానీ ఆయనను చూస్తే మాత్రం ఫ్యాక్షనిస్టుకి  కేరాఫ్ అడ్రస్.. మాస్ కా బాప్ అనడంలో సందేహం లేదు. తన స్టైల్ తోనే తన గుర్తింపును మరింత పెంచేసుకున్నారు. ఈ మధ్య 2024 ఎన్నికలలో మరింతగా ప్రచారాలు చేపట్టిన ఈయన తన కొడుకును అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రజలకు మంచి చేకూర్చడంలో ఎప్పుడు ముందుంటారు.. అందుకే ఆయనను ప్రజలు మళ్ళీ గుండెల్లో పెట్టుకున్నారని చెప్పవచ్చు.. అందులో భాగంగానే ఆయన వారసుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఎమ్మెల్యేగా పదవిని కట్టబెట్టారు.

ఇకపోతే జెసి ప్రభాకర్ రెడ్డి తనదైన డ్రెస్సింగ్ స్టైల్ తో ఒక గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు మంచి పనులు చేసి ప్రజలలో అంతకుమించి పేరు సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు.. అక్కడ శాంతియుతం నెలకొనాలన్నా లేదా గొడవలు భగ్గుమనాలన్నా సరే జెసి ప్రభాకర్ రెడ్డి చేతుల్లోనే.. తాడిపత్రి మొత్తం తన గుప్పెట్లో పెట్టుకున్న ఈయన టిడిపి పార్టీ జెండాను పాతి మరొకసారి తమ స్టామినా నిరూపించారు. ఏదేమైనా తన స్టైల్ తోనే అందరిలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>