PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rammohan-naidue27e3ded-81ec-461d-9eec-59fd7e10cf1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/rammohan-naidue27e3ded-81ec-461d-9eec-59fd7e10cf1c-415x250-IndiaHerald.jpgసిక్కోలు సింహం యంగ్ లీడర్ రామ్మోహన్ స్టైలే వేరబ్బా!• యంగ్ అండ్ డైనమిక్ నేతగా రికార్డులు సృష్టించిన రామ్మోహన్ నాయుడు! • డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీతో ఆకట్టుకుంటున్న రామ్మోహన్! • డ్రెస్సింగ్ స్టైల్ సూపర్.. హీరోని తలపించే స్టైల్ రామ్మోహన్ సొంతం! ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: తండ్రి ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన యువ నేతగా ఎదిగారు రామ్మోహన్ నాయుడు. ఓటమి ఎరుగని నేతగా హ్యాట్రిక్ విజయాలు సాధించి యంగ్ అండ్ డైనమిక్ నేతగా రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నాడుRammohan Naidu{#}Ram Mohan Naidu Kinjarapu;Srikakulam;Parliment;MP;Father;central government;Yuva;Fidaa;Andhra Pradesh;India;Leader;Teluguసిక్కోలు సింహం యంగ్ లీడర్ రామ్మోహన్ స్టైలే వేరబ్బా!సిక్కోలు సింహం యంగ్ లీడర్ రామ్మోహన్ స్టైలే వేరబ్బా!Rammohan Naidu{#}Ram Mohan Naidu Kinjarapu;Srikakulam;Parliment;MP;Father;central government;Yuva;Fidaa;Andhra Pradesh;India;Leader;TeluguTue, 16 Jul 2024 08:28:42 GMT
• యంగ్ అండ్ డైనమిక్ నేతగా రికార్డులు సృష్టించిన రామ్మోహన్ నాయుడు! 


• డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీతో ఆకట్టుకుంటున్న రామ్మోహన్! 


• డ్రెస్సింగ్ స్టైల్ సూపర్.. హీరోని తలపించే స్టైల్ రామ్మోహన్ సొంతం! 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: తండ్రి ఎర్రన్నాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని శ్రీకాకుళం జిల్లాలోనే బలమైన యువ నేతగా ఎదిగారు రామ్మోహన్ నాయుడు. ఓటమి ఎరుగని నేతగా హ్యాట్రిక్ విజయాలు సాధించి యంగ్ అండ్ డైనమిక్ నేతగా రామ్మోహన్ నాయుడు దూసుకుపోతున్నాడు.చూడ్డానికి డేరింగ్ అండ్ డాషింగ్ పర్సనాలిటీగా కనిపించే రామ్మోహన్ నాయుడు హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే నేతగా మంచి గుర్తింపు సంపాదించాడు. అదిరిపోయే గొంతు అతడి సొంతం. స్పష్టమైన మాటతో పార్లమెంటులో బలమైన గొంతును వినిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నారని చెప్పవచ్చు. ఇప్పటికే శ్రీకాకుళం ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన రామ్మోహన్ అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డ్ సృష్టించాడు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రామ్మోహన్ నాయుడు తండ్రి మరణం తర్వాత క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాడు.


 ఎప్పుడూ చాలా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండే రామ్మోహన్ నాయుడు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడే వ్యక్తిత్వం ఉన్న నాయకుడు. 2013 నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన రామ్మోహన్ నాయుడు టిడిపిలో కీలకంగా వ్యవహరించారు.రామ్మోహన్ 2014లో శ్రీకాకుళం నుంచి మొదటిసారిగా పోటీ చేసి అద్భుతమైన మెజారిటీతో గెలిచి పార్లమెంటులో అడుగు పెట్టాడు. అప్పుడు రామ్మోహన్ వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. దీంతో 16వ లోక్ సభలో రెండవ అతి చిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు.ఆ తర్వాత 2019లో మరోసారి గెలిచి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. ఈ సమయంలోనే పార్లమెంటులో ఏపీకి సంబంధించి తన గొంతు వినిపించాడు. ప్రత్యేక హోదా, రైల్వేస్టేషన్, విమానాశ్రయాలు ఇలా ఏపీకి సంబంధించిన ఎన్నో సమస్యలపై కేంద్ర పెద్దలతో ధైర్యంగా మాట్లాడాడు. దీంతో రామ్మోహన్ నాయుడు పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్మోగిపోయింది. 


చివరికి 2024 ఎంపీ ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిచిన రామ్మోహన్ నాయుడును కేంద్రమంత్రి పదవి వరించింది. ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రామ్మోహన్ నాయుడు. ఇక రామ్మోహన్ నాయుడు డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. కేంద్ర మంత్రి అయ్యాక ఎక్కువగా కుర్తాలు ధరించి ఆకట్టుకుంటున్నాడు. అంతేగాక వాటిపైన రంగు రంగుల జాకెట్లు వేసి, శాలువలు వేసి ఆకట్టుకుంటున్నాడు రామ్మోహన్ నాయుడు. లైట్ గా నెరిసిన గడ్డంతో తిక్ హెయిర్ స్టైల్ తో హీరోస్ ని తలపించే స్టైల్ రామ్మోహన్ నాయుడు నాయుడు సొంతం. ప్రస్తుతం పాలిటిక్స్ లోకి రావాలనుకునే యూత్ కి ఆయన ఇన్స్పిరేషన్. ఆయన ధరించే కుర్తాలకు ఆంధ్రా యూత్ ఫిదా అయిపోతున్నారు. స్టైలిష్ లీడర్ గా ఆయన్ని కొనియాడుతున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>