PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ap-cm-chandrababu-ap-chief-minister-chandrababu-naidu-tdp-chandrababu-chitturu-politics-ap-government109812f2-7799-4e2c-a520-8294658c3e9f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ap-cm-chandrababu-ap-chief-minister-chandrababu-naidu-tdp-chandrababu-chitturu-politics-ap-government109812f2-7799-4e2c-a520-8294658c3e9f-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. కంటిన్యూగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఐదేళ్లు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేస్తే మొత్తం తెలుగు గడ్డపై ఏకంగా 19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన సరికొత్త రికార్డు ఆయన పేరిటChandrababu; AP CM Chandrababu; AP chief minister Chandrababu Naidu; TDP Chandrababu; chitturu politics; AP government{#}Anandam;Josh;Chittoor;Telugu Desam Party;Tirupati;shankar;CBN;Telangana Chief Minister;Assembly;YCP;Telugu;Andhra Pradesh;Districtబాబుకు నాలుగోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌విక‌న్నా అదే ఎక్కువ సంతోషంగా ఉందా..!బాబుకు నాలుగోసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌విక‌న్నా అదే ఎక్కువ సంతోషంగా ఉందా..!Chandrababu; AP CM Chandrababu; AP chief minister Chandrababu Naidu; TDP Chandrababu; chitturu politics; AP government{#}Anandam;Josh;Chittoor;Telugu Desam Party;Tirupati;shankar;CBN;Telangana Chief Minister;Assembly;YCP;Telugu;Andhra Pradesh;DistrictTue, 16 Jul 2024 09:17:00 GMTటీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. కంటిన్యూగా తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రకు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఐదేళ్ల గ్యాప్ తర్వాత నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈ ఐదేళ్లు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేస్తే మొత్తం తెలుగు గడ్డపై ఏకంగా 19 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పని చేసిన సరికొత్త రికార్డు ఆయన పేరిట లిఖించబడి ఉంటుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి ఆ పార్టీని ఘోరంగా ఓడించి.. ఏకంగా 164 సీట్లతో ఘనవిజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.


ఈ ఘనవిజయం చంద్రబాబుకు మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కూటమి పార్టీల అభిమానులలో ఎక్కడా లేని ఉత్సాహాన్ని నింపింది. అయితే చంద్రబాబుకు.. నవ్యాంధ్రకు నాలుగో సారి ముఖ్యమంత్రి అవ్వటం కంటే.. మరో విషయం చాలా ఆనందం కలిగిస్తుంది అంట. అదే ఆయన సొంత జిల్లా చిత్తూరులో విజయం. పేరుకు మాత్రం చంద్రబాబు చిత్తూరు జిల్లాకు చెందిన వాడు.. అయితే సొంత జిల్లాలో చంద్రబాబుకు ఎప్పుడు పట్టుచిక్క‌టం లేదు. ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిత్తూరు జిల్లాలో గర్వంగా తలెత్తుకునే గెలుపు పార్టీకి దక్కలేదు. 2014లో ఆయన నవ్యాంధ్రలో గెలిచే ముఖ్యమంత్రి అయినా.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కేవలం ఐదు సీట్లు మాత్రమే వచ్చాయి.


అయితే ఈ ఎన్నికలలో తెలుగుదేశం చిత్తూరు జిల్లాలో రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలలో చిత్తూరు ఎంపీ సీటుతో పాటు ఏకంగా 12 అసెంబ్లీ సీట్లలో ఘనవిజయం సాధించింది. వైసీపీ కేవలం పుంగనూరు, తంబళ్లపల్లె సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అది కూడా తంబళ్లపల్లె సీటు శంకర్ యాదవ్ కి ఇచ్చి ఉంటే అక్కడ కూడా తెలుగుదేశం గెలిచి ఉండేది. తిరుపతి పార్లమెంటు సీటు బీజేపీకి కాకుండా నేరుగా తెలుగుదేశం పోటీచేసినా.. అక్కడ తెలుగుదేశం గెలిచి ఉండేది. ఏది ఏమైనా చాలా దశాబ్దాల తర్వాత తన సొంత జిల్లా చిత్తూరులో తన బలాన్ని నిరూపించుకోవడంతో.. చంద్రబాబులో ఎక్కడా లేని జోష్ అయితే ఉందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>