PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sangaredy-jaggareddy-style-big-beard-congress3a002fb9-1c14-4b52-be98-11dbea707c32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/sangaredy-jaggareddy-style-big-beard-congress3a002fb9-1c14-4b52-be98-11dbea707c32-415x250-IndiaHerald.jpgతూర్పు జయప్రకాశ్ రెడ్డి ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి జగ్గారెడ్డి రాజకీయమైనా సరే, మాట తీరు అయినా సరే చాలా స్పెషల్ గా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది రాజకీయ నాయకులు జనాల్లో వారి లుక్ అద్భుతంగా కనపడడం కోసం క్లీన్ షేవ్ చేసుకొని అద్భుతమైనటువంటి డ్రెస్సింగ్ స్టైల్ తో ఉంటారు. వారిని చూస్తేనే ఒక పెద్ద లీడర్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ జగ్గారెడ్డి అలా కాదు తల వెంట్రుకలు, మరోవైపు గడ్డాన్ని భారీగా పెంచుకొని అదే తన సsangaredy;jaggareddy;style;Big beard;congress{#}prabhakar;East;Tirupati;Chintamaneni Prabhakar;Sangareddy;Jagga Reddy;Parakala Prabhakar;Prasthanam;Leader;Bharatiya Janata Party;MLA;Election;Reddy;June;Revanth Reddy;Telangana;Party;Nani;Congress;Minister;Andhra Pradesh;Teluguజననాయకుడు జగ్గన్న..పెద్ద గడ్డమే ఆయనకు వరమా.?జననాయకుడు జగ్గన్న..పెద్ద గడ్డమే ఆయనకు వరమా.?sangaredy;jaggareddy;style;Big beard;congress{#}prabhakar;East;Tirupati;Chintamaneni Prabhakar;Sangareddy;Jagga Reddy;Parakala Prabhakar;Prasthanam;Leader;Bharatiya Janata Party;MLA;Election;Reddy;June;Revanth Reddy;Telangana;Party;Nani;Congress;Minister;Andhra Pradesh;TeluguTue, 16 Jul 2024 06:54:00 GMT- ముక్కు సూటిగా మాట్లాడే నైజం.!
- భారీ గడ్డంతో స్పెషల్ అట్రాక్షన్ .
- జగ్గన్న నీ స్టైలే వేరన్న అంటున్న జనం.!

తూర్పు జయప్రకాశ్ రెడ్డి ఈ పేరు ఎవరికి తెలియదు. కానీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి జగ్గారెడ్డి రాజకీయమైనా సరే, మాట తీరు అయినా సరే చాలా స్పెషల్ గా ఉంటుంది. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది రాజకీయ నాయకులు జనాల్లో వారి లుక్ అద్భుతంగా కనపడడం కోసం క్లీన్ షేవ్ చేసుకొని అద్భుతమైనటువంటి డ్రెస్సింగ్ స్టైల్ తో ఉంటారు. వారిని చూస్తేనే ఒక పెద్ద లీడర్ ను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ జగ్గారెడ్డి అలా కాదు తల వెంట్రుకలు, మరోవైపు గడ్డాన్ని భారీగా పెంచుకొని అదే తన స్టైల్ అంటాడు. అలా జగ్గారెడ్డి లాగా ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా గడ్డాన్ని పెంచుకుంటారు. ఈ విధంగా వీరు ఐదు సంవత్సరాలకు ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్లి పూర్తిస్థాయిలో గుండు కొట్టించుకొని తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత మళ్లీ ఐదు సంవత్సరాల వరకు వారు గడ్డం తీసుకోరు. డిఫరెంట్ స్టైల్ లో ఉండేటువంటి నాయకుల్లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి కూడా ఒకరు.. అలాంటి జగ్గారెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మున్సిపాలిటీ చైర్మన్ గా ఆ తర్వాత శాసన సభ్యుడిగా ప్రభుత్వ వీప్ గా ఎన్నో పదవులు అలంకరించాడు. అంతేకాకుండా 2021 జూన్ 28 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశాడు. జగ్గారెడ్డికి కే నిర్మలతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. అలాంటి ఈయన  1986లో బిజెపి తరఫున సంగారెడ్డి పురపాలక సంఘం కౌన్సిలర్ గా రాజకీయ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు.  1995లో సంగారెడ్డి  పురపాలక సంఘం చైర్మన్ బాధ్యతలు చేపట్టారు. అలాగే 2004లో  ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో  సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం నుంచి  టిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి  తన సమీప బిజెపి అభ్యర్థి కే సత్యనారాయణ పై 17,676 ఓట్ల మెజారిటీ సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

2009లో కూడా  మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2012 నుంచి 14 వరకు ప్రభుత్వ వీప్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2014లో మరోసారి పోటీ చేసి  టిఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2018 లో మరోసారి సంగారెడ్డి నుంచి పోటీ చేసి అద్భుతమైన మెజార్టీతో గెలుపొందారు.  ఈ విధంగా 2023 ఎలక్షన్స్ వచ్చేసరికి మరోసారి ఓటమి పాలయ్యాడు. ఇలా జగ్గారెడ్డి  ఏం చేసినా, ఏం మాట్లాడినా ముక్కుసూటిగా  చెప్పే విధానం. అందరూ నాయకుల లాగా మనసులో ఒకటి పెట్టుకొని, బయటకు మరొకటి మాట్లాడడు. ఈ విధంగా జగ్గారెడ్డి  తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ విధంగా డిఫరెంట్ గడ్డం స్టైల్ తో  మాటల తూటాలు పేల్చే జగ్గారెడ్డి  ఈ ఎన్నికల్లో గెలిచి ఉంటే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రి పదవి తప్పకుండా వచ్చేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ బ్యాడ్ లక్  2018లో గెలిచారు కానీ,  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసరికి తన అధికారాన్ని కోల్పోయారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>