PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/donald-trump-usa-trump-usha-chilkuri-james-world-usa-president-electionsfde375d2-8945-45ba-b47f-01ae448c6979-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/donald-trump-usa-trump-usha-chilkuri-james-world-usa-president-electionsfde375d2-8945-45ba-b47f-01ae448c6979-415x250-IndiaHerald.jpgఅమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు అందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో హాట్ ఫేవరెట్‌గా ఉన్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక జేడీ వాన్స్ వయసు 39 సంవత్సరాలు. వాన్స్ మంచి రచయిత. అలాగే మాజీ సక్సెస్ఫుల్ వెంచర్ క్యాపిటల్ లిస్టుగా కూడా ఆయన ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన రాజకీయంగా.. ఉన్నత భావాలతో అమెరికా ప్రజలను సింఫుల్‌గా ఆకట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని డోనాల్డ్ ట్రDonald Trump; USA Trump; Usha chilkuri; James world; USA president elections{#}usha;college;Donald Trump;Capital;American Samoa;Indian;marriage;Teluguఉషా చిలుకూరి... కాబోయే అమెరికా ఉపాధ్య‌క్షుడికి స‌తీమ‌ణి... మ‌న తెలుగ‌మ్మాయే..?ఉషా చిలుకూరి... కాబోయే అమెరికా ఉపాధ్య‌క్షుడికి స‌తీమ‌ణి... మ‌న తెలుగ‌మ్మాయే..?Donald Trump; USA Trump; Usha chilkuri; James world; USA president elections{#}usha;college;Donald Trump;Capital;American Samoa;Indian;marriage;TeluguTue, 16 Jul 2024 09:27:48 GMTఅమెరికా అధ్యక్ష ఎన్నికలలో పోరు రసవత్తరంగా సాగుతోంది. రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు అందరూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇక అధ్యక్ష ఎన్నికలలో హాట్ ఫేవరెట్‌గా ఉన్న మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్‌ను ఎంపిక చేసుకున్నారు. ఇక జేడీ వాన్స్ వయసు 39 సంవత్సరాలు. వాన్స్ మంచి రచయిత. అలాగే మాజీ సక్సెస్ఫుల్ వెంచర్ క్యాపిటల్ లిస్టుగా కూడా ఆయన ఉన్నారు. చిన్న వయసులోనే ఆయన రాజకీయంగా.. ఉన్నత భావాలతో అమెరికా ప్రజలను సింఫుల్‌గా ఆకట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని డోనాల్డ్ ట్రంప్ తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఖరారు చేసుకోవడంతో ట్రంప్‌కు చాలా ప్లస్ అయింది. ఈ విషయంలో ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారని.. అమెరికా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


దీనికి కారణం జేడి వాన్స్ సతీమణి.. ఉషా చిలుకూరి వాన్స్. ఇండియన్ హిందూ కుటుంబానికి చెందిన మహిళను వివాహం చేసుకున్న వాన్స్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ ఎంపిక చేయడం ద్వారా భారీ ఓట్లను కూడగట్టుకోబోతున్నారు. ఆసియా మూలాలు ఉన్న ఓటర్ల మద్దతు కూడా పొందుతానని.. ట్రంప్ అంచనా వేస్తున్నారు. ఇక ఉషా చిలుకూరి ఎవరో కాదు మన తెలుగు అమ్మాయే. తెలుగు కుటుంబానికి చెందిన ఉషా చిలుకూరి.. కేల్‌ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పటి నుంచి వాన్స్‌కు పరిచయం అయ్యారు. కాలేజీ ప్రాజెక్టులలో కలిసి పని చేశారు. తర్వాత ప్రేమలో పడ్డారు.. పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు సంతానం. ఉషా చిలుకూరి ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. దానినే ఆమె ఇష్టపడతారు.


భర్తకు రాజకీయ ప్రచారంలో సాయం చేసినా.. పెద్దగా వెలుగులోకి రాలేదు. లిటిగేటర్ గా పనిచేస్తూ ఉషా చిలుకూరి గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌తో పాటు.. కొందరు న్యాయమూర్తుల వద్ద కూడా పనిచేశారు. ఇక వాన్స్ ఉపాధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తర్వాత ట్రంప్.. వాన్స్ జోడి పై మరింత ఆసక్తికర చర్చ అమెరికా రాజకీయ వర్గాలలో నడుస్తోంది. ట్రంప్ కు పోటీగా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్‌ను కాదని.. ఆయన ఆరోగ్యం సరిగా లేదని అమెరికాను ప్రపంచంలో అగ్రశక్తిగా నిలపలేడ‌ని ఎక్కువ మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కాల్పుల ఘటన తర్వాత ట్రంప్‌కు అమెరికాలో మరింత పాజిటివిటీ కనిపిస్తోంది. ఏది ఏమైనా ఎన్నికలలో గెలిస్తే అమెరికా దేశ సెకండ్ ఉమెన్‌గా ఉషా చిలుకూరి అవుతారు. ఫస్ట్ ఉమెన్ గా ట్రంప్ సతీమణి ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>