Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral853b0963-611c-401e-8666-483b8846480e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral853b0963-611c-401e-8666-483b8846480e-415x250-IndiaHerald.jpgఇండియాలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం వెలుగులోకి వచ్చిన కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే క్రికెటర్లకు సంబంధించిన ప్రొఫెషనల్ విషయాల గురించి మాత్రమే కాదు పర్సనల్ విషయాల గురించి తెలుసుకునేందుకు కూడా అందరూ తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఏకంగా తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి మాజీ ఆటగాళ్లుగా కొనసాగుతున్న ముగ్గురు ప్లేయర్ల గురించి సంబంధించిన వార్త ఒకటి సోషల్ Viral{#}ali;Harbhajan Singh;Suresh;Audience;Cricket;Pakistan;Traffic policeటీమిండియా మాజీఫై కేసు.. ఇంతకీ ఏం జరిగిందంటే?టీమిండియా మాజీఫై కేసు.. ఇంతకీ ఏం జరిగిందంటే?Viral{#}ali;Harbhajan Singh;Suresh;Audience;Cricket;Pakistan;Traffic policeTue, 16 Jul 2024 07:01:00 GMTఇండియాలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ విషయం వెలుగులోకి వచ్చిన కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే క్రికెటర్లకు సంబంధించిన ప్రొఫెషనల్ విషయాల గురించి మాత్రమే కాదు పర్సనల్ విషయాల గురించి తెలుసుకునేందుకు కూడా అందరూ తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు ఏకంగా తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించి మాజీ ఆటగాళ్లుగా కొనసాగుతున్న ముగ్గురు ప్లేయర్ల గురించి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.


 ఒకప్పుడు తమ ఆట తీరుతో ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుని కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న మాజీ క్రికెటర్లు ఇక ఇప్పుడు సరదాగా చేసిన పని ఎంతోమందికి కోపం తెప్పిస్తుంది. కోపం తెప్పించడమే కాదు ఏకంగా ఈ ముగ్గురు క్రికెటర్ల పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యేవరకు పరిస్థితిని తీసుకువచ్చింది అని చెప్పాలి. దీంతో  ఈ మాజీ క్రికెటర్లపై ఎంతో మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యే పరిస్థితిని కొని తెచ్చుకున్న మాజీ క్రికెటర్లు ఎవరో కాదు.. ఒకప్పుడు తమ ఆట తీరూతో ఎంతగానో ఆకట్టుకున్న యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలే వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ట్రోఫీలో భారత జట్టు పాకిస్తాన్ ఓడించింది అన్న విషయం తెలిసిందే.


 ఇలా ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడించి ఏకంగా టైటిల్ విజేతగా నిలిచింది. దీంతో ఇక భారత మాజీ ఆటగాళ్లందరూ కూడా సంబరాల్లో మునిగిపోయారు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు ఏకంగా కుంటూతూ సెలబ్రేట్ చేసుకున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వీరు వైకల్యం కలిగిన వారిని హేళన చేసే విధంగా ప్రవర్తించారు అంటూ ఆర్మాన్ అలీ ఢిల్లీలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీంతో ఇలా ముగ్గురు మాజీ క్రికెటర్ల పై కేసు నమోదు కావడం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>