MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar624f4f69-3f65-40e4-85f7-bf26cb89b41a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar624f4f69-3f65-40e4-85f7-bf26cb89b41a-415x250-IndiaHerald.jpg30 ఏళ్ల అనుభవంతో చెత్త రికార్డ్ కొట్టిన శంకర్? తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో కూడా ఆయన తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఆయన మొదటి సినిమా 'జెంటిల్‌మన్' తమిళంతో పాటు తెలుగులో కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. ఇక ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇంకా రోబో.. ఇలా తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఘనత ఆయన సొంతం. అయితే శంకర్ కి మధ్య మధ్యలో ఫ్లోప్స్ కూడా పడ్డాయి.తన స్థాయికి తగని సినిమాలు కూడా కొన్ని అందించాడు శంకర్. అందులోShankar{#}Chatrapathi Shivaji;Sivaji;Ram Charan Teja;shankar;Telugu;Director;Audience;Cinema30 ఏళ్ల అనుభవంతో చెత్త రికార్డ్ కొట్టిన శంకర్?30 ఏళ్ల అనుభవంతో చెత్త రికార్డ్ కొట్టిన శంకర్?Shankar{#}Chatrapathi Shivaji;Sivaji;Ram Charan Teja;shankar;Telugu;Director;Audience;CinemaTue, 16 Jul 2024 20:17:00 GMTతమిళ టాప్ డైరెక్టర్ శంకర్  గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో కూడా ఆయన తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.ఆయన మొదటి సినిమా 'జెంటిల్‌మన్' తమిళంతో పాటు తెలుగులో కూడా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. ఇక ఆ తర్వాత ప్రేమికుడు, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ ఇంకా రోబో.. ఇలా తిరుగులేని బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఘనత ఆయన సొంతం. అయితే శంకర్ కి మధ్య మధ్యలో ఫ్లోప్స్ కూడా పడ్డాయి.తన స్థాయికి తగని సినిమాలు కూడా కొన్ని అందించాడు శంకర్. అందులో 'బాయ్స్' మొదటిది. అయినా ఆ చిత్రాన్ని ఫ్లాప్ అనలేం. ఉన్నంతలో బాగానే ఆడింది. ఆ తర్వాత 'ఐ'తో నిరాశపరిచాడు. దానికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అందులో శంకర్ కష్టాన్ని జనం గుర్తించారు. '2.0'కు కూడా మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా లేకపోయింది.


30 సంవత్సరాల కెరీర్లో శంకర్‌కు ప్రేక్షకుల నుంచి పూర్తిగా తిరస్కారం ఎప్పుడూ రాలేదు. ఆయన సినిమాలకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా కానీ దర్శకుడిగా తన స్థాయి అంతగా పడిపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేక్షకుల నుంచి ఔట్ రైట్ రిజెక్షన్ బాగా ఎదుర్కొన్నాడు శంకర్. 'భారతీయుడు-2' సినిమాకి ప్రేక్షకులు పూర్తిగా ముఖం చాటేశారు. అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులే తొలి రోజు మంచి ఓపెనింగ్స్ ఇచ్చారు తప్ప.. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా మాత్రం ఆల్ టైం డిజాస్టర్లలో ఒకటైపోయింది. ఫుల్ రన్లో 50 కోట్ల గ్రాస్ రావడం కూడా కష్టమవుతోందంటే ప్రేక్షకులు ఈ సినిమా పట్ల ఎంత వ్యతిరేక భావాన్ని చూపించారో పూర్తిగా అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్లో శంకర్ ఎన్నడూ ఎదుర్కోని చెత్త రికార్డ్ ఇది. ఇక మరోవైపు ఆల్రెడీ పూర్తి కావచ్చిన 'గేమ్ చేంజర్' సినిమా ఎలా ఉంటుందో అన్న భయాలు రామ్ చరణ్ అభిమానులను ఎంతగానో వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు చిత్రాలను విజయవంతం చేయడం శంకర్‌కు పెద్ద టాస్క్. ఈ ఒత్తిడిలో ఆయన ఎలాంటి సినిమాలు  చేస్తాడో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>