PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishnaef1c5f84-1c69-471e-9b21-7ed7d3a5ee62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balakrishnaef1c5f84-1c69-471e-9b21-7ed7d3a5ee62-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై 31,602 ఓట్లతో విజయం సాధించి హ్యాట్రిక్ విన్స్‌ నమోదు చేశారు. బాలయ్య బాబు ఎన్నికల ప్రచారానికి తండోపతండాలుగా ప్రజలు తరలివస్తుంటారు. సినిమాల్లో లాగానే పంచు డైలాగులు పేలుస్తూ ఉంటారు. అంతే కాదు సినిమాల్లో ఎంత అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తారో బయట కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచార సమయంలో వైట్ కలర్ షర్టు వేసుకుంటారు. మెడలో ఒక పసుపు పచ్చ టీBalakrishna{#}lion;Lion;Samarasimhareddy;Adhurs;Turmeric;Fashion;Hindupuram;MLA;YCP;Andhra Pradesh;Hero;TDP;India;Cinema;Balakrishnaసినిమాల్లోనే కాదు పాలిటిక్స్‌లోనూ బాలయ్య బాబు లుక్ చాలా స్పెషల్..సినిమాల్లోనే కాదు పాలిటిక్స్‌లోనూ బాలయ్య బాబు లుక్ చాలా స్పెషల్..Balakrishna{#}lion;Lion;Samarasimhareddy;Adhurs;Turmeric;Fashion;Hindupuram;MLA;YCP;Andhra Pradesh;Hero;TDP;India;Cinema;BalakrishnaTue, 16 Jul 2024 08:23:00 GMT
* రాజకీయాల్లో యూనిట్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న సినిమా స్టార్స్‌

* అట్రాక్టివ్ గా కనిపించడంలో బాలయ్య ముందు

* పాలిటిక్స్‌లో తిరిగేటప్పుడు బాలయ్య బాబు లుక్ అదుర్స్

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

నందమూరి బాలకృష్ణ 2024 ఎన్నికల్లో హిందూపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపికపై 31,602 ఓట్లతో విజయం సాధించి హ్యాట్రిక్ విన్స్‌ నమోదు చేశారు. బాలయ్య బాబు ఎన్నికల ప్రచారానికి తండోపతండాలుగా ప్రజలు తరలివస్తుంటారు. సినిమాల్లో లాగానే పంచు డైలాగులు పేలుస్తూ ఉంటారు. అంతే కాదు సినిమాల్లో ఎంత అట్రాక్టివ్ లుక్‌లో కనిపిస్తారో బయట కూడా అదే లుక్ మెయింటైన్ చేస్తారు. బాలకృష్ణ ఎన్నికల ప్రచార సమయంలో వైట్ కలర్ షర్టు వేసుకుంటారు. మెడలో ఒక పసుపు పచ్చ టీడీపీ కండువా, నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని కనిపిస్తారు.

అయినా మూతిపై మీసాలు ఎప్పుడు గంభీరంగా మెయింటెన్ చేస్తారు. తరచుగా క్రీం కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ కూడా ధరిస్తారు. చేతులకు రకరకాల కడియాలు, రెస్ట్ వాచ్ పెట్టుకొని తన లుక్ కంప్లీట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఈ హీరో గడ్డం కూడా బాగా పెంచేశారు. అదే గడ్డంతో పాలిటిక్స్ లో కూడా తిరుగుతున్నారు. గ్రే అండ్ పెప్పర్ బీర్డ్ లుక్ లో ఈ పొలిటిషియన్ చాలా రఫ్ అండ్ రగ్గుడ్‌గా కనిపిస్తుంటారు. మెడలో ఏదో ఒక టవల్ అనేది కచ్చితంగా ఉంటుంది.

బాలయ్య రాజకీయాల్లో తిరుగుతున్నప్పుడు మామూలు మనిషి లాగా కనిపించరు. ఒక హీరో, రియల్ లయన్ లాగానే కనిపిస్తుంటారు. గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెబుతూ ఆకట్టుకుంటారు. ఒకప్పుడు ఈ హీరో నరసింహారాయుడు, సమరసింహారెడ్డి లాంటి లుక్ లో కనిపిస్తూ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనేవారు. ఇప్పుడు గడ్డంతో నయా లుక్ మైంటైన్ చేస్తున్నారు. ఈ హీరో వేసుకునే ప్యాంటు కూడా వైట్‌ లేదా క్రీం కలర్ లో ఉంటుంది. మొత్తం ఔట్ ఫిట్ ట్రెడిషనల్ గా ఉంటూనే ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇస్తుంది. ఏది ఏమైనా ఈ నందమూరి అందగాడు అటు సినిమాలో ఇటు పాలిటిక్స్ రెండింటిలోనూ అదిరిపోయే లుక్స్ లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>