MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila500be08-79c9-44cf-b3d2-2642fa5b6690-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhila500be08-79c9-44cf-b3d2-2642fa5b6690-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో గొప్ప గుర్తింపు కలిగిన కుటుంబలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుండి అక్కినేని నాగేశ్వరరావు మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగులో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కూడా అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన వారసులుగా నాగ చైతన్య , అఖిల్ ఇద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాakhil{#}akhil akkineni;surender reddy;Sony;Akkineni Nageswara Rao;sunday;Akkineni Nagarjuna;Naga Chaitanya;Hindi;Hero;Cinema;Teluguఎట్టకేలకు అఖిల్ మూవీ అప్డేట్ వచ్చింది.. అక్కినేని ఫ్యాన్స్ కి రిలీఫ్..!ఎట్టకేలకు అఖిల్ మూవీ అప్డేట్ వచ్చింది.. అక్కినేని ఫ్యాన్స్ కి రిలీఫ్..!akhil{#}akhil akkineni;surender reddy;Sony;Akkineni Nageswara Rao;sunday;Akkineni Nagarjuna;Naga Chaitanya;Hindi;Hero;Cinema;TeluguMon, 15 Jul 2024 11:52:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో గొప్ప గుర్తింపు కలిగిన కుటుంబలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుండి అక్కినేని నాగేశ్వరరావు మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నాగేశ్వరరావు ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగులో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఆ తర్వాత ఆయన వారసుడిగా అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన కూడా అద్భుతమైన విజయాలను అందుకొని ఇప్పటికి కూడా తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నటుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన వారసులుగా నాగ చైతన్య , అఖిల్ ఇద్దరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఇప్పటికే నాగ చైతన్య అనేక విజయాలను అందుకొని మంచి క్రేజ్ ఉన్న నటుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇక అఖిల్ విషయానికి వస్తే ఇప్పటి వరకు చాలా సినిమాలలో హీరోగా నటించిన అఖిల్ కి అద్భుతమైన విజయం మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు. కొన్ని రోజుల క్రితం అఖిల్ , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ మూవీ ఇప్పటి వరకు ఓ టీ టీ లోకి కూడా విడుదల కాలేదు. ఈ మూవీ ని సోనీ లీవ్ ఓ టి టి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారిక ప్రకటన వచ్చింది.

మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ మూవీ ఓ టి టి స్ట్రీమింగ్ ఆగిపోయింది. ఇకపోతే ఈ మూవీ హిందీ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది. ఈ మూవీ హిందీ బుల్లి తెరపై ప్రసారం కానుంది. ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ సాటిలైట్ హక్కులను గోల్డ్ మైన్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని జూలై 28 వ తేదీన ఆదివారం రోజు రాత్రి 8 గంటలకు ప్రసారం చేయనున్నట్లు గోల్డ్ మైన్స్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ఓ టీ టీ లోకి విడుదల కాకపోవడంతో అక్కినేని అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. కనీసం ఈ మూవీ హిందీ బుల్లి తెరపై ప్రసారం కానున్నందున  రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>