PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-going-in-the-direction-of-development-due-to-babu1336a98f-cc56-4d95-8fcb-a392e736d5e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ap-going-in-the-direction-of-development-due-to-babu1336a98f-cc56-4d95-8fcb-a392e736d5e3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్.. పేరు వినగానే మొదటగా అందరికీ గుర్తు వచ్చేది అప్పుడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీమాంధ్రకు... రాజధాని లేకుండా పోయింది. దీంతో ఆదాయం మొత్తం... నష్టపోవాల్సి వచ్చింది ఏపీ. ఇక 2014 నుంచి ఇప్పటివరకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం... ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలు ఒకటి కూడా నెరవేర్చలేదు. దీంతో ఏపీ అప్పుల భారం మరింత పెరుగుతోంది. chandrababu{#}Survey;Chakram;Telugu Desam Party;Capital;Telangana Chief Minister;swetha;YCP;Telangana;central government;CBN;Andhra Pradeshబాబు బిగ్‌స‌వాళ్లు : అప్పుల్లో ఏపీ.. 5 ఏళ్ళ పాటు చంద్రబాబుకు కష్టాలేనా?బాబు బిగ్‌స‌వాళ్లు : అప్పుల్లో ఏపీ.. 5 ఏళ్ళ పాటు చంద్రబాబుకు కష్టాలేనా?chandrababu{#}Survey;Chakram;Telugu Desam Party;Capital;Telangana Chief Minister;swetha;YCP;Telangana;central government;CBN;Andhra PradeshMon, 15 Jul 2024 07:35:00 GMT
* కేంద్రం ప్రత్యేక నిధులు తెచ్చుకోవాలి
* ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు
*ప్రత్యేక హోదా అడగాలి
*ఆర్థిక క్రమశిక్షణ



ఆంధ్రప్రదేశ్.. పేరు వినగానే మొదటగా అందరికీ గుర్తు వచ్చేది అప్పుడు.  ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత సీమాంధ్రకు... రాజధాని లేకుండా పోయింది. దీంతో ఆదాయం మొత్తం... నష్టపోవాల్సి వచ్చింది ఏపీ. ఇక 2014 నుంచి ఇప్పటివరకు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లోనే ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం... ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీలు  ఒకటి కూడా నెరవేర్చలేదు. దీంతో ఏపీ అప్పుల భారం మరింత పెరుగుతోంది.

 అయితే చంద్రబాబు తాజాగా... ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీ అప్పులపై... శ్వేత పత్రం కూడా రిలీజ్ చేశారు. ఈ లెక్కల ప్రకారం ఏపీ అప్పులు 14 లక్షల కోట్ల వరకు ఉన్నట్లు తేలింది. అంటే... అప్పలపై ప్రతిరోజు 75 కోట్ల వడ్డీ... ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాదు ఏపీలో ఉన్న ఒక్క శాతం జనాభా.. చేతిలోనే 44 శాతం ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా... 50 శాతం మంది ప్రజల వద్ద ఐదు శాతం ఆస్తులు ఉన్నట్లు.. సర్వే లెక్కలు కూడా తెలిపాయి.

ఇక దీనికి తోడు... కూటమి మొన్నటి ఎన్నికల్లో.. సూపర్ సిక్స్ పేరుతో  చాలా పథకాలను ప్రకటించింది. అందుకే ఏపీలో వైసిపి పార్టీ ఓడిపోయి తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పవచ్చు. అయితే... ఇప్పటి వరకు పెన్షన్లు మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్నికల కంటే ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలి.

 ఇప్పటికే అప్పుల్లో కూరుకు పోయిన ఏపీకి... ఆదాయం రావడం కష్టమే అని చెబుతున్నారు. కాబట్టి ఇప్పుడు... ప్రత్యేక హోదాపై చంద్రబాబు పోరాటం చేయాలి. కేంద్రంలో చక్రం తిప్పే... ఛాన్స్ చంద్రబాబు చేతిలో ఉంది. కాబట్టి ప్రతినెల... ఏపీకి ప్రత్యేక నిధులు తీసుకురావడం, ప్రత్యేక హోదా సంపాదించడం ఇలాంటివి చేయాలి చంద్రబాబు. అంతేకాకుండా ఏపీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేలా కేంద్రానికి.. విజ్ఞప్తి చేయాలి. అప్పుడే ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు..  విమర్శలు లేకుండా పాలన చేయగలుగుతారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>