PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/babu-big-sawan-chandrababu-sawaal-ap-cm-chandrababu-ap-chief-minister-chandrababu-naidu-ap-libites-ap-government-request580b485d-e7db-4123-90d5-f62ca3e95c71-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/babu-big-sawan-chandrababu-sawaal-ap-cm-chandrababu-ap-chief-minister-chandrababu-naidu-ap-libites-ap-government-request580b485d-e7db-4123-90d5-f62ca3e95c71-415x250-IndiaHerald.jpg- తొలి నెల‌లోనే రు. 7 వేల కోట్ల అప్పు చేసిన బాబు - జ‌గ‌న్ చేసిన అప్పుల‌కు యేడాదికి రు. 60 వేల కోట్ల వ‌డ్డీ క‌ట్టాలి - సూప‌ర్ 6 ప‌థ‌కాల‌కు బాబుకు మ‌రిన్ని అప్పులు త‌ప్ప‌వ్‌ ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నెల రోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజులు ఒకింత సాఫీగానే సాగిపోయింది. మొదటి నెల కావడంతో ఒకింత జోష్ గానే సర్కార్ పనిచేసిందని చెప్పాలి. అయితే, అసలు కథ‌ ఇప్పుడు మొదలవుతుంది. కీలకమైన పథకాలను అమలు చేయాల్సి రావడం, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు అదేవిధంగా సామాజిక భ‌ద్రBabu big sawan; Chandrababu Sawaal; AP CM Chandrababu; AP chief minister Chandrababu Naidu; AP libites; AP government request{#}Amaravathi;Josh;electricity;media;central government;Reddy;Government;kalyan;India;CBNబాబుకు బిగ్ స‌వాల్‌: అప్పులు - వ‌డ్డీలు - అప్పులు..!బాబుకు బిగ్ స‌వాల్‌: అప్పులు - వ‌డ్డీలు - అప్పులు..!Babu big sawan; Chandrababu Sawaal; AP CM Chandrababu; AP chief minister Chandrababu Naidu; AP libites; AP government request{#}Amaravathi;Josh;electricity;media;central government;Reddy;Government;kalyan;India;CBNMon, 15 Jul 2024 08:12:00 GMT- తొలి నెల‌లోనే రు. 7 వేల కోట్ల అప్పు చేసిన బాబు
- జ‌గ‌న్ చేసిన అప్పుల‌కు యేడాదికి రు. 60 వేల కోట్ల వ‌డ్డీ క‌ట్టాలి
- సూప‌ర్ 6 ప‌థ‌కాల‌కు బాబుకు మ‌రిన్ని అప్పులు త‌ప్ప‌వ్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నెల రోజులు పూర్తయ్యాయి. ఈ నెల రోజులు ఒకింత సాఫీగానే సాగిపోయింది. మొదటి నెల కావడంతో ఒకింత జోష్ గానే సర్కార్ పనిచేసిందని చెప్పాలి. అయితే, అసలు కథ‌ ఇప్పుడు మొదలవుతుంది. కీలకమైన పథకాలను అమలు చేయాల్సి రావడం,  ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు అదేవిధంగా సామాజిక భ‌ద్ర‌తా పింఛన్లు.. ఇతరత్రా కార్యక్రమాలకు నిధుల కొరత వెంటాడుతోంది. తొలి  నెల మాత్రం అప్పటికే ఉన్న  5000 కోట్ల రూపాయలు వినియోగించుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి 7000 కోట్ల రూపాయలను అప్పు రూపంలో తెచ్చుకున్నారు.


కానీ, ఇప్పుడు మరో 15 రోజుల్లో మళ్లీ ఒకటో తారీకు రానుంది. అప్ప‌టికి సామాజిక భద్రతా పింఛన్ల కింద.. 3,500 కోట్ల రూపాయలపై చిలుకు మొత్తాన్ని ప్రజలకు అందించాలి. అదేవిధంగా ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు ఇతరత్రా పథకాలకు కూడా నిధులు ఇవ్వాల్సిన  పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మళ్లీ అప్పుల బాట పట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఏడాదికి 60 వేల కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో పోతుంది. ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో ఈ విషయంపై చంద్రబాబు నాయుడును బ్యాంకులు ప్రశ్నించాయి.


ఆ నిధుల కోసం ఇప్పుడు చంద్రబాబు వేట ప్రారంభించారు. ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు ఉద్యోగుల వేతనాలు.. వీటికే అమౌంట్ సరిపోని పరిస్థితిలో ఇప్పుడు మళ్లీ నూతన పథకాలు వెంటాడుతున్నాయి. వాటిని ఎప్పుడు ప్రారంభించాలనే విష యంపై ఇంకా నిర్ణయం తీసుకోన‌ప్పటికీ.. ఏదో ఒక రూపంలో వచ్చే రెండు మూడు నెలల్లో కొన్నింటిని అయినా ప్రారంభించాల్సి ఉంది. దీంతో అప్పులు చేయాల్సిన తప్ప‌ని పరిస్థితి చంద్రబాబు ముందు కనిపిస్తుంది. ఇదే జరిగితే ఇప్పటికే చెల్లించాల్సిన వడ్డీలు గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు  చంద్రబాబుకు మరింత భారంగా ప‌రిణ‌మించే అవకాశం ఉంది.


ఇంకో వైపు కేంద్ర ప్రభుత్వం రానున్న బడ్జెట్లో అప్పులపై పరిమితిని మరింత పెంచే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియా చెబుతోంది. అంటే ఇప్పటివరకు రాష్ట్రాలకు కొన్ని కీలక సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా అప్పుల పరిమితిని పెంచింది. ఇప్పుడు ఆ అప్పుల పరిమితిని మరింత పెంచ‌డంతో.. మరిన్ని కీలక పథకాలను అమలు చేయాలన్న షరతును విధించనుంది. ఉదాహరణకు గతంలో జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్ను విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీన్ని అప్పటిలో చంద్రబాబు తప్పుప‌ట్టారు. ప్రతిపక్షాలు కూడా యావగించుకున్నాయి. ప్రజలు కూడా తిప్పి కొట్టారు.


ఇలా చెత్త పై పన్నును విధించడం ద్వారా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్మోహన్ రెడ్డి మరిన్ని అప్పులు తీసుకున్నారు. అట్లానే విద్యుత్తు మీటర్లు.. రైతులకు సంబంధించిన విద్యుత్ వాడకానికి సంబంధించిన స్మార్ట్ మీటర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధించిన షరతులు కూడా అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అంగీకరించడానికి ఇదే కారణం. రైతులు వినియోగించే విద్యుత్తుకు స్మార్ట్ మీటర్లు పెడితే మరిన్ని అప్పులు ఇస్తామని షరతు విధించడంతో జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారు. ఆ కారణంగానే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల వ్యవసాయ విద్యుత్‌కు స్మార్ట్ మీటర్లు వినియోగించే పథకాన్ని తీసుకొచ్చారు.


ఇక గృహ విద్యుత్తు కూడా స్మార్ట్ మీటర్లు వినియోగం ఆనాడు తీసుకురావడానికి ఇదే కారణం. `అప్పులు ఎక్కువ ఇస్తాం. మీరు మేం చెప్పిన కార్యక్రమాలు అమలు చేయండి` అని గత మోడీ ప్రభుత్వం షరతులు విధించడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధిలేని పరిస్థితిలో అప్పులు చేసింది. దీనికి ప్ర‌తిగా ఆయా పథకాలను అమలు చేసింది. అయితే అప్పట్లో తప్పు పట్టిన చంద్రబాబు ప్రస్తుతం వాటిని రద్దు చేయాలని చూస్తున్నారు. అంటే స్మార్ట్ మీటర్లను వినియోగంలోకి తీసుకురాకుండా ఉండడం, చెత్త మీద పన్నును ఇప్పటికే రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వంటివి చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇకమీదట ఆయా పథకాల కింద ఇచ్చిన  అప్పులను త‌గ్గించ‌నుంది.


లేకపోతే ఇకమీదట అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త వహించడం అనేది కళ్ళ ముందు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు అటు అప్పులు ఇటు వడ్డీలు రాబోయే భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాలు వంటివి ప్రధాన సమస్యలుగా మారాయి. ఆయన అనుభవాన్ని రంగ‌రించినా ఇప్పటికిప్పుడైతే పెట్టుబడులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు వచ్చే రోజులు తీవ్ర సంక‌టంగానే మారుతాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>