PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn-7130e22f-b97e-43ed-b210-7eec6f08bf94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn-7130e22f-b97e-43ed-b210-7eec6f08bf94-415x250-IndiaHerald.jpgచంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీకి మరోసారి సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఏపీకి అప్పుల భారం చాలా ఎక్కువ అయింది. వడ్డీలు కట్టుకోలేక, మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక టీడీపీ కూటమి తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. అయితే ఈ 5 ఇయర్స్‌లో పాలన, అభివృద్ధి పరంగా సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ తర్వాత కూడా ఆయనకు రాజకీయంగా ఛాలెంజ్‌లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.CBN {#}bus;Sharmila;Assembly;Revanth Reddy;TDP;Narendra Modi;India;YCP;Congress;Telangana;Jagan;CM;CBN;Andhra Pradeshబాబు బిగ్‌సవాళ్లు: ఐదేళ్లలో బాబుకు మరో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు..??బాబు బిగ్‌సవాళ్లు: ఐదేళ్లలో బాబుకు మరో ఇద్దరు బలమైన ప్రత్యర్థులు..??CBN {#}bus;Sharmila;Assembly;Revanth Reddy;TDP;Narendra Modi;India;YCP;Congress;Telangana;Jagan;CM;CBN;Andhra PradeshMon, 15 Jul 2024 07:59:00 GMT
• చంద్రబాబుకు రాజకీయంగా సవాళ్లు  

• అప్పుడే టార్గెట్ చేయడం మొదలు పెట్టిన షర్మిల  

• రహస్యంగా బాబు ఓటమికి ప్లాన్ చేస్తున్న రేవంత్ రెడ్డి

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

చంద్రబాబు నాయుడు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఏపీకి మరోసారి సీఎం అయ్యారు. ప్రస్తుతం ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఏపీకి అప్పుల భారం చాలా ఎక్కువ అయింది. వడ్డీలు కట్టుకోలేక, మరోవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక టీడీపీ కూటమి తీవ్ర ఇబ్బందులను ఫేస్ చేస్తుంది. అయితే ఈ 5 ఇయర్స్‌లో పాలన, అభివృద్ధి పరంగా సవాళ్లు ఎదుర్కొంటారు. ఆ తర్వాత కూడా ఆయనకు రాజకీయంగా ఛాలెంజ్‌లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

వచ్చే ఐదేళ్లలోగా కేవలం వైసీపీ అధినేత జగన్ మాత్రమే కాకుండా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబుకి అతిపెద్ద ప్రత్యర్థులు కానున్నారు. వైఎస్ షర్మిల టీడీపీకి అనుకూలంగా మారిపోయారంటూ వైసీపీ నేతలు కామెంట్లు చేస్తున్నారు కానీ ఆమె తీరు మాత్రం అలా కనిపించడం లేదు. చంద్రబాబును వీలు చిక్కినప్పుడల్లా ఏకిపారేస్తున్నారు. మహిళలకి ఫ్రీ బస్సు ప్రయాణం హామీ ఇంకా అమల్లోకి తీసుకు రాలేదని షర్మిల బాబుపై ఇటీవల మండిపడిన సంగతి తెలిసిందే. జగన్ కంటే షర్మిలనే బాబును కరెక్ట్ గా, ధైర్యంగా ప్రశ్నిస్తున్నారు. ఈ చిన్న పథకాన్ని కూడా అమలు చేయలేక పోతే ఎందుకు మీరు అన్నట్టు ఆమె ఫైర్ అయ్యారు.

మోదీని అడిగి ఏపీకి పోలవరం, స్పెషల్ స్టేటస్ ఎందుకు తేలేకపోతున్నారని కూడా టీడీపీ కూటమిని విమర్శించారు. మోదీ అంటేనే మోసం అంటూ అన్ని పార్టీల వారిని టార్గెట్ చేశారు. ఇక రేవంత్ రెడ్డి ఏపీలో కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటే ఒకదానికి ఒకటి సహకరించుకుంటూ రాష్ట్రానికి మరిన్ని ప్రయోజనాలు అందించవచ్చు. అందుకే రేవంత్ రెడ్డి బాబు ఓటమికే వ్యూహాలు పన్నవచ్చు. షర్మిలతో కలిసి గద్దె దించే ప్రయత్నం చేయవచ్చు. బాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే చాలా వ్యతిరేకత వస్తుంది. ప్రత్యామ్నాయంగా షర్మిల, కాంగ్రెస్ వైపు ప్రజలు మళ్లవచ్చు. 2029 ఎన్నికల్లో జగన్, బాబు గెలుపు సాధించడానికి చాలా కష్టపడాల్సి రావచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>