Virallakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/rachcha-for-air-coolerthe-bride-made-wedding-fireworks5513c1e6-8aa3-4926-a7c0-4f58e91a06d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/rachcha-for-air-coolerthe-bride-made-wedding-fireworks5513c1e6-8aa3-4926-a7c0-4f58e91a06d1-415x250-IndiaHerald.jpgఎయిర్ కూలర్ వద్ద కూర్చోవడం వధూవరుల బంధవులు కోట్లాటకు దిగారు. దీంతో వరుడి బంధువుల ప్రవర్తనను వధువు నిందిసింది. షుర్షణ మరింత ముదరడంతో ఏకంగా పెళ్లిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వరుడు, వధువు తండ్రితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చిత్బరగావ్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పెళ్లి జరుగుతోంది. అయితే ఎయిర్ కూలర్ ముందున్న కుర్చీలపై కూర్చోవడంపై వరుడి కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య వగ్వాదం జరిగింది. ఇది తీవ్రం కావటంతో ఇరు వర్గాల వారు కొట్టుకున్నsocial media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Rachcha ; air ; air cooler; wedding {#}Uttar Pradesh;marriage;Friday;Traffic police;Father;Yashasvi Jaiswal;policeఎయిర్ కూలర్ కోసం రచ్చ.. పెళ్లి పెటాకులు చేసిన వధువు..!ఎయిర్ కూలర్ కోసం రచ్చ.. పెళ్లి పెటాకులు చేసిన వధువు..!social media ; viral news ; telugu news ; trendy news ; popular news ; tollywood news ; filmy news ; filmy updates ; latest updates ; latest film updates ; star heroine ;Rachcha ; air ; air cooler; wedding {#}Uttar Pradesh;marriage;Friday;Traffic police;Father;Yashasvi Jaiswal;policeMon, 15 Jul 2024 09:37:00 GMTఎయిర్ కూలర్ వద్ద కూర్చోవడం వధూవరుల బంధవులు కోట్లాటకు దిగారు. దీంతో వరుడి బంధువుల ప్రవర్తనను వధువు నిందిసింది. షుర్షణ మరింత ముదరడంతో ఏకంగా పెళ్లిని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో వరుడు, వధువు తండ్రితో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని బల్లియా జిల్లాలో ఈ ఘటన జరిగింది. చిత్బరగావ్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక పెళ్లి జరుగుతోంది. అయితే ఎయిర్ కూలర్ ముందున్న కుర్చీలపై కూర్చోవడంపై వరుడి కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య వగ్వాదం జరిగింది. ఇది తీవ్రం కావటంతో ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. కాగా, వరుడు బంధువుల ప్రవర్తనను పెళ్లికూతురు నిలదీసింది. దీంతో వివాదం కాస్త మరింత మారింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన వధువు పెళ్లి క్యాన్సిల్ చేసింది. పెళ్లి కొనసాగింపును నిరాకరించింది.


ఇరు కుటుంబాలు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ పెళ్లి రద్దు నిర్ణయాన్ని ఆమె మార్చుకోలేదు. మరోవైపు గ్రామంలోని పంచాయితీ వద్దకు ఈ వివాదం చేరింది. చర్చల్లో ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వరుడు హుకుమ్ చంద్ జైస్వాల్, అతడి బంధువు పంకజ్, వధువు తండ్రి నంద్ జి గుప్తా, ఆమె సోదరుడు రాజేష్ గుప్తాను పోలీసులు అరెస్ట్ చేశారు.


అయితే వధువు పెళ్లి రద్దు చేయటంపై మన్తఫాబాద్ కు చెందిన వరుడు హుకుమ్ చంద్ జైస్వాల్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి తంతు ముగుస్తుండగా కూలర్ వద్ద కూర్చోవడంపై తమ కుటుంబ సభ్యులు, వధువు బంధువుల మధ్య గొడవ జరిగినట్లు తెలిపాడు. పెళ్లిని రద్దు చేసుకోవద్దని వధువును తాను వేడుకున్నట్లు తెలిపాడు. పెళ్లిలో చిన్న గొడవలు జరుగుతాయని చెప్పి ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. అయినప్పటికీ పూర్తి కావస్తున్నా పెళ్లి కొనసాగడాన్ని వధువు నిరాకరించిందని అన్నాడు. ఇరువురి బంధువుల కొట్లాటలో తన ప్రమేయం ఏమీ లేకపోయినా పర్యవసానాలను తాను భరించాల్సి వచ్చిందని చెప్పాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>