PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-tdp-cm-chandrababu-babu-cadre3eda8c4d-c8f3-4f76-8c49-f593f555d318-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-tdp-cm-chandrababu-babu-cadre3eda8c4d-c8f3-4f76-8c49-f593f555d318-415x250-IndiaHerald.jpgకూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నామినేటెడ్ పోస్ట్‌లపై పెద్ద చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో భాగస్వాములు అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు పదవులపై చాలా అసలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వస్తే ఎలాంటి పదవులు తీసుకోవాలి అని ముందు నుంచే నాయకులు లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు కూట‌మి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో.. నామినేటెడ్ పదవులను త్వరలో ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో.. నాయకులు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీళ్ళchandrababu; tdp; cm chandrababu; babu; cadre{#}Bharatiya Janata Party;Survey;CBN;Government;Partyచంద్ర‌బాబు మ‌ళ్లీ కేడ‌ర్‌ను ముంచేస్తున్నారా... ఇదేం చెత్త ప‌నంటూ గ‌గ్గోలు..?చంద్ర‌బాబు మ‌ళ్లీ కేడ‌ర్‌ను ముంచేస్తున్నారా... ఇదేం చెత్త ప‌నంటూ గ‌గ్గోలు..?chandrababu; tdp; cm chandrababu; babu; cadre{#}Bharatiya Janata Party;Survey;CBN;Government;PartyMon, 15 Jul 2024 10:56:12 GMTకూటమి ప్రభుత్వం కొలువుదీరి నెల రోజులు దాటింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి నామినేటెడ్ పోస్ట్‌లపై పెద్ద చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో భాగస్వాములు అయిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల నాయకులు పదవులపై చాలా అసలు పెట్టుకున్నారు. ప్రభుత్వం వస్తే ఎలాంటి పదవులు తీసుకోవాలి అని ముందు నుంచే నాయకులు లెక్కలు వేసుకున్నారు. ఇప్పుడు కూట‌మి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో.. నామినేటెడ్ పదవులను త్వరలో ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో.. నాయకులు తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. వీళ్ళ ఆశలు ఇలా ఉంటే చంద్రబాబు మాత్రం పదవుల భర్తీలో పెద్ద ట్విస్ట్ ఇస్తున్నారు.


కూటమి అధికారంలోకి రావడానికి ఏ ఏ నాయకులు బాగా పనిచేశారు..? వారికి పదవులు ఇవ్వవచ్చా..? అనే అంశంపై చంద్రబాబు వాయిస్ ఓవర్‌తో ఐవీఆర్ఎస్ సర్వే జరుగుతుంది. ఈ సర్వే ఇప్పుడు పార్టీ నాయకుల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇది ఎక్కడ న్యాయం..? అంటూ నాయకులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. పదవులు ఇప్పట్లో ఇవ్వకూడదు.. కాలయాపన చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఇలా సర్వేలు చేయిస్తున్నారా అని సొంత పార్టీ నేతలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ముందు నుంచి కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే విషయంలో కాలయాపన చేస్తూ ఉంటారు.


పార్టీ అధికారంలోకి వచ్చాక నెలలు ఏళ్ళు గడుస్తున్నా కూడా భర్తీ చేయని పదవులు చాలా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు పాత పద్ధతిలోనే ముందుకు వెళుతుండటం ఎవరికి నచ్చటం లేదు. మీ జిల్లాలో.. మీ నియోజకవర్గంలో పలానా పోస్టుకు ఏ నాయకుడైతే సరైన వ్యక్తి.. ఆయన నిజంగా పార్టీ కోసం కష్టపడుతున్నాడా.. అయితే మీ సమాధానం ఇవ్వండి అంటూ సర్వే జరుగుతుంది. గతంలో ఎప్పుడూ ఇలా నామినేటెడ్ పోస్టులకు సర్వేలు చేయలేదని మూడు పార్టీల నాయకులు వాపోతున్నారు. దీంతో చాలామంది తమకు పదవులు వస్తాయా.. రావా.. అని తీవ్ర ఆందోళనతో ఉన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>