PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy-chandrababu-telangana-ap-vibhajana-samasyalu-4f764c10-9bef-4622-9119-19462004e297-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/revanth-reddy-chandrababu-telangana-ap-vibhajana-samasyalu-4f764c10-9bef-4622-9119-19462004e297-415x250-IndiaHerald.jpg2014 ముందు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండేవి. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం మొదలై రెండు రాష్ట్రాలు విభజన తర్వాత ఎక్కడికక్కడ పంపకాలు జరిగిపోయాయి. ఎవరి పాలన వారికి వచ్చేసింది. తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాల్లో ఉన్నా కానీ, విభజన తర్వాత ఎవరి రాజకీయం వారికే సెట్ అయిపోయింది. ఇదే తరుణంలో ఉమ్మడిగా పది సంవత్సరాలపాటు హైదరాబాద్ రాజధానిగా ఉంచుకోవాలని విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఆ విధంగానే గత నెల క్రింది వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. దానికి గడువు ముగిREVANTH REDDY;CHANDRABABU;TELANGANA;AP;VIBHAJANA SAMASYALU;{#}Tirupati;electricity;central government;Khammam;Hyderabad;revanth;Telangana;Revanth Reddy;Telugu;CBN;Andhra Pradeshబాబు రేవంత్: పాత ప్రేమ కొత్తగా చిగురిస్తోందా..విభజన పేరుతో కొత్త రాజకీయమా.?బాబు రేవంత్: పాత ప్రేమ కొత్తగా చిగురిస్తోందా..విభజన పేరుతో కొత్త రాజకీయమా.?REVANTH REDDY;CHANDRABABU;TELANGANA;AP;VIBHAJANA SAMASYALU;{#}Tirupati;electricity;central government;Khammam;Hyderabad;revanth;Telangana;Revanth Reddy;Telugu;CBN;Andhra PradeshSun, 14 Jul 2024 07:54:00 GMT- పదేళ్లుగా కొలిక్కిరాని సమస్యలు..
-  దృష్టి పెట్టిన కొత్త సీఎంలు..
- పరిష్కారం చూపిస్తారా? రాజకీయంగా పబ్బం గడుపుతారా.?


2014 ముందు తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండేవి. ఇదే సమయంలో తెలంగాణ ఉద్యమం మొదలై రెండు రాష్ట్రాలు విభజన తర్వాత ఎక్కడికక్కడ పంపకాలు జరిగిపోయాయి. ఎవరి పాలన వారికి వచ్చేసింది. తెలుగు మాట్లాడేవారు రెండు రాష్ట్రాల్లో ఉన్నా కానీ, విభజన తర్వాత ఎవరి రాజకీయం వారికే సెట్ అయిపోయింది. ఇదే తరుణంలో ఉమ్మడిగా పది సంవత్సరాలపాటు హైదరాబాద్ రాజధానిగా ఉంచుకోవాలని విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కండిషన్ పెట్టింది. ఆ విధంగానే గత నెల క్రింది వరకు హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంది. దానికి గడువు ముగిసిపోవడంతో ఇక ఉమ్మడి రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి కొన్ని ఆస్తులు, అప్పులు, విభజన సమస్యలను క్లియర్ చేసుకోవాలని అనుకుంటున్నారు. ఇదే తరుణంలో ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఇద్దరు ఒకే జెండాలో పెరిగినటువంటి నాయకులు. ఇద్దరూ రెండు రాష్ట్రాలకు సీఎంలుగా మారారు. వీరి మధ్య ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. మరి ఈ మంచితనంతో అయినా విభజన సమస్యలు తీరుస్తారని చాలామంది భావిస్తున్నారు.
 
 సాధ్యం కానీ విభజన సమస్యలు:
 ప్రస్తుతం విభజన  సమస్యల్లో కీలకంగా ఉన్నది తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లినటువంటి ఏడు మండలాలు. అంతేకాకుండా మరికొన్ని ఉమ్మడి ఆస్తులు, విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల సమస్యలు ఇలా మరెన్నో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఏడు మండలాల సమస్య.  ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు విభజన సమయంలో ఆర్డినెన్స్ కింద ఆంధ్రప్రదేశ్ లో కలిపేశారు.ఆ ఏడు మండలాలు తెలంగాణ కావాలని అడుగుతోంది.  ఒకవేళ కొత్తగా వచ్చిన చంద్రబాబు ఈ ఏడు మండలాలను తెలంగాణకి ఇస్తే ఆంధ్రప్రదేశ్ లో దారుణంగా విఫలమవుతారు. అంతేకాకుండా  చంద్రబాబు అడుగుతున్నటువంటి తెలంగాణకు సంబంధించిన బిల్డింగులు హైదరాబాదులో పొత్తు  వీటికి రేవంత్ ఒప్పుకుంటే ఇక తెలంగాణను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో కలిపేస్తున్నారని బీఆర్ఎస్ గగ్గోలు పెడుతుంది.  

ఈ విధంగా ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టు రెండు రాష్ట్రాల సీఎంల పరిస్థితి తయారయ్యింది. కేవలం అప్పులు, చిన్న సమస్యలు తప్ప ఏడు మండలాలు కానీ, హైదరాబాదులోని బిల్డింగులు కానీ  తెలంగాణ ఏపీకి ఇచ్చే పరిస్థితి లేదు. ఏపీలో ఉన్న ఏడు మండలాలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో పొత్తు తెలంగాణకు ఇచ్చే పరిస్థితి రాదు. కానీ ఈ సమస్యను ప్రతిసారి లేవనెత్తుతూ రెండు రాష్ట్రాల సీఎంలు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల పేరుతో స్లోగా చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీని విస్తరించాలని ఆలోచన చేస్తున్నారు. అసాధ్యం కానటువంటి హామీలను సాధ్యం చేస్తామని చెప్పడం వెనుక వారి రాజకీయ అవసరాలు ఎన్నో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>