PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-bhadrachalam-chandrababu-ap-telangana35bd8726-31ac-4cb2-b3e7-14cf86283fd6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-bhadrachalam-chandrababu-ap-telangana35bd8726-31ac-4cb2-b3e7-14cf86283fd6-415x250-IndiaHerald.jpgఒకప్పుడు దేశంలోనే తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు దేశస్థాయిలో మంచి స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా దేశ స్థాయిలో ప్రధానిగా కూడా తెలుగు నాయకులు బాధ్యతలు చేపట్టారు. అలా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో ఎంతోమంది నాయకులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. కానీ రాష్ట్రం ఎప్పుడైతే రెండు ముక్కలైందో ఇక అప్పటినుంచి ఏపీ నాయకులు ఏపీలోనే రాజకీయం చేయడం, తెలంగాణకు సంబంధించిన నాయకులుREVANTH REDDY;BHADRACHALAM;CHANDRABABU;AP;TELANGANA{#}CBN;KCR;Delhi;polavaram;CM;Polavaram Project;TDP;Reddy;Bhadrachalam;Chakram;Government;revanth;Telangana;Revanth Reddy;Telugu;Andhra Pradeshచంద్రబాబు-రేవంత్: భద్రాద్రి రామయ్య సాక్షిగా ఏడు మండలాల సంగతేంటి.?చంద్రబాబు-రేవంత్: భద్రాద్రి రామయ్య సాక్షిగా ఏడు మండలాల సంగతేంటి.?REVANTH REDDY;BHADRACHALAM;CHANDRABABU;AP;TELANGANA{#}CBN;KCR;Delhi;polavaram;CM;Polavaram Project;TDP;Reddy;Bhadrachalam;Chakram;Government;revanth;Telangana;Revanth Reddy;Telugu;Andhra PradeshSun, 14 Jul 2024 07:11:00 GMT-భాష ఒక్కటే రాష్ట్ర సరిహద్దులే వేరు..
- ఆ ఏడు మండలాలు  తెలంగాణవా? ఏపీవా?
- గురు శిష్యుల పాలనలో విభజన సమస్యలు పరిష్కారమయ్యేనా.?


ఒకప్పుడు దేశంలోనే తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏంటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ మాత్రమే గుర్తుకు వచ్చేది. అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులు దేశస్థాయిలో మంచి స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా దేశ స్థాయిలో ప్రధానిగా కూడా తెలుగు నాయకులు బాధ్యతలు చేపట్టారు. అలా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో ఎంతోమంది నాయకులు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. కానీ రాష్ట్రం ఎప్పుడైతే రెండు ముక్కలైందో ఇక అప్పటినుంచి ఏపీ నాయకులు ఏపీలోనే రాజకీయం చేయడం, తెలంగాణకు సంబంధించిన నాయకులు తెలంగాణలో రాజకీయం చేయడం మొదలైంది. కానీ ఇటు ఏపీతో మరియు అటు తెలంగాణతో రెండు ప్రాంతాలలో అద్భుతమైనటువంటి పేరు కలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన చంద్రబాబునాయుడు అని చెప్పవచ్చు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు సీఎం గా చేశారు. ఆ సమయంలోనే ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రస్తుతం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మొదటి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి కేసీఆర్ కూడా చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా చేసిన వ్యక్తే.

అంతేకాకుండా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన శిష్యుడే. ఈ విధంగా టిడిపి ద్వారా ఎంతో మంది రాజకీయ నాయకులు తయారు చేసినటువంటి చంద్రబాబు నాయుడు  రాష్ట్ర విభజన తర్వాత రెండవసారి  ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అద్భుతమైన మెజారిటీ సాధించి కేవలం ఏపీలోనే కాకుండా, ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా కీలకమైన వ్యక్తిగా మారాడు. దీంతో ఈసారైనా విభజనకు సంబంధించి సమస్య క్లియర్ చేసుకోవాలని  అనుకుంటున్నారట రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, ప్రజలు.ఇదే సమయంలో రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలతో విడిపోవలసి వచ్చింది. ఆ సమస్యలు క్లియర్ చేయాలంటే రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు నిశితంగా  ఆలోచన చేసి  ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ఈ తరుణంలో  చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు అయితేనే ఈ సమస్యలు క్లియర్ చేయగలరని ఒక ఆలోచన తెలుగు ప్రజల్లో వచ్చింది. ఇదే తరుణంలో విభజన సమస్యలపై ఈ మధ్య కాలంలోనే ఒక భేటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించి అధికారులు మరియు మంత్రులతో కలిపి రెండు కమిటీలు వేశారు. ఆ కమిటీల నిర్ణయం మేరకు విభజన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక విభజన సమస్యల్లో భాగంగా ఏపీకి వెళ్లినటువంటి తెలంగాణలోని ఏడు మండలాల ఇష్యూ గురించి విపరీతంగా చర్చ సాగుతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 ఏడు మండలాల సంగతేంటి :
 తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలోనే తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఏడు మండలాలను ఏపీలో కలిపేశారు. ఇలా కలపడానికి ప్రధాన కారణం పోలవరం ప్రాజెక్ట్.  ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏడు మండలాలకు ఏవైనా ఎఫెక్ట్ పడితే రాబోవు రోజుల్లో ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఆ ఏడు మండలాలను ఏపీలో కలుపుకుంటే ఆ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చని భావించారు. దీంతో ఏడు మండలాలను కలపాలని చెప్పి మోడీకి తెలియజేయడంతో ఆయన బిల్ పాస్ చేసేసారు. ఇంతకీ ఆ ఏడు మండలాలు ఏంటయ్యా అంటే  వేలేరుపాడు, కుక్కునూరు, బూర్గంపాడు, చింతూరు, కూనవరం,  వర రామచంద్రాపురం, భద్రాచలం ఇలా ఏడు మండలాలు ఏపీలో విలీనం చేసుకున్నారు. ప్రజలంతా తెలంగాణలో ఉంటాం అన్నా కానీ  ప్రభుత్వం కేంద్రం  బిల్ పాస్ చేయడంతో ఈ మండలాల కలిసిపోయాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పాలించే కేసీఆర్ కూడా ఏడు మండలాల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ తాజాగా ఏపీలో చంద్రబాబు సీఎం, తెలంగాణలో రేవంత్ రెడ్డి  సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూ పై వారిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.. ఒకవేళ వీరి మధ్య ఉన్నటువంటి చర్చలు సఫలం అయితే మాత్రం ఏడు మండలాలకు సంబంధించి ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>